News
News
వీడియోలు ఆటలు
X

Mango: మామిడిపండును తిన్నాక నీళ్లు తాగితే ఇలా జరిగే అవకాశం

వేసవిలోనే మామిడి పండ్లు అధికంగా లభిస్తాయి. వీటిని తినే వారి సంఖ్య చాలా ఎక్కువ.

FOLLOW US: 
Share:

వేసవి సీజన్ వచ్చిందంటే రోడ్లమీద మామిడి పండ్లు కుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటారు. ఇది ఒక ఉష్ణ మండల పండు, అంటే వేసవి వాతావరణంలోనే ఇది పండుతుంది. పండ్లలో రారాజుగా పేరు తెచ్చుకుంది. రుచిలోనే కాదు, ఆరోగ్యం అందించే విషయంలో కూడా ఇది మేటి. ఈ పండును తినేందుకు ఎంతోమంది ఆతృతగా వేసవి కోసం వేచి ఉంటారు. అయితే మామిడిపండును తిన్నాక కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. వీటిని తినడం వల్ల కొంతమందిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మామిడిపండు తిన్నాక కొన్ని రకాల ఆహారాలు తింటే ఆరోగ్యానికి హాని కలిగే ఛాన్సులు ఉన్నాయి. మామిడిపండు తిన్నాక ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకోండి. 

పెరుగు 
చాలామంది పండిన మామిడిని పెరుగులో కలుపుకొని తింటారు. పెరుగులో మామిడిపండు ముక్కలను వేసుకొని స్పూనుతో తింటూ ఉంటారు. నిజానికి ఈ ఆహార కలయిక ఆరోగ్యానికి చాలా హానికరం.  ఈ రెండు ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందిలో పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

కాకరకాయ 
వేసవికాలంలో పండే కూరగాయలలో కాకరకాయ కూడా ఒకటి. మామిడిపండు వేసవిలోనే లభిస్తుంది. అయితే ఈ రెండు ఆహారాలు ఒకేరోజు తక్కువ గ్యాప్ తో తినడం మంచిది కాదు. మామిడిపండు తిన్నాక భోజనంలో కాకరకాయ తినడం వల్ల ఆయుర్వేదం ప్రకారం వికారం, వాంతులు వస్తాయి. లేదా భోజనంలో కాకరకాయని తిన్నాక భోజనం తర్వాత మామిడిపండును తినడం నివారించాలి.

స్పైసీ ఫుడ్ 
స్పైసి ఫుడ్‌ని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ. స్పైసీ ఫుడ్ ను తిన్నాక మామిడిపండును తింటే జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్పైసీ ఫుడ్స్ తిన్నాక మామిడిపండును తినడం లేదా మామిడిపండును తిన్నాక స్పైసీ ఫుడ్స్ తినడం మానుకోవాలి. 

కూల్ డ్రింకులు 
వేసవిలో కూల్ డ్రింకులు ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఎండను తట్టుకోలేక చల్లని పానీయాలు తాగేవారు ఎంతోమంది. సోడా లేదా శీతలపానీయాలు తాగాక, మామిడి పండ్లను తినడం మానుకోవాలి. ఎందుకంటే మామిడిపండులో చక్కెర నిల్వలు ఎక్కువ. అలాగే సోడా, శీతల పానీయాలలో కూడా చక్కెర అధికంగా ఉంటుంది. ఈ రెండింటినీ తినడం వల్ల ఆ రోజు  రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. ఇవి అనేక సమస్యలను తెచ్చిపెడతాయి.

నీళ్లు 
చాలామంది దీన్ని నమ్మరు కానీ కొంతమందికి మామిడిపండు తిన్న తర్వాత నీరు తాగితే విరోచనాలు అయ్యే అవకాశం ఎక్కువ. అందుకే మామిడిపండు తిన్నాక ఒక గంట వరకు నీరు తాగకూడదు. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. నీళ్ల విరేచనాలు అయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరంగా కూడా అనిపిస్తుంది.

Also read: జుట్టు బాగా పెరగాలంటే జింక్ కావాలి, జింక్ కావాలంటే వీటిని తినాలి

Also read: ఈ ఎమోజీలలో ఒకటి మాత్రం భిన్నంగా ఉంది, దాన్ని 15 సెకండ్లలో కనిపెడితే మీరు సూపర్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 29 Apr 2023 10:41 AM (IST) Tags: Mango Mango Benefits Eating Mango Mango Food combination

సంబంధిత కథనాలు

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?