By: Haritha | Updated at : 26 Apr 2023 09:36 AM (IST)
ఆప్టికల్ ఇల్యూషన్
రకరకాల హావభావాలను చూపించే ఎమోజీలు వాడుకలో ఉన్నాయి. అలాంటి ఎమోజీలతో తయారుచేసిన ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. ఇందులో ఎన్నో ఎమోజీలు ఉన్నాయి. అన్ని ఒకేలాంటి హావభావాలను ఇస్తున్నాయి. కానీ ఒక్కటి మాత్రం కాస్త భిన్నంగా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అది కూడా కేవలం 15 సెకండ్లలోనే. 10 నిమిషాలు సమయం ఇస్తే ఆ ఎమోజిని ఎవరైనా ఈజీగా కనిపెట్టేస్తారు. కానీ 15 సెకండ్లలో ఎవరు కనిపెడతారో వారే చురుకైన చూపు, తెలివైన మెదడు కలవారని అర్.థం అలాగే వారిలో మెదడు, కంటి చూపు సమన్వయంతో పనిచేస్తున్నాయని కూడా అర్థం చేసుకోవాలి.
జవాబు ఇదిగో
అన్ని ఎమోజీలు రెండు కనుబొమ్మలను పైకి ఎత్తి చూస్తున్నాయి. కానీ పై నుండి మూడవ వరుసలో ఉన్న 5వ ఎమోజిని చూడండి. అది కాస్త భిన్నంగా చూస్తోంది. మీరు దీన్ని 15 సెకండ్లలోనే కనిపెట్టి ఉంటే మీ కంటి చూపు అదుర్స్ అని చెప్పాలి.
ఐక్యూ పరీక్షలు, ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ఆసక్తిగా ఉంటాయి. ప్రశ్న చిన్నగానే కనిపిస్తుంది కానీ జవాబు కోసం తీవ్రంగా ప్రయత్నించాలి. అందుకే వీటికి సోషల్ మీడియాలో చాలా అభిమానులు ఉన్నారు. వీటిని పెట్టగానే వైరల్ అవుతాయి. అలాంటి వాటిలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఒకటి. ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.వారిలో బాస్ ఎవరో గుర్తించాలి. ఆ ఆఫీసు గదిని క్షుణ్నంగా పరిశీలిస్తే బాస్ ఎవరో చెప్పేయచ్చు. ఒక వ్యక్తి బాస్ కూర్చునే డెస్క్ దగ్గర నిలబడ్డాడు. మరో వ్యక్తి టేబుల్ వద్ద కూర్చున్నాడు. మూడో వ్యక్తి నిల్చుని ఉన్నాడు. బాస్ డెస్క్ దగ్గర ఉన్న వ్యక్తి ఏదో చెబుతుంటే మిగతా ఇద్దరూ వింటున్నారు. ఆ బొమ్మలో క్లుప్తంగా కనిపిస్తున్నది ఇది. అయితే ఆ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెట్టి చెప్పండి. ఎక్కువ సమయం తీసుకుంటే ఎవరైనా చెప్పేయచ్చు. కేవలం పది సెకన్లలో చెబితూ మీ ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ అని అర్థం. ఒక నిమిషం సమయం తీసుకుని చెప్పినా కూడా మీరు తెలివైన వారే అని అర్థం చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ సమయం తీసుకుంటే ఓ మోస్తరు తెలివి తేటలున్నట్టు భావించాలి. అసలు ప్రయత్నించకుండా జవాబు వెతికేస్తే మాత్రం బద్ధకస్తులు అనుకోవాలి.
ఆప్టికల్ ఇల్యూషన్ కళ్లను మాయ చేసే అందమైన కళ. కంటిచూపుకు, మెదడుకు మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో ఆప్టికల్ ఇల్యూషన్ ఇట్టే చెప్పేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ చిత్రాలు కంటికి, మెదడుకు సవాలు విసిరేలా ఉంటాయి. ఇవి మంచి టైమ్‌పాస్‌లా ఉంటాయ. మెదడుకు మేతగా ఉంటాయి. వీటిలో కళ్ల ముందే అంతా స్పష్టంగా కనిపిస్తున్నా... కనిపించని దాన్ని మెదడు, కళ్ల సమన్వయంతో వెతకడమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పని. దీని పుట్టుక వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఏళ్ల క్రితం నాడు ఇవే ప్రాచీన ప్రజలకు వినోదాన్ని పంచింది. ప్రశ్ననూ, జవాబునూ రెండింటినీ తనలోనే దాచుకోవడం ఈ బొమ్మల ప్రత్యేకత. మెదడును కాసేపు గజిబిజి చేసేస్తుంది.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లకు ప్రజాదరణ అధికం. ప్రపంచంలో ఇలాంటి చిత్రాలను గీసే ప్రత్యేక చిత్రకారుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలు గీయడం అంత సులభం కాదు. వీటిని ఎవరు మొదట సృష్టించారో కానీ అతనికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. వీటి సృష్టికర్త పేరు మాత్రం ఇంతవరకు తెలియలేదు.
గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్
High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!
Ghosts: మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూశారా? అవి కొందరికే ఎందుకు కనిపిస్తాయి?
Minister Jagadish Reddy: "కాళేశ్వరం జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేశారు సీఎం కేసీఆర్"
ఆ ‘ఐ డ్రాప్స్’తో పిల్లల్లోని దృష్టి లోపాన్ని నివారించవచ్చట - తాజా పరిశోధనలో వెల్లడి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!