By: Haritha | Updated at : 05 Apr 2023 10:33 AM (IST)
(Image credit: Pixabay)
పూర్వం ఇనుప కళాయిలో వండితే, ఇనుము లోపం శరీరానికి రాకుండా ఉంటుందని అనేవారు. ఇప్పుడు రకరకాల కళాయిలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇనుపకడాయిలో అన్ని రకాల వంటలు ఉండకూడదు. అని కొన్ని రకాలు వండడం వల్ల రుచి మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎలాంటి కూరగాయలు వండకూడదో తెలుసుకుందాం.
ఏ కూరగాయలు వండకూడదు?
వండే విధానాన్ని బట్టి రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం సిద్ధం అవుతుంది. భారతీయ వంటశాలలో ఉపయోగించే సాధారణ పాత్రల్లో ఇనుప కళాయి కూడా ఒకటి. అయితే అన్ని కూరలు ఇనుపకళాయలో వండడానికి అనువైనవి కాదు. ఇనుపకళాయిలో కడాయి పనీర్, కడాయి చికెన్, మటన్ వంటివి వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ కొన్ని రకాల కూరగాయలు మాత్రం వండితే వంటకానికి లోహ రుచి వస్తుంది. అలాగే కూరగాయల రంగు కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి కొన్నింటిని స్టెయిన్ లెస్ స్టీల్ లేదా అల్యూమినియంతో తయారుచేసిన వంట పాత్రల్లోనే వండడం ముఖ్యం.
1. టమోటాలు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. వీటిని ఇనుప కళాయిలో వండినప్పుడు అవి ఇనుముతో చర్య జరిపి ఆహారానికి ఇనుము రుచిని అందిస్తాయి. తినాలనిపించదు.
2.చింతపండు కూడా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. దీన్ని కూడా ఇనుపకళాయిలో వండినప్పుడు రంగు పాలిపోవడం, నోటికి లోహపు రుచిని ఇవ్వడం వంటివి చేస్తుంది. చింతపండుతో వండేటప్పుడు అల్యూమినియం లేదా మట్టి కుండలు ఉపయోగించడం మంచిది.
3. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇనుపకళాయిలో దీన్ని వండినప్పుడు రంగు నలుపుగా మారుతుంది. ఇనుము కళాయిలోని ఇనుము కణాలు, ఆక్సాలిక్ యాసిడ్‌తో చర్య జరపడమే దీనికి కారణం.
4. నిమ్మకాయలో కూడా అధిక ఆమ్లత్వం ఉంటుంది. దీన్ని ఐరన్ కళాయిలో వేసినప్పుడు ఆహారం రుచి చేదుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఐరన్ కళాయిలో వండే వంటల్లో నిమ్మకాయలు పిండకపోవడమే మంచిది.
5. బీట్రూట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. ఇనుప కళాయిలో బీట్రూట్ వండడం వల్ల రంగు మారిపోతుంది. చూస్తే తినాలన్న ఆసక్తి కూడా రాదు. తింటే రుచి కూడా తేడాగా ఉంటుంది.
6. అలాగే రసం వంటివి కూడా ఇనుపకళాయిలో ఉండకూడదు. దీనిలో రసంలో టమోటోలు, చింతపండు వేసే అవకాశం ఎక్కువ కాబట్టి. అలాంటివి స్టీల్ గిన్నెలో వండుకోవడం ఉత్తమం.
మిగతా కూరలను, వంటకాలను మాత్రం ఇనుప కళాయిలో వండుకోవచ్చు. పుల్లని కూరగాయలేవీ దీనిలో వండకూడదు.
Also read: ప్రఖ్యాత GI ట్యాగ్ పొందిన బనారసి పాన్, కాశీ వెళ్లినవారు కచ్చితంగా తినాల్సిన కిళ్లీ ఇది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి
Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Apple: రాత్రి వేళల్లో ఆపిల్ పండ్లు తినకూడదా? తింటే ఏమవుతుంది?
Salt: ఆహారంలో ఉప్పు పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?
Medico Preethi: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడికి ఊరట- సైఫ్ సస్పెన్సన్ తాత్కాలికంగా రద్దు
Telangana MIM : MIM మాస్టర్ ప్లాన్ - హంగ్ వస్తే హంగామా తప్పదా ?
Kannur Squad Review - 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
Save The Tigers 2 : తెలుగులో సూపర్ హిట్టైన వెబ్ సిరీస్ సీక్వెల్‌లో కొత్త హీరోయిన్ - స్విమ్మింగ్ పూల్‌లో సీన్స్
/body>