(Source: ECI/ABP News/ABP Majha)
Best Trap Exercises : మంచి బాడీ షేప్ కావాలంటే ఇంట్లోనే ఈ ట్రాప్ వ్యాయామాలు చేసేయండి
Trap Exercises : మీరు బరువు తగ్గుతూ మంచి షేప్‌ను పొందాలనుకుంటే మీరు జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే మహిళలు ఈ వ్యాయామాలు చేస్తూ మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
Best Exercises for Core Strength : మంచి షేప్ కలిగిన, ఫిట్‌గా ఉండే శరీరం ఎవరికి నచ్చదు చెప్పండి. ముఖ్యంగా అమ్మాయులు తమ శరీరం మంచి షేప్‌లో ఉండాలని చూస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్లు బయటకు ఎక్కువ వెళ్లలేరు. ఇంట్లో ఉండే మహిళలు కూడా కొన్ని ట్రాప్ వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉండొచ్చు. మీరు కొత్తగా వ్యాయామం ప్రారంభిస్తున్నా వీటిని ఫాలో అయిపోవచ్చు. మీ డ్రీమ్ ఫిట్నెస్ను పొందడానికి ఇక్కడ కొన్ని ట్రాప్ వ్యాయామాలు ఉన్నాయి.
ట్రాప్ వ్యాయామాలు అంటే ఏమిటంటే?
అసలు ఈ ట్రాప్ వ్యాయామాలు అంటే ఏమిటి ఇవి ఏ విధంగా ఫిట్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నారా? ట్రాప్స్ లేదా ట్రాపెజియస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాయామాలు కలిగి ఉంటుంది. ఇది వెనుక భాగం, మెడ వెనుక, వెనుక భుజాల మీదుగా చేయగలిగే వ్యాయామాలతో ఉంటుంది. దీనిలో ఎగువ, మధ్య, దిగువ అనే విభాగాలుగా ఉంటాయి. కండరాలు, ఎగువ శరీర కదలికలు ఎక్కువగా కలిగి ఉంటాయి.
ఈ ట్రాపెజియస్ వ్యాయామాల వల్ల ఎగువ శరీరం బలం పెరుగుతుంది. మెరుగైన శరీరాకృతిని పొందడంతో పాటు.. నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. మెరుగైన కండరాల బలాన్ని పొందుతారు. ఈ ప్రయోజనాలు పొందడం కోసం మీరు ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్ పుష్ అప్స్
వాల్ పుష్ అప్స్ ఎగువ ట్రాపెజియస్ వ్యాయామాలలో ఒకటి. ఈ వ్యాయామం భుజం, కండరాలు, ఛాతీ భాగాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది వాటిని ఎఫెక్టివ్‌గా ప్రభావితం చేసి మంచి షేప్‌ని అందిస్తుంది. అంతేకాకుండా శరీర భంగిమను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. దీనిని మీరు ఇంట్లోనే చేయవచ్చు. ఈ వ్యాయామాన్ని పదిసార్లు పునరావృతం చేయాలి.
ఫార్మర్స్ వాక్
ట్రెపెజియస్ వ్యాయామాలలో ఫార్మర్స్ వాక్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కండరాలను బలోపేతం చేయడంతో పాటు.. శరీరాన్ని టోన్ చేస్తుంది. మీ పూర్తి శరీరం ఫిట్నెస్ కోసం మీరు దీనిని రెగ్యూలర్‌గా చేయవచ్చు. అయితే ఈ వ్యాయామం చేయడం కోసం మీకు డంబెల్స్ అవసరం ఉంటాయి. అవి లేనిపక్షంలో మీరు వాటర్ బాటిల్స్ ఉపయోగించి దీనిని చేయవచ్చు.
బ్యాండ్ పుల్ అపార్ట్స్
బ్యాండ్ పుల్ అపార్ట్ అనేది మీరు ఇంట్లోనే చేయగలిగే ఉత్తమమైన ట్రాప్ వ్యాయామాలలో ఒకటి. దీనిని చేయడానికి మీ దగ్గర వ్యాయామ బ్యాండ్ ఉండాలి. దీనితో మీరు భుజం, భుజం వెనుక భాగాన్ని మంచి షేప్‌కి తీసుకురావొచ్చు. అంతేకాకుండా మీరు వెన్ను నొప్పిని దూరం చేసుకోవడానికి ఈ వ్యాయామాన్ని చేయవచ్చు.
రివర్స్ ఫ్లైస్
రివర్స్ ఫ్లైస్ మీ శరీరం మధ్య, దిగువ కండరాలను బలపరుస్తుంది. దీనికి కూడా డంబెల్స్ లేదా వాటర్ బాటిల్స్ ఉపయోగించవచ్చు. దీనిని మీరు 8 రెప్స్, 3 సెట్లలలో చేయగలిగితే ఈ వ్యాయామం మీ కోర్ కండరాలను బలపరుస్తుంది. ఈ వ్యాయమంతో కండర శక్తి పెరగడంతో పాటు.. స్ట్రెంత్ కూడా పెరుగుతుంది.
ఈ వ్యాయమాలను మీరు రెగ్యూలర్‌గా చేస్తే కండర శక్తి పెరగడంతో పాటు.. శరీర బలం కూడా పెరుగుతుంది. అమ్మాయిలు ఈ వ్యాయామాలు రోజూ చేస్తే వారు శారీరక శక్తి పెరగడంతో పాటు శరీరం మంచి ఆకృతి పొందుతుంది. అంతేకాకుండా శరీర భంగిమ కూడా మెరుగవుతుంది.
Also Read : మహిళలు బరువును తగ్గించే మాత్రలు వేసుకోవచ్చా? బరువు తగ్గేందుకు ఎలాంటి మాత్రలు ఎంచుకోవాలి?