Naivedhyam: భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి
పూజ గది చాలా పవిత్రమైనది. దేవతలను స్మరించుకుంటూ చేసే పూజలో పెట్టె నైవేద్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే భగవంతుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
కుటుంబ శ్రేయస్సు, వ్యాపార లాభాలు, ఇంట్లో సానుకూల వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. దేవుడి ముందు వెలిగించే దీపం దగ్గర నుంచి పెట్టె నైవేద్యం వరకు అన్నీ కూడా పద్ధతి ప్రకారం జరగాలి. దేవుడు చిత్రాలు ఉంచే పూజ గది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతీ ఒక్క ఇంట్లో తప్పనిసరిగా పూజ గది ఉంటుంది. పూజలో వాడే పూలు, దేవతలకి పెట్టె నైవేద్యం చాలా పవిత్రంగా ఉండాలి. నైవేద్యం సమర్పించడానికి కూడా ఒక చిన్న ఆచారం ఉండి. ఆ ఆచారం ప్రకారం మాత్రమే దేవుళ్ళకి నైవేద్యం పెట్టాలి. అది ఎప్పుడు సాత్వికమైన ఆహారమే తయారుచేయాలి. లడ్డు, ఖీర్ వంటి తీపి పదార్థాలు ఎక్కువగా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. దాన్ని సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం. లేదంటే దేవతలకు ఆగ్రహం వస్తుందని ఒక నమ్మకం. నైవేద్యం పెట్టె ముందు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు..
ప్రసాదం పెట్టె పాత్రలు ముఖ్యం
పురాణ గ్రంథాల ప్రకారం భక్తులు ఎప్పుడు దేవుళ్ళకి వెండి, బంగారం, మట్టి లేదా ఇత్తడి పాత్రల్లో నైవేద్యం సమర్పించాలి. ఎందుకంటే అవి పూర్తిగా స్వచ్చమైన లోహాలుగా పరిగణించబడతాయి. నైవేద్యం పెట్టేందుకు అల్యూమినియం, ఇనుము లేదా ఉక్కు పాత్రలు ఎప్పుడు ఉపయోగించకూడదు. అలా చేస్తే అది పాపంగా భావిస్తారు.
నైవేద్యం సాత్వికంగా ఉండాలి
భగవంతుడికి సమర్పించే నైవేద్యం సాత్వికంగా ఉండాలి. అందులో ఉపయోగించే ఆహారాలు అన్ని స్వచ్ఛంగా శాఖాహారం మాత్రమే ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారుచేయాలి. నైవేద్యం చేసే పదార్థాలు కిందపడకూడదు. ప్రసాదం కోసం తయారుచేసే పదార్థాలు ఇతరులకి ఎప్పుడు దానం చెయ్యకూడదు. అలా చేస్తే చేసిన ప్రసాదం అపవిత్రం అవుతుంది. దేవతల కోసం తయారుచేసే ప్రసాదంలో అల్లం ఉపయోగించుకోవచ్చు.
ప్రసాదం తప్పకుండా తినాలి
కొంతమందికి తమ ఇంట్లో చేసిన రోజువారీ ఆహారాన్ని దేవతలకు నైవేద్యంగా పెట్టె అలవాటు ఉంటుంది. అలా చేసేటప్పుడు భక్తులే దాన్ని స్వయంగా చేసి ఇతరులకు పెట్టాలి. అది కూడా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఆహార పదార్థాలు వండాలి. దేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని తప్పకుండా తినాలి. అంతే కాదు నైవేద్యం అందరికీ పంచి పెట్టాలి. దేవుని ప్రసాదాలు ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. ప్రసాదం ఇతరులకి పంపిణీ చేయడం వల్ల పూజ చేసిన వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ చేసిన ఫలం దక్కుతుంది.
అలాగే పూజలో వాడిన పూజా ద్రవ్యాలు, పూలు తప్పనిసరిగా తీసేయాలి. వాటిని చెత్తలో వేయకూడదు. అన్నింటినీ ప్రవహించే నీటిలో మాత్రమే వదిలేయాలి. దీపం మధ్యలోనే కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. పూజకు ఉపయోగించే దీపారాధన వస్తువులు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించి పూజ చేస్తేనే మీరు చేసే దానికి ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: ఈ సుగంధ ద్రవ్యాలు మీ వెంట పెట్టుకుంటే అదృష్టం, సంపద మీదే!