News
News
X

Alcohol: అద్భుతగుణాలున్న ఈ పుట్టగొడుగులు మద్యం అలవాటును మానిపించేస్తాయి, పరిశోధనలు సక్సెస్

మద్యానికి బానిసైతే జీవితం అంధకారం అవుతుంది.అందుకే ఆ అలవాటును వదులుకోవాల్సిన అవసరం ఉంది.

FOLLOW US: 

మద్యపానం ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. ఎన్నో ప్రాణాలను తీసింది. ఎంతో మంచి జీవితాలను నాశనం చేసింది. అందుకే దాన్ని మద్యం మహమ్మారి అంటారు. ఈ మహమ్మారి ఒక్కసారి అలవాటు అయిందా అంతే సంగతులు. ఇక దాన్ని మానడం చాలా కష్టం.ఈ అలవాటును మానపించడానికి సరైన మందులు కూడా లేవు.ఉన్నా వేసుకోవడానికి ఇష్టపడరు. మొదట మద్యపానం అలవాటును వదుకోవడానికే ఇష్టపడరు.ఇప్పుడు దీనికి ఓ పరిష్కారాన్ని కనిపెట్టారు అంతర్జాతీయ పరిశోధకులు. అది కూడా చాలా సింపుల్ రెమెడీ. పుట్టగొడుగుల కూరను తినడమే. 

మేజిక్ పుట్టగొడుగులు
పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. కానీ అందులో తినగలిగేవి కొన్నే. కొత్త పరిశోధన ప్రకారం సైకెడెలిక్ పుట్టగొడుగులు అని పిలిచే మేజిక్ మష్రూమ్స్ తినడం వల్ల ఆల్కహాల్ వ్యసనాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఏ మందులు మింగక్కర్లేదు, రీహాబిటేషన్ సెంటర్లకు వెళ్లక్కర్లేదు. ఈ పుట్టగొడులు కూరని తినండి చాలు, మద్యపానం చేయాలన్న కోరిక మెల్లగా చచ్చిపోతుంది. కొన్నాళ్లకు ఆ వాసనకే విరక్తి పుడుతుంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ న్యూరో సైంటిస్టులు ఈ పరిశోధనను నిర్వహించారు. 

అధ్యయనంలో భాగంగా 93 మంది మందుబాబులను ఎంచుకున్నారు. వారికి సైలోసిబిన్ సమ్మేళనం ఉన్న మాత్రలను ఇచ్చారు. వారికి సంగీతాన్ని వినిపించారు. ఇలా ఒక నెల రోజుల పాటూ 12 సెషన్లు నిర్వహించారు. ఇలా దాదాపు ఎనిమిది నెలల పాటూ నిర్వహించారు. ఆ తరువాత వారిని పరిశీలించారు. సైలోసిబిన్ మాత్రలను తీసుకోని వారితో పోలిస్తే వీరిలో చాలా మార్పు కనిపించింది. మద్యం తాగడం చాలా తగ్గించారు. నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే తాగడం ప్రారంభించారు. మరికొందరైతే పూర్తిగా మానేశారు. 93 మందిలో దాదాపు 24 శాతం మంది పూర్తిగా మద్యాన్ని వదిలేశారు. దీంతో సైలోసిబిన్ వారిలో బాగా పనిచేసినట్టు గుర్తించారు.  

పుట్టగొడుగుల్లో దొరుకుతుంది...
ఈ సైలోసిబిన్ సమ్మేళనం సైకెడెలిక్ పుట్టగొడుగుల్లో అధికంగా లభిస్తుంది. అందుకే ఈ పుట్టగొడుగులను తినడం వల్ల మద్యపానం అలవాటను తగ్గే అవకాశం ఉంది. అయితే మెదడులో ఈ సిలోసిబిన్ ఎలా పనిచేస్తుందో, ఎలాంటి  ప్రభావాన్ని కలిగిస్తుందో మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. 

Also read: ఓటీటీలో సినిమాలు చూస్తూ తినేందుకు ఈ స్నాక్స్ ఆరోగ్యకరం

Also read: రోజూ వేడినీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా? వైద్యనిపుణులు ఏం చెబుతున్నారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 28 Aug 2022 08:47 AM (IST) Tags: Mushrroms Alcohol addiction alcohol Mushrooms Cure Alcohol Addiction

సంబంధిత కథనాలు

పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!

Weight Loss: ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని బాధపడుతున్నారా? అందుకు కారణాలివే!

Mother Care Tips: కాబోయే అమ్మలకి ఆలియా ఆరోగ్య సూత్రాలు

Mother Care Tips: కాబోయే అమ్మలకి ఆలియా ఆరోగ్య సూత్రాలు

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

Type 2 Diabetes: మధుమేహులకి గుడ్ న్యూస్ - ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌తో అదుపులోకి షుగర్ లెవల్స్

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

Viral News: వామ్మో, గిన్నిస్ రికార్డు కోసం కోడి కాళ్లను ఒక్క నిమిషంలో కసకస నమిలేసింది

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!