ఓటీటీలో సినిమాలు చూస్తూ తినేందుకు ఈ స్నాక్స్ ఆరోగ్యకరం
ఓటీటీలు వచ్చాక ఇంట్లోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు ఎంతోమంది.
ఇప్పుడు ఇల్లే మినీ థియేటర్‌గా మారిపోయింది. ఇదంతా ఓటీటీల పుణ్యమే. హాల్లో పెద్ద టీవీ పెట్టుకుని, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని, లైట్స్ ఆఫ్ చేసి పెద్ద సౌండ్‌తో ఏదైనా సినిమా పెట్టుకుంటే ఇల్లు థియేటర్‌లాగే మారిపోతుంది. మరి స్నాక్స్? ఈ విషయంలోనే మీరు ఆరోగ్యపరమైనవి ఎంచుకోవాలి. క్యాలరీలు అధికంగా ఉండేవి, పిజ్జాలు, బర్గర్లు లాంటివి కూర్చుని తింటుందే బరువు పెగరడంతో పాటూ త్వరగా అనారోగ్యం పాలవుతారు. ఇంట్లో టీవీ చూస్తూ తినేందుకు ఇవన్నీ ఉత్తమమైన స్నాక్స్. ఇవి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.
మఖానా
ఫాక్స్ సీడ్స్ లేదా మఖానా మంచి చిరుతిండి కిందకి వస్తుంది. వీటిని నేతిలో వేయించుకుని కాస్త ఉప్ప , కారం, మసాలా వంటివి చల్లుకుని తింటే ఆ రుచే వేరు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
పాప్ కార్న్
పాప్ కార్న్ చిరుతిండే కానీ అనారోగ్యకరమైనది మాత్రం కాదు. అయితే వీటిలో అనేక రకాలు ఉన్నాయి. చక్కెర కలిపినవి, మసాలాలు జోడించినవి తినమని మేం చెప్పడం లేదు. తక్కువ నూనెలో వేయించిన పాప్ కార్న్ తినడం ఉత్తమం. ఇవి మంచి టైమ్ పాస్, ఆరోగ్యాన్ని చెడగొట్టవు.
వెజిటబుల్ స్టిక్స్
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకోవాలి. అంటే క్యారెట్, దోసకాయ వంటివి తీసుకుని వెజిటబుల్ స్టిక్స్ వండుకోవచ్చు. వీటిని నిలువుగా కోసి పకోడి మిశ్రమంలో కలిపి, నూనెలో వేయించి తింటే మంచి మజాగా ఉంటుంది.
కొమ్ము శెనగలు
అన్నింటికన్నా ఉత్తమమైన చిరుతిండి ఇదే. వీటిని ఉడకబెట్టి కాస్త నూనెలో ఎండు మిర్చి, పసుపు, ఉప్పు వేసి వేయించి, పైన నిమ్మరసం చల్లుకుని తింటే ఆ రుచే వేరు.
వెజిటబుల్ చిప్స్
మీకు ఇష్టమైన కూరగాయలను సన్నగా, గుండ్రంగా చిప్స్‌లా కోసి వాటిని ఎయిర్ ఫ్రైయర్లో వేయించుకోవచ్చు. ఇలా వేయించాక వాటిని కెచప్ లో డిప్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఆరోగ్యకరం కూడా.
అరటికాయ చిప్స్
అరటికాయ చిప్స్ మీకు బయట మార్కెట్లో దొరకుతున్నాయి. అవి నచ్చకపోతే అరటికాయను పల్చగా, గుండ్రంగా కోసుకుని ఉప్పు, పసుపు కలిపిన నీళ్లలో ఓ అయిదు నిమిషాలు ఉంచాలి. వాటిని బయటికి తీసి నూనెలోనో లేక ఎయిర్ ఫ్రైయర్లోనో వేయిస్తే బనానా చిప్స్ రెడీ.
జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. చాలా మందికి సినిమాలు చూస్తూ తినేందుకు ఉత్తమ ఆహారంగా ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్, నగ్గెట్స్ వంటివి ఎంచుకుంటారు. కానీ వాటి వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన పైన చెప్పిన చిరుతిళ్లను ఎంచుకోవడం ఉత్తమం.
Also read: రోజూ వేడినీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా? వైద్యనిపుణులు ఏం చెబుతున్నారు
Also read: బుజ్జి బేబీ బంప్‌తో అలియా, ఆమె వేసుకున్న ఈ పింక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?