అన్వేషించండి

Life of Jesus : యేసు మరణం గుడ్ ఫ్రైడే, జననం క్రిస్మస్.. మరి ఈస్టర్? జీసస్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే  

Jesus Life Journey : యేసు పుట్టుక నుంచి చనిపోయి తిరిగి లేచినవరకు జరిగిన ప్రతీ విషయం ఓ అద్భుతమని చెప్తారు. బైబిల్లో దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కన్య మరియ గర్భాన దేవుని కుమారుడిగా యేసు జన్మించారు.
  • 30 ఏళ్ల వయసులో యేసు ప్రేమ, క్షమాభావం బోధించారు.
  • యేసు రోగులను నయం చేసి, వేలమందికి ఆహారం అందించారు.
  • శిలువపై మరణించి, మూడవ రోజు తిరిగి లేచారు.

Life Story of Jesus : క్రైస్తవులు 40 రోజుల లెంట్ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే యేసు శిలువపై మరణాన్ని సూచిస్తే.. ఈస్టర్ ఆయన తిరిగి లేచిన విషయాన్ని సూచిస్తుంది. అయితే యేసు మరణమే కాదు.. జననం కూడా ఓ ప్రత్యేకమైన రోజేనని చెప్తారు క్రైస్తవులు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా.. యేసు జననం, శిలువపై మరణం, తిరిగి లేవడం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

యేసు క్రీస్తు జననం

యేసు క్రీస్తు పుట్టుకను అద్భుతంగా భావిస్తారు. గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై.. కన్యక అయినా.. మరియ కడుపులో దేవుని కుమారుడైన యేసు పుడతాడని చెప్తాడు. తరువాత బెత్లెహేమ్‌లో మరియ గర్భంలో యేసు జన్మించాడు. ఆ సమయంలో యూధుల రాజైన హెరోదు.. కొత్త రాజు పుడతాడు అన్న భయంతో చిన్న పిల్లలను హతమార్చాలని చూస్తాడు. కానీ యేసు కుటుంబం ముందుగానే అప్రమత్తమై తప్పించుకుంటారు. 

యేసు క్రీస్తు బాల్యం 

యేసు చిన్నప్పటి నుంచే అపారమైన జ్ఞానంతో ఉండేవారు. 12 ఏళ్ల వయసులో పండితులతో చర్చలు జరిపి వారిని ఆశ్చర్యపరిచినట్లు బైబిల్ చెప్తుంది. 30 ఏళ్ల వయసులో యేసు తన సేవను ప్రారంభించాడు. ప్రజలకు ప్రేమ, క్షమాభావం, వినయం గురించి బోధనలు చెప్పేవాడు. 

యేసు చేసిన మహాత్కార్యాలు.. 

యేసు తన బోధనలతో పాటు.. కొన్ని అద్భుతాలు చేశారు. కంటిచూపు లేని వారికి చూపు ఇవ్వడం, రోగులను నయం చేయడం, తక్కువ ఆహారంతో వేల మంది ఆకలి తీర్చడం, సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం వంటి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అలాగే తన సేవను ప్రచారం చేయడం కోసం.. యేసు తనతో పాటు 12 మంది శిష్యులను ఎంచుకున్నాడు. 

యేసుపై వ్యతిరేకత

యేసు ప్రభావం పెరుగుతున్న కొద్దీ.. మత నాయకుల్లో అసూయ పెరుగుతూ వచ్చింది. ఆయన శిష్యుడైన యూదా.. వెండి నాణేల కోసం యేసును శత్రువులకు అప్పగించాడు.

యేసు శిలువ ప్రయాణం..

యేసును అరెస్ట్ చేసి.. తీవ్రంగా హింసించారు. తలపై ముళ్ల కిరీటం పెట్టి, శిలువను మోసేలా చేసి, చివరికి శిలువపై మరణించేలా చేశారు. దీనినే గుడ్ ఫ్రైడే అంటారు.

యేసు మరణం తర్వాత

శిలువపై యేసు తన ప్రాణాలను సమస్త ప్రజల పాపాలు తొలగించడానికి విడిచిపెట్టారు. అనంతరం యేసు భక్తులు ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచుతారు. వారు తిరిగి మూడో రోజు అదే ప్రదేశానికి వెళ్లి చూస్తే.. అక్కడ ఆయన శవం ఉండదు. మూడో రోజు యేసు మళ్లీ లేచాడని క్రైస్తవులు నమ్ముతారు. దీనినే ఈస్టర్‌గా జరుపుకుంటారు. జీసస్ లైఫ్ సర్కిల్ ప్రేమించు..  క్షమించు.. నమ్ము… ముందుకు సాగాలని సూచిస్తుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget