అన్వేషించండి

Good Friday and Easter : గుడ్ ఫ్రైడే, ఈస్టర్.. క్రైస్తవులు చేసుకునే ఈ పండుగల గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే

Good Friday to Easter : గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కానీ ఇవి చాలామందికి తెలియదు. అవేంటో.. గుడ్ ఫ్రైడ్ ఎందుకు గుడ్ కాదో ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గుర్తుచేస్తుంది.
  • ఈస్టర్ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం, పునరుత్థాన సంబరం.
  • ఈస్టర్ గుడ్లు కొత్త జీవితాన్ని, పునర్జన్మను సూచిస్తాయి.
  • ఈస్టర్ బన్నీ జానపద కథల నుండి వచ్చింది, మతపరమైనది కాదు.

Good Friday and Easter Celebrations : ప్రతి సంవత్సరం మార్చి–ఏప్రిల్ నెలల్లో క్రిస్టియన్స్ లెంట్ డేలు చేస్తారు. దీనిని వారు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈస్టర్​తో ముగిసే ఈ లెంట్​ డేలలో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి. బస్మ బుధవారం, మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటివి ఈ లెంట్​ డేస్​లలోనే చేస్తారు. ఏసు క్రీస్తు మరణాన్ని సూచించే ఫ్రైడే గుడ్ ఫ్రైడ్ ఎందుకు అయింది.. ఈస్టర్​తో లెంట్ డేస్ ఎందుకు ముగుస్తాయి వంటి ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి తెలియవు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

గుడ్ ఫ్రైడేలో 

గుడ్ ఫ్రైడేలో గుడ్ అంటే ఆనందాన్ని సూచించదు. ఇది చాలామందికి తెలియక గుడ్ ఫ్రైడే అంటే మంచిదని అనుకుంటారు. ఎందుకంటే గుడ్​ ఫ్రైడే అనేది యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజును గుర్తు చేసే రోజు. ఈ సమయంలో గుడ్ అంటే ఆధ్యాత్మికంగా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజు సెలబ్రేషన్స్ చేసుకోరు. 

గుడ్ ఫ్రైడే రోజున చర్చిలలో గంటలు మోగించరు. పాటలు చాలా తక్కువగా పాడుకుంటారు. అలాగే చాలామంది ఉపవాసం ఉంటారు. యేసు క్రీస్తు తమ పాపాలను పోగొట్టడానికి శిలువపై ప్రాణాలు విడిచారనే సందేశాన్ని ఇస్తూ.. ప్రార్థనలు చేసుకుంటారు. 

ఈస్టర్ తేదీ

కొన్ని పండుగలు ప్రతి ఏడాది ఒకే తేదీకి రావు. అలాగే ఈస్టర్ ప్రతి సంవత్సరం ఒకే తేదీకి రాదు. అందుకే ఈస్టర్ ఎప్పుడూ మార్చి 22 నుంచి ఏప్రిల్ 25 మధ్య ఎప్పుడైనా రావచ్చు. అయితే లెంట్ డేస్​ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఈస్టర్‌గా జరుపుకుంటారు. అందుకే ప్రతి ఏడాది తేదీ మారుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈస్టర్ వచ్చింది. ఈస్టర్‌కు ముందు 40 రోజుల కాలాన్ని లెంట్ అంటారు.

ఈస్టర్ ఎగ్స్‌ అర్థం ఇదే..

ఈస్టర్ ఎగ్స్ చాలా ఫేమస్. కానీ ఎందుకు గుడ్లతో సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? గుడ్లు అనేవి కొత్త జీవితాన్ని సూచిస్తాయి. యేసుక్రీస్తు పునరుత్థానం, పునర్జన్మకు దీనిని సంకేతంగా భావిస్తారు. అందుకే ఈస్టర్ సందర్భంగా గుడ్లను అలంకరించి సెలబ్రేట్ చేసుకుంటారు. 

ఈస్టర్ బన్నీ స్టోరీ..

ఈస్టర్ బన్నీ అసలు మతపరమైనది కాదు. ఇది జర్మన్ జానపద కథల నుంచి వచ్చింది. పిల్లలకు గుడ్లు తీసుకువచ్చే కుందేలు కథగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఇది ఈస్టర్‌లో ఫన్ సింబల్ అయింది. 

లెంట్ సమయంలో చాలామంది తమకు ఇష్టమైన ఆహారాలు మానేస్తారు. ప్రార్థనల్లో పాల్గొంటారు. గుడ్ ఫ్రైడే శోకాన్ని సూచిస్తే.. ఈస్టర్‌లో ఆనందం, సంతోషం ఉంటుంది. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ఆశ, కొత్త జీవితాన్ని సూచిస్తుంది. అందుకే ఈస్టర్ రోజు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

PCOD, PMOS Diet : PCOD లేదా PMOSతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తినేయండి
PCOD లేదా PMOSతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తినేయండి
Japan Population Crisis : జపాన్​లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్​తో పెళ్లి, పిల్లలకు దూరం!
జపాన్​లో పెరుగుతోన్న వృద్ధులు, తగ్గుతోన్న యువత.. జాబ్ స్ట్రెస్​తో పెళ్లి, పిల్లలకు దూరం!
Alzheimers Patient Care : అల్జీమర్స్‌ పేషెంట్లను చూసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. డాక్టర్‌ సూచనలు ఇవే
అల్జీమర్స్‌ పేషెంట్లను చూసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. డాక్టర్‌ సూచనలు ఇవే
Korrapongali Recipe : కొర్ర పొంగల్ రెసిపీ.. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. తప్పక ట్రై చేయండి
కొర్ర పొంగల్ రెసిపీ.. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. తప్పక ట్రై చేయండి

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
Virat Kohli Mastery Beyond Numbers: సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
Embed widget