Fashion: బుజ్జి బేబీ బంప్‌తో అలియా, ఆమె వేసుకున్న ఈ పింక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
అలియా భట్ త్వరలోనే అమ్మ కాబోతోంది. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తోంది.
అలియా భట్- రణ్‌బీర్ కపూర్ పెళ్లయిన రెండు నెలలకే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లి తండ్రులు కాబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పట్నించి అలియా సినిమాలకు సెలవు చెప్పేసి చిల్ అవుతోంది. అలాగని ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం లేదు అప్పుడప్పుడు అలా భర్తతో బయటకు వస్తోంది. ఆమె వేసుకున్న డ్రెస్సులు కాబోయే అమ్మకు ఫిట్ అయ్యేలా ప్రత్యేకమైనవి. అలియా ఫోటోలు పెట్టిందంటే ఆమె డ్రెస్సు ఎలా ఉందో, లావుగా అయ్యిందా, బేబీ బంప్, ఆమె ముఖంలో మెరుపు అన్నింటినీ అభిమానులు చూపులతో స్కాన్ చేసేస్తారు.
ఆ పింక్ డ్రెస్...
తాజాగా సోషల్ మీడియాలో పింక్ డ్రెస్సులో ఉన్న ఫోటోలు పెట్టింది. రణ్‌బీర్ కపూర్ నలుపు డ్రెస్సులో కనిపించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. ఇది త్వరలో విడుదల కానుంది. ఆ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటోంది ఈ జంట. ఆమె వేసుకున్న టాప్ అమ్మాయిల మనసు దోచేసింది. కాస్త పారదర్శకంగా ఉన్న ఆ టాప్ బేబీ బంప్ కూడా బయటికి కనిపించేలా ఉంది. చాలా సాప్ట్ మెటీరియల్‌తో దీన్ని కుట్టారు. అంతర్జాతీయ బ్రాండ్ గూచీ వారి డ్రెస్ అది. దాన్ని చూసి అలియా వ్యక్తిగత స్టైలిస్ట్ దాన్ని రూపొందించారు. దాని ఖరీదు అక్షరాలా రూ. 3,27,173. ఈ రఫెల్ షిఫాన్ టాప్ మీద బ్లాక్ జెగ్గింగ్స్ వేసుకుని అలియా. ఆ డ్రెస్సులో చాలా అందంగా ఉంది అలియా.
View this post on Instagram
రణ్‌బీర్- అలియా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. కత్రినాతో విడిపోయాక అలియాకు దగ్గరయ్యాడు రణ్ బీర్. వీరిద్దరూ కొన్నేళ్లు డేటింగ్‌లో ఉన్నాక ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండు నెలలకే అలియా గర్భవతి అని ప్రకటించింది.
View this post on Instagram