News
News
వీడియోలు ఆటలు
X

Eyes: ఈ అలవాట్లు మిమ్మల్ని అంధులను చేస్తాయి, మానేస్తేనే బెటర్

కొన్ని అలవాట్లు మీకు తెలియకుండానే మీ కంటిచూపును మందగించేలా చేస్తున్నాయి.

FOLLOW US: 
Share:

శరీరంలో సున్నితమైన భాగం కళ్లు. సూక్షమైన దుమ్ము కంట్లో పడినా చాలు కళ్లు కరకరలాడేస్తాయి. కంటి చూపును కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. కానీ మనకు తెలియకుండా కొన్ని అలవాట్లు, సమస్యలు కంటి చూపును మందగించేలా చేస్తున్నాయి. కంటి ఆరోగ్యానికి సరైన నిద్రే కాదు, కొన్ని రకాల పనులు కూడా చేయకూడదు. 

అనియంత్రిత మధుమేహం
మధుమేహం ఒకే సమస్య అనుకుంటారు కానీ, అది దానితో పాటూ అనేక ఆరోగ్యసమస్యలను కూడా తీసుకొస్తుంది. మధుమేహం నియంత్రణలో లేకపోతే ఎన్నో ప్రతికూల ప్రభావాలు పడతాయి. చాలా మంది మధుమేహాన్ని తేలికగా తీసుకుంటారు. కానీ అది వారి శరీరాన్ని వారికే తెలియకుండా గుల్లచేస్తుందని మాత్రం తెలుసుకోలేరు.రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువైతే గ్లాకోమా, కంటి శుక్లం, మాక్యులెర్ ఎడెమా, డయాబెటిక్ రెటినోపతి, అంధత్వం వంటి కంటి సమస్యలు వచ్చి పడతాయి. మధుమేహం ఉన్నవారికి కంటి చూపు ఏమాత్రం తేడా అనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులలో అంధత్వానికి మధుమేహం కారణమవుతోందని చెబుతున్నారు వైద్యులు. 

కళ్లను రుద్దడం
నిద్ర తగ్గనప్పుడు, లేదా దురదగా అనిపించినప్పుడు కళ్లను బాగా రుద్దేస్తారు కొంతమంది. అది చాలా సాధారణమైన చర్యే. కానీ అలా అధికంగా చేస్తే కళ్లలో కెరాటోకోనస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఇది కార్నియాను బలహీనపరుస్తుంది. కళ్ల ఆకారాన్ని కూడా మార్చేయగలదు. కాలం గడుస్తున్న కొద్దీ కంటి చూపు కూడా మందగిస్తుంది. కళ్లు తరచూ దురదగా అనిపిస్తే అలా రుద్దేయకుండా వైద్యుడిని సంప్రదించి తగిన మందులు వాడడం మంచిది. 

ధూమపానం
ధూమపానం వల్ల కళ్లకేమీ నష్టం అనుకోకండి. ఇది కంటిశుక్లాలకు కారణం అవుతుంది. కళ్లలో చికాకును కలిగిస్తుంది. ఆ పొగ కళ్లను తాకితే ప్రమాదకరం. ఆ పొగ బారిన తరచూ పడే వారిలో కంటి  చూపు మందగిస్తుంది. 

సూర్యుడిని చూడడం
కొంతమంది ఎండలో తలపైకెత్తి ఆకాశాన్ని చూడడం, సూర్యుడిని చూసేందుకు ప్రయత్నించడం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. కంటి రెటీనా శాశ్వతంగా పాడయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. దీన్ని సోలార్ రెటినోపతి అంటారు. 

సన్ గ్లాసెస్ వాడకపోవడం
ఎర్రటి ఎండల్లోకి వెళ్లినప్పుడు కంటి చుట్టు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం, సన్ గ్లాసెస్ పెట్టుకోవడం చేయాలి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కళ్లలోని అనేక భాగాలను దెబ్బతీస్తాయి. యూవీ కిరాణాలు కంటిలోని స్పటికాకార లెన్స్ పై ప్రభావం చూపిస్తాయి. కంటిశుక్లాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే సన్ గ్లాసెస్ ధరిస్తే కిరణాలు కంటిని నేరుగా తాకవు.

Also read: సహోద్యోగుల గౌరవాన్ని, స్నేహాన్ని పొందాలా? ఇలా చేస్తే సాధ్యమే

Also read: మీ ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించక తప్పదు

Published at : 07 Apr 2022 09:49 AM (IST) Tags: Eye Protection what make you blind causes for Blindness Tips for Healthy eyes

సంబంధిత కథనాలు

Hypothyroidism: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? వీటిని తింటే మేలు

Hypothyroidism: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? వీటిని తింటే మేలు

SugarCane Juice: పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

SugarCane Juice: పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Blood Circulation: ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో రక్త సరఫరా సరిగా జరగడం లేదని అర్థం

Blood Circulation: ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో రక్త సరఫరా సరిగా జరగడం లేదని అర్థం

Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు

Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు

జుట్టు రాలుతోందా? ఈ చిన్నజాగ్రత్తలు పాటిస్తే ఏ సమస్య ఉండదు!

జుట్టు రాలుతోందా? ఈ చిన్నజాగ్రత్తలు పాటిస్తే ఏ సమస్య ఉండదు!

టాప్ స్టోరీస్

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !

NTR centenary celebrations :  తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !