అన్వేషించండి

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఈ ఆహారానికి దూరంగా ఉండాల్సిందే

స్కిన్ క్యాన్సర్ తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న మరొక సమస్య రొమ్ము క్యాన్సర్.

స్కిన్ క్యాన్సర్ తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న మరొక సమస్య రొమ్ము క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుంటే ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడి మరణిస్తుంది. జన్యుపరంగా, వంశపారపర్యంగా, ఊబకాయం వంటి కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా మహిళలు ర్పమము క్యాన్సర్ బారిన పడుతున్నారు. మనం తినే కొన్ని ఆహార పదార్థాల వల్ల 20% క్యాన్సర్ పెరిగే అవకాశం ఉన్నట్లు ఇటీవల చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. 

ఫ్రెంచ్ మెడిక్స్ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్న వారిలో 20% ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తేలింది. తృణధాన్యాలు, సీజనల్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తింటున్న వారిలో రొమ్ము క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉంటుంది. అదే విధంగా బాగా శుద్ధి చేసిన ధాన్యాలు, వైట్ రైస్, బ్రెడ్ వంటి ఆహారపదార్థాలు అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల ఈ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రెండు దశబ్ధాల పాటు 65 వేల మంది మహిళల మీద చేసిన పరిశోధన ఆధారంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్న వారిలో 14 % రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. 

కొన్ని రకాల కార్బో హైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నిరోధించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంపలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలు, పండ్ల రసాలు వంటి వాటిని తగ్గించడం మేలని అంటున్నారు. శరీరంలో కార్బో హైడ్రేట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. శక్తిని ఇవ్వడంతో పాటు జీర్ణక్రియని మెరుగు పరచడం, గుండె, మధుమేహాన్ని నియంత్రించడంలో కొన్ని కార్బో హైడ్రేట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కార్బో హైడ్రేట్స్ మూడు రకాలుగా ఉంటాయి. చక్కెర, పిండి పదార్థాలు, ఫైబర్. చక్కెరలను సాధారణ కార్బోహైడ్రేట్‌లు అని పిలుస్తారు. ఇవి మిఠాయి, డెజర్ట్‌లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు సాధారణ సోడా వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి అనారోగ్యానికి ఎక్కువగా దారి తీస్తాయి. మిఠాయిలు, ప్రొసెస్ చేసిన ఆహార వినియోగం వీలైనంత తగ్గించాలి. పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు ఫైబర్, విటమిన్ బి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 

మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. WHO ప్రకారం వయస్సు, ఊబకాయం, మద్యపానం యొక్క హానికరమైన వినియోగం, రుతు కాలం ప్రారంభమైన వయస్సు మరియు మొదటి గర్భధారణ వయస్సు వంటి కొన్ని కారణాలు కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. బిడ్డకి తల్లి పాలివ్వడం, బరువు నియంత్రించడం, రోజువారీ శారీరక శ్రమ చెయ్యడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు. 

రొమ్ము క్యాన్సర్ ని గురించే సంకేతాలు 

* రొమ్ము గడ్డగా మారిపోవడం 

* రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పు రావడం 

* ఎర్రగా మారడం, గుంటలు ఏర్పడటం 

* చనుమొల రూపం, రంగు మారడం 

ఇటువంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: కొరియా చిట్కా - ఐస్ నీళ్లలో ముఖం పెడితే అన్ని ప్రయోజనాలా? మీరు అస్సలు నమ్మలేరు!

Also Read: చెమట పడితే నిజంగానే బరువు తగ్గుతారా? ఇది వాస్తవమా లేక అపోహ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget