By: Haritha | Updated at : 30 May 2023 10:06 AM (IST)
(Image credit: Pixabay)
ఉదయపు భోజనం చాలా ముఖ్యం. పరగడుపున అంటే ఖాళీ పొట్టతో తినే పదార్థాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి పరగడుపున తినే పదార్థాలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రాత్రి భోజనం చేశాక పొట్ట పది నుంచి 12 గంటలు ఉపవాసాన్ని చేస్తుంది. ఆ తర్వాతే ఆహారాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఖాళీ పొట్టతో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే ఉదయం పూట మొదటిగా తినే భోజనం ఏదైనా తేలికగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల పొట్టపై చాలా ప్రభావం పడుతుంది. కానీ ఈ విషయం తెలియక ఎంతోమంది వీటిని రోజు పరగడుపునే తీసుకుంటున్నారు. పైగా అవి చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తున్నారు. ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు.
తేనె నిమ్మరసం
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని, ఒక స్పూను తేనె కలుపుకొని తాగే వారి సంఖ్య అధికమే. పరగడుపున ఇలా తాగితే కొవ్వును కాల్చేస్తుందని చాలామంది నమ్మకం. అయితే పోషకాహార నిపుణులు మాత్రం అలా చేయవద్దని చెబుతున్నారు. తేనెలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే తేనెలో చక్కెర కంటే చాలా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, కాబట్టి పరగడుపున చక్కెర నిండని తేనెను తినకూడదు. అలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి. కానీ తేనె మాత్రం వద్దు.
టీ లేదా కాఫీ
ఉదయం లేచిన వెంటనే, మంచం దిగకుండానే చేతిలో కాఫీ కప్పు లేదా టీ కప్పు పడాల్సిందే. లేకుంటే ఇంకా తెల్లవారినట్టే ఫీలవ్వరు ఎంతోమంది. అయితే వీటిని ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లాలు ఏర్పడతాయి. ఇవి పొట్టను కలవరపెట్టి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. ఖాళీ పొట్టతో టీ, కాఫీలు తాగడం వల్ల శరీరంలో కెఫీన్ పుష్కలంగా చేరుతుంది. ఉదయం లేవగానే ఒత్తిడి హార్మోనైనా కార్టిసాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి. అలాంటి సమయంలో టీ, కాఫీలు తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ కార్టిసాల్ స్థాయిలను పెంచేస్తుంది. ఇది అధిక ఒత్తిడికి కారణం అవుతుంది. కాబట్టి టీ, కాఫీలను పరగడుపున ఖాళీ పొట్టతో తాగవద్దు.
పండ్లు
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిని రోజూ తినాల్సిన అవసరం ఉంది. కానీ పరగడుపున మాత్రం తినకూడదు. కొన్ని పండ్లను ఖాళీ పొట్టతో తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
తీపి అల్పాహారాలు
ఉదయం పూట పరగడుపున తినే అల్పాహారాలు తీపిదనం లేకుండా చూసుకోవాలి. తీపిదనం అంటే చక్కెర కలిపిన పదార్థాలే అవుతాయి. అలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉదయాన ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినడం మంచిది. ఇది రోజంతా ఆకలిని తగ్గిస్తుంది. తీపి అల్పాహారాలు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి ఆ రోజంతా నీరసంగా ఉంటారు.
Also read: ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తాడు, వచ్చిన వెంటనే ఆ పనిలో పడతాడు, అతడిని మార్చడం ఎలా?
Also read: స్క్రీన్ టైమ్ పెరిగితే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Weight Loss: జిమ్కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి
Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?
Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?
Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు
Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
/body>