అతడి పేరే సాంబార్‌కు పెట్టారు



తెలుగు రాష్ట్రాల్లో కూడా సాంబార్‌కు అభిమానులు ఎక్కువ. ఈ సాంబార్ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.



తంజావూరు మహారాజైన ఏకోజి కుమారుడైన షాహాజీ1 తన వంటగదిలో సాంబార్ను మొదటిగా సృష్టించాడని అంటారు.



ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు అయినా శంబాజీ తంజావూరును సందర్శించేందుకు వస్తున్నట్లు కబురు పంపాడు.



అతని కోసం ఈ కొత్త వంటకాన్ని షాహాజీ దగ్గరుండి మరీ వండించాడని చెబుతారు.



గౌరవనీయమైన అతిధికి గౌరవప్రదంగా ఈ సాంబార్‌ను వడ్డించారని అంటారు.



శంభాజీని ముద్దుగా అందరూ సాంబా అని పిలుచుకుంటారు.



అతని గౌరవార్థం వండిన ఈ వంటకానికి అతని పేరునే ‘సాంబార్’ గా మార్చి పెట్టినట్టు చెబుతారు.



మరొక కథనం ప్రకారం సంస్కృతపదమైన సంభారము నుంచి సాంబార్ అనే పదం పుట్టిందని అంటారు.