నట్స్ లో పోషకాల పవర్ హౌస్ అంటే ముందుగా వాల్ నట్స్ తర్వాత బాదం గురించి ఎక్కువగా చెప్తారు. ఇందులో విటమిన్ ఇ, బి6 పుష్కలంగా ఉన్నాయి. మెదడు కణాలలో ప్రోటీన్లను గ్రహించడంలో సహాయపడతాయి. కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అవసరం. బాదంలో ఇవి సమృద్ధిగా లభిస్తాయి. శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు, వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది. విటమిన్ ఇ గుండె పనీతీరులో సహాయపడే ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. అల్జీమర్స్ ఉన్నవారికి కూడా ఇది మేలైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. బాదం పప్పుని అద్భుతమైన ఆహారంగా మార్చే మరొక పోషకం మెగ్నీషియం. 28 గ్రాముల బాదం పప్పులో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. డైటరీ ఫైబర్ మంచి మూలం. ఉదయాన్నే కొన్ని బాదంపప్పులు తీసుకుంటే అది మిమ్మల్ని ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంచుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండెకి మంచి ఆహారంగా నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుని నియంత్రించడంలో బాదంపప్పు కీలక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే అధికంగా తీసుకుంటే గుండె ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.