ఒత్తిడి హార్మోను ఎక్కువైతే ఇలాగే ఉంటుంది



మనకు కంగారు కలిగించే లేదా భయం కలిగించే సంఘటన జరిగినప్పుడు శరీరంలో సహజంగా ఏర్పడే ప్రతిస్పందనలో భాగంగా కార్టిసాల్ ఉత్పత్తి అవుతుంది.



ఇదొక ఒత్తిడి హార్మోను. శరీరంలో దీన్ని ఉత్పత్తి ఎక్కువైతే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.



కండరాలు బలహీనంగా మారుతాయి. ముఖం ఉబ్బినట్టు అవుతుంది.



పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్టు అనిపిస్తుంది.



రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అధిక రక్తపోటు వస్తుంది.



ఎముకలు బలహీనంగా మారుతాయి. మూడ్ స్వింగ్స్ వస్తాయి.



కాబట్టి కార్టిసాల్ హార్మోను అధికంగా ఉన్నట్టు అనిపిస్తే, ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.