Lemon: ఈ ఆహార పదార్థాలతో నిమ్మకాయ జోడించకపోవడమే ఉత్తమం
సిట్రస్ పండు నిమ్మకాయతో కలిపి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు.
విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ బహుముఖ ప్రయోజనాలు అందిస్తుంది. అటు ఆరోగ్యానికి, ఇటు వంటలకి దీన్ని భారతీయులు విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. దాని రుచి, ఆకృతి, సువాసన అన్ని అద్భుతమై. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు అందించే నిమ్మకాయతో జత చేసి తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. రుచికరమైన పదార్థాలకు జోడిస్తే వాటి రుచి, ఆకృతి నాశనం అవుతుంది. అందుకే ఈ పదార్థాలతో నిమ్మకాయ కలిపి ఎప్పుడు తీసుకోవద్దు.
పాలు
పాలలో రెండు చుక్కలు నిమ్మరసం కలిసినా సరే వెంటనే విరిగిపోతాయి. ఎందుకంటే ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పాల ఉత్పత్తులతో కలిస్తే ఆకృతి పాడైపోతుంది. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల ఆమ్ల ప్రతిచర్యలు జరుగుతాయి. తీవ్రమైన గుండెల్లో మంట ఏర్పడుతుంది.
స్పైసీ ఫుడ్స్
స్పైసీ ఫుడ్ కి మరింత టేస్ట్ జోడించుకోవడం కోసం చాలా మంది దాని మీద నిమ్మరసం పిండుకుని తింటారు. కానీ అది కరెక్ట్ కాదు. నిమ్మ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. స్పైసీ ఫుడ్ వేడిని తీవ్రతరం చేస్తుంది. అందుకే స్పైసీ ఫుడ్ కి నిమ్మరసం మరింత స్పైసీ నెస్ ని జోడిస్తుంది.
రెడ్ వైన్
రెడ్ వైన్ తో నిమ్మరసం కలిపి తీసుకోకూడదు. రుచిని పూర్తిగా మార్చేస్తుంది.
సీ ఫుడ్
నిమ్మకాయని తరచుగా సీ ఫుడ్ వండేటప్పుడు ఉపయోగిస్తారు. కానీ ఇది ఉత్తమ ఎంపిక అసలు కాదు. నిమ్మకాయ సోల్ లేదా చేపల రుచిని నాశనం చేస్తుంది. వాటి రుచి మరింత పెంచాలని అనుకుంటే నిమ్మకాయకి బదులుగా నారింజ వంటి వాటిని ఎంచుకోవడం మంచిది.
తీపి పండ్లు
పుచ్చకాయ, బాగా పండిన స్ట్రాబెర్రీలను తినేటప్పుడు వాటి మీద నిమ్మకాయ పిండుకుంటారు. కానీ ఇది ఆ పండ్ల సహజ తీపి రుచిని అధిగమించేస్తుంది. అందుకే పండ్లు రుచి మరింత పెంచుకోవాలని అనుకుంటే కొద్దిగా తేనె యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
మజ్జిగ, పెరుగు
మజ్జిగలో చాలా మంది నిమ్మకాయ పిండుకుని తాగుతారు. కానీ పాలతో సమానంగా ఇది కూడా అనేక సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. శరీరానికి వేడి చేసినప్పుడు తగ్గేందుకు ఎక్కువగా మజ్జిగ, నిమ్మకాయ కలిపి తీసుకుంటారు. కానీ అది మంచిది కాదు.
ఆల్కలీన్ కూరగాయలు
నిమ్మరసం ఆమ్లంగా ఉంటుంది. బచ్చలికూర వంటి ఆల్కలీన్ కూరగాయాలతో కలిపినప్పుడు అవి ముదురు రంగులోకి మారిపోయతాయి. వాటి చక్కని ఆకుపచ్చని రూపాన్ని కోల్పోతాయి. అందుకే వాటికి నిమ్మరసం జోడించకపోవడమే ఉత్తమం.
ఏరోమాటిక్ స్పైసెస్
నిమ్మకాయ సిట్రస్ ఫుడ్. కొన్నిసార్లు లవంగాలు, యాలకులు వంటి కొన్ని ఘాటైన సువాసన కలిగిన సుగంధ ద్రవ్యాలతో కలిపి తీసుకోకూడదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!