IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Heart Attack: మీ ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింకులు వల్ల గుండె పోటు వచ్చే అవకాశం, హార్వర్డ్ పరిశోధన ఫలితం

గుండె పోటు వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

FOLLOW US: 

పాతికేళ్ల వయసుకే గుండెపోటు వచ్చేస్తోంది. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటితే కాని గుండె జబ్బులు బయటపడేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒత్తిడిమయమైన జీవితం, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల గుండె సంబంధ వ్యాధులు కలుగుతున్నాయి. అందుకే చిన్న వయసు నుంచే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. 

ఇలాంటి డ్రింకులు
చాలా మంది వ్యాయామాల కోసం జిమ్ బాట పడుతున్నారు. అక్కడ మితిమీరి వ్యాయామం చేసి, వెంటనే ఎనర్జీ డ్రికులు తాగుతున్నారు. మితిమీరిన వ్యాయామం వల్లే చాలా నష్టం జరుగుతుందనుకుంటే, ఆ వెంటనే తాగే ఎనర్జీ డ్రింకులు ఇంకా హాని చేస్తున్నాయి. ఎనర్జీ డ్రింక్స్ తాగే వారి సంఖ్య ఈ మధ్య మరీ పెరిగిపోయింది. ఫ్రిజ్ తెరిస్తే చాలు కచ్చితంగా కనిపించే జాబితాలో ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింకులు చేరిపోయాయి. వీటిని రోజూ తాగే వారు ఎంతో మంది ఉన్నారు. వీటి వల్ల గుండె పోటు వచ్చే అవకాశం మరింత పెరుగుతుందని చెబుతోంది హార్వర్డ్ అధ్యయనం.  

అధిక మొత్తంలో కెఫీన్
ఎనర్జీ డ్రింకులలో అధికమొత్తంలో కెఫీన్ ఉంటుంది. ఒక బాటిల్ డ్రింకులో 200 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువో మీరే ఊహించుకోవచ్చు. ఇంత ఎక్కువ కెఫీన్ శరీరంలోకి చేరితే లోపల చాలా మార్పులు జరుగుతాయి. అవయవాలపై ఎంతో భారం పడుతుంది. కొందరు రోజులో రెండు బాటిళ్లకు మించి తాగుతారు కూడా. అలాంటి వారిలో కెఫీన్ శరీరంలో పేరుకుపోతుంది. దాని ప్రభావం గుండె పనితీరుపై పడుతుంది. గుండె కొట్టుకునే వేగంపై ప్రభావం పడుతుంది. దీన్ని arrhythmia అంటారు. కెఫీన్ అధికమవ్వడం వల్ల ఇది కలుగుతుంది. ఈ ఆరోగ్యస్థితిలో గుండె అత్యధిక వేగంతో కొట్టుకోవడం లేదా మెల్లగా కొట్టుకోవడం జరుగుతుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో విద్యుత్ ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. చివరికి ఈ స్థితి కార్డియాక్ అరెస్టు లేదా గుండె పోటుకు కారణమవుతుంది.  అందుకే యువత ఎనర్జీ డ్రింకులను తాగడం తగ్గించమని సూచిస్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.  దీంతో పాటూ ధూమపానం, మద్యపానం అలవాట్లను కూడా వదిలిపెట్టాలి. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని కూడా తగ్గించుకోమని సూచిస్తున్నారు.

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also Read: కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే రక్తపోటు పెరిగే ప్రమాదం?

Also Read: అంకాపూర్ చికెన్ కర్రీ ఇంట్లోనే ఇలా చేసుకోండి, వండుతుంటేనే నోరూరిపోవడం ఖాయం

Published at : 11 Feb 2022 07:54 AM (IST) Tags: Heart Attacks heart Problems Harvard University Energy Drinks

సంబంధిత కథనాలు

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

Kids Fever: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి

Kids Fever: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి

Corona Virus: ఈ లక్షణాలు కరోనా వైరస్‌వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు

Corona Virus: ఈ లక్షణాలు కరోనా వైరస్‌వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు

టాప్ స్టోరీస్

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో  - ఎవరికంటే?

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక