Brain Ageing Habits: మీకు తెలుసా? కాఫీ, శబ్దాలు.. మిమ్మల్ని గజినీలా మార్చేస్తాయట - నమ్మబుద్ధి కావడం లేదా? కారణాలివే!
Brain Game: మనిషి జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా డిమెన్షియా జబ్బుకు అనేక కారణాలు ఉన్నాయి.యుకేకు చెందినటువంటి శాస్త్రవేత్తల బృందం ఇటీవల కనుగొంది. ఆ కారణాలేంటో తెలుసుకుందాం
Brain Premature ageing: డెమెన్షియా వ్యాధి మనిషి మెదడును క్షీణించేలా చేస్తుంది. దీంతో మతిమరుపు, అకాల వృద్ధాప్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎప్పుడైతే మెదడు నెమ్మదిగా క్షీణించడం ప్రారంభం అవుతుందో, మనిషిలో చురుకుదనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా మనిషి జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. డిమెన్షియా జబ్బుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవే.
1. మద్యం సేవించడం:
ఆల్కహాల్ మెదడును దెబ్బ తీసి అకాల వృద్ధాప్యానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2022లో జరిపిన ఒక అధ్యయనంలో రోజుకు కేవలం రెండు పింట్ల బీర్ లేదా గ్లాసుల వైన్ మెదడుకు 10 సంవత్సరాలకు సమానమైన వయస్సును పెంచుతుందని తేల్చారు. ఒక పింట్ బీరు తాగినా కూడా మెదడు వయస్సును రెండేళ్లు పెంచుతుందని కనుగొన్నారు. దాదాపు 40,000 మందిపై జరిపిన మరో అధ్యయనంలో డెమెన్షియా ప్రమాద కారకాలలో ఆల్కహాల్ ఒకటి అని పేర్కొన్నారు.
2. తగినంత నిద్ర లేకపోవడం:
తగినంత నిద్ర లేకపోతే కలిగే ప్రభావం చాలా మందికి తెలుసు. ఏకాగ్రత కోల్పోవడం, మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. నిద్ర లేమి వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట ఆరు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే వారిలో డిమెన్షియా వచ్చే ప్రమాదం 30 శాతం పెరుగుతుందని తేల్చారు. ఈ పరిశోధనలో నిద్ర లేమి అనేది వేగంగా వృద్ధాప్యం వచ్చే కారణాల్లో ఒకటి అని పరిశోధకులు తేల్చి చెప్పారు.
3. ఒంటరిగా ఎక్కువ సమయం గడపడం:
ఒక వ్యక్తి జీవితంలో ఒంటరితనం అనేది డిమెన్షియాకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి వారిలో కార్టిసాల్, అమిలాయిడ్ హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. ఇవి డిమెన్షియా జబ్బుకు కారణం అవుతాయి.
4. శబ్ద కాలుష్యం:
శబ్ద కాలుష్యం కూడా డిమెన్షియాకు ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పబ్బులు, అలాగే ఇతర సంగీత కచేరీలకు వెళ్లే వారు తమ చెవులు పాడవకుండా ఇయర్ బడ్స్ వంటివి ధరించాలని చెబుతున్నారు. పెద్ద శబ్దాలు మీ వినికిడి లోపం ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాదు ఈ సమస్యను బయట పడేందుకు, మీ వినికిడి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. మీరు సాధారణంగా మీ స్థానిక ఆప్టిషియన్ వద్ద వినికిడి పరీక్షను చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను ముందుగా గుర్తించవచ్చు. వినికిడి లోపం వల్ల మెదడు కూడా క్షీణించే అవకాశం ఉంది.
5. కాఫీ:
రోజుకు ఆరు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాఫీ తాగడం పాత మెదడుతో ముడిపడి ఉందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మోతాదుకు మంచి కెఫిన్ డెమెన్షియాకు కారణమవుతుందని ఈ అధ్యయనం తేల్చింది. న్యూట్రిష నల్ న్యూరోసైన్స్‌లో జరిపిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో డెమెన్షియాతో బాధపడే అవకాశం 53 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.
6. రక్తపోటు, కొలెస్ట్రాల్:
డిమెన్షియాకు హై బీపీ, కొలెస్ట్రాల్ కూడా ఒక ప్రధాన కారణమని ఈ అధ్యయనంలో తేలింది. బ్రెయిన్ స్ట్రోక్, అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధులకు బీపీ, కొలెస్ట్రాల్ కూడా ఒక కారణమే. అయితే ఆరోగ్యకరమైన బరువు, సమతులాహారం, వ్యాయామంతో ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
7. వ్యాయామం లేకపోవడం :
వ్యాయామం మీ మెదడును చురుకుగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రెగ్యులర్ వ్యాయామం కూడా డెమెన్షియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంచుతుంది. బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక అధ్యయనంలో తరచుగా ఏరోబిక్ వ్యాయామం (జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ) చేయడం ద్వారా డిమెన్షియా ప్రమాదం 28 శాతం తగ్గుతుంది. అలాగే అల్జీమర్స్ 45 శాతం తగ్గే అవకాశం ఉంది.
8. జంక్ ఫుడ్:
జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండటం ద్వారా డెమెన్షియా ప్రమాదం నుంచి బయటపడవచ్చు. పండ్లు, కూరగాయలు, రిఫైన్డ్ చేయని బియ్యం తినడం ద్వారా డెమెన్షియా బారిన పడకుండా కాపాడుకోవచ్చు. రెడ మీట్, అధిక చక్కెర ఉన్న ఆహారాలు తిన్నట్లయితే డెమెన్షియా ప్రమాదం పెరిగే వీలుంది.
9. ధూమపానం:
ధూమపానం డెమెన్షియా ప్రమాదాన్ని 50 శాతం వరకు పెంచుతుంది. ధూమపానం చేస్తే, ప్రపంచవ్యాప్తంగా 14 శాతం డెమెన్షియా కేసుల్లో ధూమపానం ఒక కారణమని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
10. ఒత్తిడి:
ఒత్తిడి అనేది ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తుంది. డెమెన్షియాలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడివ డెమెన్షియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక ఒత్తిడి సమయంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మెదడును దెబ్బతీసే డెమెన్షియాను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు