By: ABP Desam | Published : 26 Feb 2022 11:57 AM (IST)|Updated : 26 Feb 2022 11:57 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
ఆహారం తినేదే శరీరానికి శక్తిని అందించడం కోసం, కాని కొన్ని రకాల ఆహారాలు తింటే మాత్రం శరీరం నిస్సత్తువుగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. అందుకే అలాంటి ఆహారాలను దూరంగా పెట్టాలి. అప్పుడప్పుడు తిన్నా ఫర్వాలేదు కానీ, తరచూ తింటే మాత్రం నీరసంగా మారిపోతారు. చాలా మంది ఆహారం తిన్నాక నీరసంగా, డల్‌గా కనిపిస్తారు. ఈ పరిస్థితిని ఫుడ్ కోమా లేదా పోస్ట్ ప్రాండియల్ ఫెటిగ్ అని పిలుస్తారు. ఇది రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన, తాజా ఆహారాన్ని తినాలి. కొన్ని రకాల ఆహారాల్ని దూరం పెట్టాలి.
నూనెలో వేయించిన ఆహారాలు
డీప్ ఫ్రై చేసిన ఆహారపదార్థాలు అలసటకు కారణం అవుతాయి. వీటిద్వారా అధికంగా నూనె,ఉప్పు శరీరంలో చేరుతాయి. ఇది రెండు ఎక్కువైతే శరీరానికి శక్తి అందదు సరికదా అలసిపోయినట్టు అవుతుంది. వీటిని తినడం అనేక రోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి.
వైట్ బ్రెడ్
చాలా సులువుగా వండుకుని తినేసే బ్రేక్ ఫాస్ట్‌లలో వైట్ బ్రెడ్, పాస్తాలు ముందుంటాయి. ఇవి రెండింటిలో పిండి పదార్థాలు అధికం. వీటిని తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. వీటిని తిన్నాక శరీరానికి అలసటగా, నీరసంగా ఉంటుంది. ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులు వెజిటబుల్ నూడుల్స్, హోల్ గ్రెయిన్ బ్రెడ్ వంటివి తినడం మంచిది.
స్వీట్ సెరీల్స్
సెరీల్స్ ను కూడా అల్పాహారంలో అధికంగా తింటారు. వీటిలో తియ్యని సెరీల్స్ కూడా ఉంటాయి. వాటిని దూరంగా పెట్టాలి. బ్రేక్ ఫాస్ట్ సమయంలో వీటిని తినడం వల్ల రోజంతా నీరసంగా అనిపిస్తుంది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి అలసటగా అనిపిస్తుంది.
కెఫీన్
కాఫీ తాగాల్సిన మొత్తం కన్నా అధికంగా తీసుకుంటే శరీరంలో కెఫీన్ చేరుతుంది. దీని వల్ల నీరసం, అలసట, మగత వంటివి కలుగుతాయి. కెఫీన్ తగిన మోతాదులో తీసుకుంటే ఉత్సాహం ఉరకలేస్తుంది. అదే ఎక్కువైతే మాత్రం అలసట, నీరసం కమ్ముకుంటాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: కాఫీ వల్ల మొటిమలు పెరుగుతాయ్, దీనికి ఇవి తోడైతే మరీ డేంజర్
Also read: ఉక్రెయిన్లోనూ ఒక ఒడిశా ఉంది, మొన్నటి వరకు అదో అందమైన నగరం, ఫోటోలు చూడండి
Icecream Headache: ఐస్క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది
PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం
Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?
Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్
Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...
Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?
KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam