Ukraine: ఉక్రెయిన్లోనూ ఒక ఒడిశా ఉంది, మొన్నటి వరకు అదో అందమైన నగరం, ఫోటోలు చూడండి
రష్యా దాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుద్ధం కారణంగా ఈ రెండూ దేశాలు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాయి.
రష్యా - ఉక్రెయిన్... రెండూ ఐరోపాలోని సరిహద్దు దేశాలు. ఇప్పుడు రష్యా ధాటికి ఉక్రెయిన్ నిప్పుల గుండంగా మారింది. రష్యా రెండు రోజుల నుంచి ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తూ మారణహోమం సృష్టిస్తోంది. మూడు రోజుల ముందు వరకు ఉక్రెయిన్ ఓ అందమైన దేశం. జలపాతాలు, నల్లసముద్రం సరిహద్దులు, అజోవ్ సముద్ర బీచ్‌లు, ప్రాచీనకాలం నాటి కట్టడాలతో ఐరోపాలో ప్రముఖ పర్యాటక స్థలంగా ఉండేది. ఇప్పుడు చాలా చోట్ల నల్లటి పొగ, మొండిగోడలే కనిపిస్తున్నాయి. మనదేశంలో ఉన్న ఒడిశా రాష్ట్రం పేరుతో ఉక్రెయిన్లోనూ ఓ పట్టణం ఉంది. దాని పేరును వారు‘ఒడెస్సా’అని పిలుస్తారు. ఉక్రెయిన్లోని అందమైన నగరం ఇది. నల్లసముద్రం అంచున ఉండే ఈ నగరాన్ని ‘నల్ల సముద్రపు ముత్యం’ అని పిలుచుకుంటారు ఉక్రెయిన్లు.
ఈ పట్టణాన్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్ధంలో గ్రీకులు పాలించారు. అప్పట్లో ఇది గ్రీకు వాణిజ్య స్థావరంగా ఉపయోగించుకునేవారు. అందుకే ఈ ప్రాంతం చారిత్రక కట్టడాలతో విలసిల్లింది. ఉక్రెయిన్లోని ఉత్తమ మెడికల్ కాలేజీలలో ఇక్కడ ఉన్న ‘ఒడిశా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ’ కూడా ఒకటి. ఈ యూనివర్సిటీలోనే ఎంతో మంది భారతీయులు కూడా చదువుతున్నారు. ఈ అందమైన నగరం ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. యుద్ధానికి ముందు ఈ నగరం ఫోటోలను చూడండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram