Coffee: కాఫీ వల్ల మొటిమలు పెరుగుతాయ్, దీనికి ఇవి తోడైతే మరీ డేంజర్
టీనేజీలోకి వస్తున్న ప్రతి అమ్మాయి,అబ్బాయికి ఎదురయ్యే సమస్య మొటిమలు.
పదమూడేళ్లు దాటుతున్నాయంటే చాలు టీనేజీ వయసులోకి అడుగుపెట్టినట్టే లెక్క. అప్నట్నించి ఎన్నో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ముఖం మీద మొటిమలు మొదలవుతాయి. ఆ వయసులో మొదలైన సమస్య 30 ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంది. కొందరిలో ఆ వయసు దాటాకా కూడా రావచ్చు. వయసు మార్పుల వల్ల వచ్చే మొటిమలు త్వరగా పోతాయి. కానీ కొన్ని ఆహారాల వల్ల కూడా ఆ సమస్య అధికమవుతుంది. అందులో కాఫీ కూడా ఒకటి. కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి మొటిమలు.
అందమైన చర్మాన్ని ఎవరు మాత్రం కోరుకోరు? కానీ పెరుగుతున్న కాలుష్యం, మురికి, రసాయనాలు కలిసిన సౌందర్య ఉత్పత్తులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చర్మంపై చాలా చెడు ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే అది కూడా ఒక కారణం అవుతుంది. కేవలం కాఫీ మాత్రమే కాదు పాలు, పాత ఉత్పత్తులు, కారం అధికంగా ఉండే ఆహారం, బ్రెడ్, జంక్ ఫుడ్స్ వంటివి కూడా మొటిమలు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.
కాఫీ వల్ల ఏం జరుగుతుంది?
ఆరోగ్యనిపుణులు చెప్పిన దాని ప్రకారం కాఫీ అధికంగా తాగే వారిలో విరచేనాలు, మొటిమలు హర్మోన్ల అసమతుల్యత వల్ల వస్తాయి. నూనె, చక్కెర, మసాలా, ప్రాసెస్ చేసిన ఆహారం మొటిమలకు కారణం అవుతాయి. కాఫీలో పాలు, కెఫీన్ అధికంగా ఉంటాయి. కాఫీ, చక్కెర, వెన్న కలిసిన ఈ సమ్మేళనం శరీరంలో అధిక వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మొటిమలు రావడమే కాదు, బ్రేకవుట్లకు దారితీయవచ్చు. అధికంగా కాఫీలు తాగే వారిలో మొటిమలు వచ్చి, అవి పగులడం ఎక్కువవుతుంది. కాబట్టి రోజుకు ఒకట్రెండుకు మించి తాగకపోవడమే మంచిది.
కాఫీ తాగాక వీటిని తినవద్దు
కాఫీ తాగడానికి ముందు లేదా తరువాత జంక్ ఫుడ్ ను తినకూడదు. ఇలా తినడం శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది మొటిమలు బ్రేకవుట్లకు కారణం అవుతుంది.అధిక కాఫీ వల్ల అవసరమైన విటమిన్లు, నీటిలో కరిగే ఖనిజాలు బయటకు పోతాయి.కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం చాలా అవసరం. రోజుకోసారి కాఫీ తాగి మిగతా సమయంలో గ్రీన్ టీ, స్మూతీలు, మిల్క్ షేక్స్, పుదీనా టీ వంటి కెఫీన్ లేని పానీయాలు తాగాలి.
Also read: రక్తం తాగే డ్రాకులా ఓ అబద్ధం, కానీ రక్తం తాగే వ్యాధి మాత్రం నిజం
Also read: డయాబెటీస్‌తో యమ డేంజర్, ఈ తప్పిదాలతో పక్షవాతం ముప్పు