Dracula: రక్తం తాగే డ్రాకులా ఓ అబద్ధం, కానీ రక్తం తాగే వ్యాధి మాత్రం నిజం
వాంపైర్ సినిమాలు చాలా చూసే ఉంటారు. నిజంగానే వాంపైరిజమ్ అనే వ్యాధి ఉంది.
రక్తం తాగే వాంపైర్ కథాంశంతో చాలా ఇంగ్లిష్ సినిమాలు వచ్చాయి. ఎన్నో కథలు కూడా వీటి ఆధారంగా రచించారు. అయితే వాంపైర్ అనేది ఫిక్షనల్ పాత్ర మాత్రమే. వాటి ఉనికి ఎక్కడా నిర్ధారించలేదు. వాంపైర్ మనుషుల్లాగే ఉంటాయి, కానీ అవి రక్తం తాగుతుంటాయి. వాంపైర్లు, డ్రాకులాలు ఓ అబద్ధం. కథల కోసం పుట్టిన ఈ క్యారెక్టర్లు ఇవి. చారిత్రక పాత్రలు మాత్రమే. కానీ రక్తం తాగే జబ్బు మాత్రం నిజం. అవును ప్రపంచంలో చాలా కొద్దిమందికి ఈ వ్యాధి ఉంది. పేరు ‘క్లినికల్ వాంపైరిజమ్’
ఆటో వాంపైరిజమ్
సాధారణ మనుషులు కూడా వేలు చిన్నది తెగి రక్తం వస్తే చాలు చటుక్కున వేలు నోట్లో పెడతారు. వారికి ఆ రక్తం రుచి తెలుస్తుంది. అయినా ఇబ్బంది పడకుండా రక్తం ఆగేవరకు అలా నోట్లోనే వేలు పెట్టి ఉంచతారు. ఇలా రక్తం రుచి చూడడాన్ని ఆటో వాంపైరిజమ్ అంటారు. వీరికి ప్రత్యేకంగా రక్తం రుచి చూడాలని ఉండదు. అనుకోకుండా చేస్తారు. మరికొందరు వేలు తెగినా నోట్లో వేలు పెట్టకుండా ఆపేందుకు ప్రయత్నిస్తారు. వీరికసలు రక్తం నాలికను తాకడమే ఇష్టం ఉండదు.
క్లినికల్ వాంపైరిజమ్
ఇదొక మానసిక రుగ్మత. ఈ వ్యాధి ఉన్నవారికి రక్తం తాగాలన్న కోరిక కలుగుతుంది. ఈ కోరిక సాధారణంగా ఉంటే ‘క్లినికల్ వాంపైరిజమ్’ అంటారు. అదే ఆ కోరిక తీవ్రస్థాయిలో ఉంటే ఆ జబ్బును ‘రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్’అంటారు. వీరు రక్తం తాగకుండా ఉండలేరు. ఒక్కోసారి వేలి కోసుకుని రక్తం తాగాలనిపిస్తుంది. కానీ ఆ కాంక్షను అణుచుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఎందుకొస్తుంది?
ఈ వ్యాధి ఎందుకు కలుగుతుందో కచ్చితంగా చెప్పలేకపోయారు వైద్యులు. యుక్తవయసుకు ముందే జరిగిన ఏదైనా ఘటన ఇలాంటి వ్యాధిలో అతనిలో కలిగేందుకు ప్రేరణ కలిగి ఉండవచ్చు. ఆటోవాంపైరిజమ్‌తో మొదలై చివరికి ‘రెన్ ఫీల్డ్స్ సిండ్రోమ్’ దశకు చేరుకుంటుంది. రక్తంతో కూడిన గాయాలు కావడం, లేదా లైంగికంగా వేధింపులకు గురైనప్పుడు రక్తం కళ్ల చూడడం వంటివి వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అనుకోకుండా రక్తాన్ని రుచి చూసిన వారు కూడా ఒక్కోసారి ఈ వ్యాధి బారిన పడతారు. ఆటో వాంపైరిజమ్‌లో ఎవరి రక్తం వారికే తాగాలనిపిస్తుంది.కానీ ఇతర మనుషుల లేదా జంతువుల రక్తం తాగాలనిపిస్తే మాత్రం దాన్ని ‘జూఫాగియా’ అంటారు.
చికిత్స లేదు
ఇది చాలా అరుదైన వ్యాధి. అందుకే దీనికి నిర్ధిష్టమైన చికిత్స లేదు. బిహేవరియల్ రుగ్మత కింద లెక్కించి చికిత్స అందిస్తారు. పూర్తిగా తగ్గుతుందన్న నమ్మకం కూడా లేదు.
Also read: డయాబెటీస్‌తో యమ డేంజర్, ఈ తప్పిదాలతో పక్షవాతం ముప్పు
Also read:నార్మల్ డెలివరీకి సిద్ధపడుతున్నారా? అయితే ఈ ఆహారాలు తినండి