అన్వేషించండి

Normal Delivery: నార్మల్ డెలివరీకి సిద్ధపడుతున్నారా? అయితే ఈ ఆహారాలు తినండి

సహజప్రసవానికి సిద్ధపడే కాబోయే తల్లులు కొన్ని రకాల ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి.

సిజేరియన్ కన్నా సహజ ప్రసవం చాలా మంచిదని చెబుతారు వైద్యులు. భవిష్యత్తులో తల్లులకు ఎలాంటి సమస్యలు రావని అంటారు. శరీరంపై కోతతో చేసే సిజేరియన్ పోలిస్తే, సాధారణ ప్రసవం సహజంగానే మంచిది. అయితే సహజ ప్రసవం జరగడం ఇప్పుడంత సులభం కాదు. ఏడో నెల వచ్చినప్పటి నుంచే కొన్ని రకాల వ్యాయామాలు, నడక వంటివి చేస్తూ ఉండమని సలహా ఇస్తారు వైద్యులు. అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ డెలివరీ సులభంగా కావచ్చు. డెలివరీకి నెల రోజులు ఉందనగా కొన్ని రకాల ఆహారాలు తరచూ తినడం మొదలుపెట్టాలి. 

పైనాపిల్
గర్భం దాల్చిన కొత్తలో వీటిని తినకూడదు. వీటి గర్భవిచ్చిత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏడు నెలల దాటాకా మాత్రం ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. కావాలంటే ఓ వైద్యుడి సలహా తీసుకుని మరీ తినవచ్చు. ఇది సహజప్రసవం అయ్యే అవకాశాన్ని పెంచుతుంది. ఈ పండులో బ్రోమేలైన్  అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సహజ ప్రసవం అయ్యేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి ఎనిమిది నెలలు నిండాక దీన్ని తినడం ప్రారంభించండి. 
`
పచ్చిబొప్పాయి
బొప్పాయి గర్భం ధరించిన మొదట్లో తినకూడదని అంటారు. అది నిజమే. కానీ డెలివరీకి సమయం సమీపిస్తున్నప్పుడు మాత్రం నిశ్చింతగా తినవచ్చు. పచ్చిబొప్పాయిని కూరగా వండుకుని తినవచ్చు. లేదా పప్పులో కలిపి వండుకుని తినవచ్చు. కానీ పండిన బొప్పాయి వల్ల మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. అందుకే పచ్చిబొప్పాయితో వండుకునే వంటలను చేసుకుని తింటే ప్రసవం సుఖంగా అవుతుంది. 

రాస్బెర్రీ ఆకు
ఎర్రని రాస్బెర్రీ పండ్లు తెలుసుగా. వాటి ఆకుల్లో కూడా సహజ ప్రసవాన్ని పెంచే గుణాలు ఉంటాయి. వాటి ఆకులతో టీ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రసవానికి రెండు వారాల ముందు నుంచి దీంతో టీ చేసుకుని తాగడం మొదలుపెడితే మంచిది. తాగే ముందు వైద్యుల సలహా తీసుకోండి. 

ఖర్జూరం
ఖర్జూరం మనకి విరివిగా దొరికే ఆహారమే. ఇది తింటే ఎంతో బలం కూడా. రోజూ ఉదయం రెండు ఖర్జూరాలు, సాయంత్రం రెండు ఖర్జూరాలు తప్పకుండా తింటే మంచిది. గర్భం దాల్చినప్పటి నుంచి తిన్నా బిడ్డ బలంగా, ఆరోగ్యంగా పుడతారు. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది కూడా సహజ ప్రసవానికి సహకరిస్తుంది. అయితే కొంతమంది గర్భిణులు జెస్టేషనల్ డయాబెటిస్ బారిన పడతారు. ఇది గర్భంతో ఉన్నప్పుడు వచ్చే షుగర్ వ్యాధి. వారు మాత్రం ఖర్జూరాలకు దూరంగా ఉండాలి. ఈ షుగర్ వ్యాధి ప్రసవం అయ్యాక పోతుంది. చాలా తక్కువ మందిలో మాత్రం జీవితాంతం కంటిన్యూ అయిపోతుంది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: మనిషిని కూల్చేసే పక్షవాతం, మధుమేహంతో అదొచ్చే అవకాశం ఎక్కువే

Also read: వారానికోసారి బోన్ సూప్, తాగితే అందం ఆరోగ్యం కూడా, ఇదిగో సింపుల్ రెసిపీ

టాప్ హెడ్ లైన్స్

Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget