By: ABP Desam | Updated at : 24 Feb 2022 10:48 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
మటన్ కర్రీ, వేపుడు, బిర్యానీలే కాదు అప్పుడప్పుడు వాటి ఎముకలతో సూప్ కూడా చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. ఈ సూప్‌ను కేవలం మటన్ బోన్స్ తోనే కాదు, చికెన్ బోన్స్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ మటన్ ఎముకలతో చేస్తేనే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు అందుతాయి. రుచి కూడా బావుంటుంది.
1. మటన్ సూప్‌లో చర్మ సౌందర్యానికి అవసరమైన కొల్లాజెన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి, జుట్టుకు, గోళ్లకు మెరుపును అందిస్తుంది. కాబట్టి మటన్ సూప్ అప్పుడప్పుడు తింటే మెరిసే అందం మీ సొంతం.
2. వీటిలో అనేక ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థకు ఇదెంతో మేలు చేస్తుంది. బ్యాక్టిరియాను తట్టుకునే శక్తినిస్తుంది.
3. మలబద్ధకం సమస్య ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. డయేరియాని ఇది అడ్డుకుంటుంది.
4. ఈ సూప్‌లో గెలాటిన్ లభిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టిరియా పెరుగుదలను పెంచుతుంది.
5. ఇవి మంచి డిటాక్సిఫికేషన్ డ్రింకులా కూడా పనిచేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపిస్తుంది.
6. కాల్షియం లోపం ఉన్నవారికి ఇది మంచి ఆహారం. ప్రతి రెండు రోజుకోసారి తాగితే కాల్షియం లోపం ఇట్టే పోతుంది. కాల్షియం లోపం లేనివాళ్లు ఆరోగ్యం కోసం వారానికోసారి దీన్ని చేసుకుని తాగితే చాలా మంచిది.
దీన్ని ఇంట్లో చేసుకోవడం చాలా సులువు. నిజం చెప్పాలంటే మటన్ కర్రీ, బిర్యానీ కన్నా కూడా సూప్ చేసుకోవడమే ఈజీ.
కావాల్సిన పదార్థాలు
మటన్ బోన్స్ - ఒక పావుకిలో
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
ధనియాల పొడి - ఒక స్పూను
లవంగాలు - నాలుగు
దాల్చిన చెక్క - చిన్నముక్క
అనాసపువ్వు - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
నూనె - ఒకటిన్నర స్పూను
తయారీ
1. సూప్ కుక్కర్లో వండి మంచి టేస్టుగా వస్తుంది.
2. కుక్కర్లో నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేయాలి.
3. తరువాత నిలువుగా కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక పసుపు వేసి వేయించాలి.
4. మటన్ బోన్స్ వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో సూప్ కి సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి విజిల్ పెట్టేయాలి.
5. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయాలి.
6. విజిల్ తీసేశాక మళ్లీ స్టవ్ వెలిగించి అందులో ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే నీళ్లు పోయాలి.
7. మళ్లీ కాసేపు ఉడికించుకున్కాక స్టవ్ కట్టేయాలి. పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే టేస్టీ బోన్ సూప్ రెడీ.
Also read: మీరు తినే ఆహారంలో ప్లాస్టిక్ కలుస్తోంది గమనించారా? ఎలా అంటే ఇదిగో ఇలా
Also read: కోవిడ్ తగ్గాక రెండేళ్ల బాబుకి కార్డియాక్ అరెస్టు, పోస్టు కోవిడ్ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు
Dark Chocolates: షాకింగ్, ఈ చాక్లెట్లో భారీ లోహాలు - అవి తింటే ప్రమాదకరమా?
Snoring: నిర్లక్ష్యం వద్దు - ఈ స్లీపింగ్ కిల్లర్ వల్ల స్ట్రోక్, గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువే!
New Virus: ప్రపంచానికి పొంచి ఉన్న మరో 'వైరస్' ముప్పు- కరోనాని మించిపోయేలా మరణాలు!
Millets: చిరుధాన్యాలు తింటే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయా?
కాలిన గాయాలకు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే
BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!
విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు - అందుకే ఆయన అలా చేశారు: ముత్తయ్య మురళీధరన్
MLC What Next : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్ కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?
Bigg Boss Season 7 Latest Promo: ‘నువ్వెంత’ అంటూ శివాజీపై నోరుపారేసుకున్న గౌతమ్ - పల్లవి ప్రశాంత్‌పై అమర్ దీప్ ప్రతాపం
/body>