By: ABP Desam | Updated at : 24 Feb 2022 08:03 AM (IST)
Edited By: harithac
ప్రతీకాత్మక చిత్రం (Image credit: Pixabay)
పిల్లలకు కోవిడ్ వచ్చినా పెద్దగా ప్రభావం చూపించదనే నమ్మకం ఉంది ప్రజల్లో. కానీ కొందరి పిల్లల్లో మాత్రం అది ప్రాణాంతక సమస్యలు తీసుకొస్తుంది. కోవిడ్ వచ్చిన తగ్గాక కూడా వారిలో వైరస్ ప్రభావం కనిపిస్తుంది. ఢిల్లీలోని తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు ఓ రెండేళ్ల బాబు. గతేడాది డిసెంబర్లో అతడికి కోవిడ్ వచ్చింది. కొన్ని రోజుకే నెగిటివ్ చూపించింది. కోవిడ్ తగ్గిన తరువాత అతనిలో దగ్గు మొదలైంది, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. కొన్ని రోజుల తరువాత విపరీతమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతను ఆసుపత్రిలో అడుగుపెట్టి కొన్ని నిమిషాలకే కార్డియాక్ అరెస్టు సంభవించింది. వైద్యులు సకాలంలో స్పందించి సీపీఆర్ మొదలుపెట్టారు. దాదాపు అరగంట సేపు పీసీఆర్ చేశాక మళ్లీ గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. పసివాడి ప్రాణం నిలబడింది.
ఆ పిల్లాడికి బ్రోన్కియోలిటిస్ అనే సమస్య ఉన్నట్టు గుర్తించారు. అది నిమోనియాలో తీవ్రస్థాయి అన్నమాట. నిమోనియాల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని, గుండె చుట్టూ ఉన్న సాక్ కూడా ప్రభవితం అయ్యింది. దాని వల్లే కార్డియాక్ అరెస్టు సంభవించింది. రెండేళ్ల పిల్లాడిలో ఇలా కలగడం వైద్యులను సైతం ఆశ్యర్యపరిచింది. చికిత్స అందించిన డాక్టర్ సయీద్ ముస్తఫా హసన్ మాట్లాడుతూ ‘ఆ పిల్లాడు మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఇది ప్రధాన అవయవాలను ఫెయిల్యూర్ చేసి ప్రాణం తీస్తుంది’ అని వివరించారు.
Also read: ఉదయాన ఈ పనులు చేసే చెడు అలవాటు మీకుందా? వెంటనే వదిలేయండి
పోస్టు కోవిడ్ ఫలితం
కరోనా సోకడానికి ముందు బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కరోనా వచ్చక మాత్రం తీవ్ర ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. కరోనా సమయంలో ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదు. అది తగ్గాకే చాలా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కనీసం యూరిన్ కూడా వెళ్లలేకపోయేవాడు. మాట్లాడడం కష్టమైంది, ఎదుటి వారిని చూసి మాట్లాడే ఐ కాంటాక్ట్ ను కూడా కోల్పోయాడు. ఇవన్నీ పోస్టు కోవిడ్ ఫలితాలుగానే చెప్పారు వైద్యులు.
Also read: జెర్సీ అంటే టీ షర్టు అనుకుంటివా? ఓ జబ్బు పేరు కూడా
చికిత్స ఎలా?
సీపీఆర్ చేయడం వల్ల బాబు కోలుకున్నాడు. తరువాత అతని శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించారు వైద్యులు. వెంటనే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ప్రారంభించారు. ‘బాబుకి చికిత్స 60 గంటల పాటూ నాన్ స్టాప్ గా చేశాం. ఇన్ ఫెక్షన్లను తొలగించడానికి మేము సైటో సోర్బ్ డయాలసిస్ ఫిల్టర్‌ను ఉపయోగించాం. రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు కష్టపడాల్సి వచ్చింది’ అని చెప్పారు వైద్యులు. దాదాపు ఆ పిల్లాడు 15 నుంచి 16 రోజులు ఐసీయూలో ఉన్నాడు. ఆ సమయంలోనే వైద్యులు పనితీరు మందగించిన అతని మూత్రపిండాలు,గుండె, ఊపిరితిత్తులు సాధారణంగా పనిచేసేలా చికిత్స అందించారు. నెల రోజులకు చిన్నారి కోలుకున్నాడు.
పిలల్లో కార్డియాక్ అరెస్టు చాలా అరుదు. కానీ అక్కడక్కడ జరిగే అవకాశం ఉంది. పోస్టు కోవిడ్‌లో కనిపించే లక్షణాలను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కేవలం కరోనా వైరస్ మాత్రమే రెండేళ్ల పిల్లాడికి ఈ పరిస్థితిని తీసుకొచ్చింది అని వివరించారు వైద్యులు
Using Phone At Bathroom: టాయిలెట్లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!
రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం
Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి
Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
/body>