Bad Habits: ఉదయాన ఈ పనులు చేసే చెడు అలవాటు మీకుందా? వెంటనే వదిలేయండి
కొన్ని అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరకొన్ని మాత్రం జీవితాన్ని, ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి.
మన ప్రొడక్టవిటీని, ఉత్సాహాన్ని పెంచేలా ఉండేలా అలవాట్లు. కానీ కొన్ని మాత్రం మన పనితీరు నెమ్మదించేలా చేస్తాయి. చాలా ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. త్వరగా కోపం వచ్చేలా ప్రేరేపిస్తాయి. దీని వల్ల మన కోపం ఇంట్లో వాళ్లపై చూపిస్తాము. బంధాలు దెబ్బతింటారు. అందుకే ప్రతి రోజూ ఉదయాన మీరు పాటించే కొన్ని చెడు అలవాట్లను వదిలేస్తే మంచిది.
ఫోన్ చూడడం
చాలా మంది ఉదయం నిద్రలేవగానే కళ్లు నులువుకుంటూ మరి ఫోన్ చూస్తారు. వాట్సాప్ స్టేటస్ ని ఎంత మంది చూశారో, ఇన్ స్టాలో ఎంత మంది లైకులు కొట్టారు ఇదే పని. ఇది చాలా విషపూరితమైనది. కళ్లను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మీకు మరింత నీరసంగా అనిపిస్తుంది. ఉత్సాహం ఉండదు. లేచిన వెంటనే ఫోన్ చూడకుండా వెచ్చని నీళ్లు తాగండి. ముఖం కడుక్కోండి. బాల్కనీలో లేదా, కిటికీ నుంచి వచ్చే స్వచ్చమైన గాలిని గుండెలనిండా పీల్చండి. ఉదయాన కాసే చిరు ఎండలో తిరగండి. లేచిన ఓ గంట తరువాత ఫోన్ చూసుకోండి.
బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయద్దు
చాలా మందికి ఉండే చెడు అలవాటు ఇది. ఆలస్యంగా లేవడం, లేచాక ఏమీ తినకుండా కాఫీ, టీ తాగి రోజును మొదలుపెడతారు. అల్పాహారం చేయకుండా ఉండిపోతారు. నేరుగా మధ్యాహ్న భోజనమే చేస్తారు. అది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. గుడ్డు, టోస్ట్, ఓట్ మీల్, తాజా పండ్లు, ఇడ్లీ వంటివి అల్పాహారంగా తీసుకోవాలి.
వాయిదా వేసే పద్దతి
ఉదయం లేచాక ఆ రోజు చేయాల్సిన పనులేంటో ఓసారి చూసుకోండి. మార్నింగ్ లేచాక ఎక్కువ సమయం వేస్టు చేసుకోకుండా ఆ రోజు చేయాల్సిన పనులను ప్రణాళిక వేసుకోవడం ఉత్తమం. వాయిదా పద్ధతిని వదులుకుంటే మీకే మేలు.
స్నానం మానేయడం
కొంతమందికి ఈ అలవాటు ఉంది. స్నానం చేయకుండానే ఇంట్లోంచి బయటికి లేదా ఆఫీసులకు వెళతారు. ఇది చాలా చెడు అలవాటు. స్నానం చేస్తే తాజా అనుభూతి కలుగుతుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు సహకరిస్తుంది. ముఖ్యంగా కోపం త్వరగా రాదు. స్నానం మన శరీరంలో కొన్ని రకాల హార్మోన్లను విడుదలయ్యేలా చేస్తుంది. అవి అధికపనితీరును, శక్తిని అందిస్తుంది.
ప్రతికూల ఆలోచనలు
ఉదయం లేచిన వెంటనే ప్రతికూల ఆలోచనలు చేయకండి. అవి మీ రోజు మొత్తాన్ని నిరుత్సాహంగా మారుస్తాయి. ఉదయం లేచాక యోగా, ధ్యానం వంటివి చేయాలి. మీ జీవితంలో జరిగిన మంచిని తలచుకోండి. సాధించాల్సిన లక్ష్యాలను గుర్తుకు తెచ్చుకోండి. ప్రతికూల ఆలోచన నిరాశన కలుగచేస్తుంది.
Also read: జెర్సీ అంటే టీ షర్టు అనుకుంటివా? ఓ జబ్బు పేరు కూడా
Also read: ఈ యోగాసనాలతో నెలసరి నొప్పులను తగ్గించుకోవచ్చు, శిల్పా శెట్టి వీడియో పాఠాలు
Also read: