Meat: నెలపాటు మాంసాహారం మానేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఇవే
నెలరోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటే ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి.
Meat: వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతున్న ప్రకారం గత కొన్ని ఏళ్లుగా ప్రపంచంలో శాకాహారుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల్లో మాంసాహారాన్ని వదిలి శాఖాహారం వైపుగా మారుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది మాంసాహారులు, శాఖాహారులుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతోపాటు, పర్యావరణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. మొక్కల ఆధారిత ఆహారాలు సాధారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి సమస్యలతో చాలా తక్కువ సంబంధాన్ని కలిగి ఉంటాయి. శాఖాహారులకు ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే ఎంతోమంది మాంసాహారాన్ని విడిచి శాఖాహారం వైపుగా ఆసక్తి చూపిస్తున్నారు. శాఖాహారంలో మొక్కల ఆధారిత ఆహారాలు అధికం. ఇవి పోషక అవసరాలను కూడా తీరుస్తాయి. మొక్కల ఆధారిత ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగు కదలికలను నియంత్రించి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను అందిస్తుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
మొక్కల ఆధారిత ఆహారానికి మారడం మరో ముఖ్య కారణం బరువు పెరగకుండా ఉండడం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు మాంసాహారాన్ని మానేయాలి. పూర్తిగా శాకాహారం పైనే ఆధారపడాలి. జంతు ఉత్పత్తులతో పోలిస్తే శాఖాహార ఉత్పత్తుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి త్వరగా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది.
జంతు ఆధారిత ఆహారాలు అందులోనూ ప్రాసెస్ చేసిన మాంసాలు శరీరంలో ఇన్ఫర్మేషన్ ను పెంచుతాయి కాబట్టి మాంసాహారాన్ని వినియోగించడం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి ఇవి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి జంతువు ఆధారిత ఆహారాలలో సంతృప్త ట్రాన్స్ఫార్ట్స్ అధికంగా ఉంటాయి ఇవి రక్తంలో కొలెస్ట్రాలను పేరుకుపోయేలా చేస్తాయి కాబట్టి నెల రోజులు పాటు మాంసాహారాన్ని తినకుండా పూర్తి శాకాహారాన్ని తిని చూడండి మీ శరీరంలో వచ్చే ఎన్నో మార్పులు మీకు స్పష్టంగా తెలుస్తాయి. మానసిక ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి మీరు కోపం తక్కువగా తెచ్చుకుంటారు ప్రశాంతంగా ఉంటారు
శాఖాహారం శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సెల్యులర్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. అంటే కణాలు నష్టపోకుండా కాపాడుతుంది. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు కూడా ఆరోగ్యంగా ఉండి ప్రశాంతమైన మనసుని ఇస్తుంది. పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే అందుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదమూ తగ్గుతుంది. ఇవి రోజంతా శక్తి స్థాయిలను అందించడానికి సహాయపడతాయి.
అయితే అన్ని రకాల మాంసాహారాలు ఒకే స్థాయిలో ప్రమాదాన్ని కలిగించవు. చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే. వీటిని తినడం వల్ల మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. అయితే ప్రాసెస్ చేసిన మాంసాలను మాత్రం తినకూడదు. అంటే బేకన్, సాసెజ్, పిజ్జా, బర్గర్, కెఎఫ్‌సి చికెన్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన మాంసాహారాల్లోకి వస్తాయి. వాటిని తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య నష్టం జరుగుతుంది.
Also read: ఆ గర్భం నా వల్ల వచ్చింది కాదనిపిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలి?
Also read: దగ్గు మందులో ఈ హానికర రసాయనం? ఇది లేని దగ్గు సిరప్ ఎంచుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.