Teachers Day 2025 : టీచర్స్ డే 2025 స్పెషల్.. ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే బెస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే
Gifts for Teachers Day : టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు థ్యాంక్స్ (Happy Teachers Day 2025) చెప్తూ ఏమైనా గిఫ్ట్‌లు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఐడియాలు ఇవే

Budget Friendly Gift Ideas for Teachers : ఇండియాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం (Teachers Day 2025 Date in India) సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటారు. ఈ ఏడాది (2025)లో టీచర్స్ డే శుక్రవారం వచ్చింది. ఈ స్పెషల్ డే రోజు.. మన జీవితాల్లో ఉపాధ్యాయుల ప్రాముఖ్యత గుర్తించి.. వారికి విషెష్ చెప్పడంతో పాటు.. కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి వారికి థ్యాంక్స్ చెప్పవచ్చు. అందుకే టీచర్స్ డే రోజు ప్రతి స్కూల్, కాలేజీల్లో వేడుకలు నిర్వహిస్తారు. వివిధ కార్యక్రమాలు చేసి ఉపాధ్యాయులను సత్కరిస్తారు.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ టీచర్స్ కష్టాన్ని గుర్తిస్తూ.. వారికి మీ ప్రశంసలు తెలియజేయండి. విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువు అతి పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి వారికి థ్యాంక్స్ చెప్పడం, గ్రీటింగ్స్ ఇవ్వడం, గిఫ్ట్ ఇచ్చి విషెష్ చెప్పొచ్చు. అయితే తక్కువ బడ్జెట్లో టీచర్స్‌కి ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్‌లు ఏంటో.. ఎలాంటివి గిఫ్ట్‌లు ఇస్తే టీచర్స్‌కి మంచి ఉపయోగం ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం.
కాఫీ మగ్స్ – కస్టమైజ్డ్ మెమరీ గిఫ్ట్
టీచర్స్ డేకి మీరు టీచర్స్‌కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కాఫీ మగ్స్ ఇవ్వొచ్చు. దానిపై మీరు బెస్ట్ కోట్ రాయడం లేదా టీచర్ ఫోటోను ప్రింట్ చేయించడం వంటివి చేయొచ్చు. మీరు ఇచ్చిన మగ్‌లో వారు కాఫీ తాగినప్పుడల్లా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. దానిని వారు ఉపయోగిస్తున్నప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదంటే కొందరు మగ్స్ని పెన్స్ పెట్టుకునే సాధనంగా కూడా ఉపయోగిస్తారు. ఇది వారి టేబుల్‌పై మంచి లుక్ ఇస్తుంది. కాబట్టి మీరు కస్టమైజ్ చేసినా లేదా ప్రింట్ చేసిన మగ్ టీచర్స్‌కి ఇచ్చేందుకు ప్లాన్ చేసుకోండి. ఇవి బడ్జెట్లోనే అందుబాటులో ఉంటాయి.
ఫోటో కోల్లెజ్ - మధురమైన జ్ఞాపకాలతో
టీచర్స్‌తో మీకున్న ఫోటో జ్ఞాపకాలు లేదా టీచర్స్ ఫోటోలు మీ దగ్గర ఉంటే.. వాటిని కొల్లేజ్ చేసి ఫ్రేమ్‌గా కట్టించి ఇవ్వొచ్చు. ఈ అమూల్యమైన జ్ఞాపకాలు డీప్ ఎమోషన్స్‌తో నిండి ఉంటాయి. ఇది మీరు వారికిచ్చే శాశ్వతమైన, ఎమోషన్స్‌తో కూడిన జ్ఞాపకంగా మారుతుంది. దానిని చూసినప్పుడల్లా మీరు గుర్తురావడం లేదా ఆ ఫోటోలతో వారికున్న జ్ఞాపకాలు రీకాల్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది. ఈ ఫోటోతో పాటు ఓ నోట్ కూడా మీరు కొల్లేజ్లో జత చేసి ఫ్రేమ్ కట్టించి ఇవ్వొచ్చు.
సక్యూలెంట్ - పర్యావరణ హిత
సంక్యూలెంట్ వంటి మొక్కను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇది నీరు లేకున్నా పొడి వాతావరణంలో బతుకుతుంది కాబట్టి.. టేబుల్‌పై పెట్టుకునేందుకు, ఇంట్లో ఉంచుకునేందుకు అనువైనది. పైగా మొక్కలు మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. కాబట్టి మీకు నచ్చిన టీచర్‌కి ఓ లెటర్ రాస్తూ.. ఈ మొక్కను లేదా ఈ తరహా మొక్కలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. సక్యూలెంట్ వంటి మొక్కలు డెస్క్‌పై పెట్టుకునేందుకు వీలుగా ఉంటాయి.
కీచైన్ - సింపుల్, బెస్ట్ మెమోరీలతో
కస్టమైజ్ చేసిన కీచైన్ కూడా మంచి ఫీల్ ఇస్తుంది. దీనిలో టీచర్స్‌కి నచ్చిన బొమ్మలు లేదా పేర్లు కూడా మీరు రాయించవచ్చు. ఇవి కార్కి, ఇంటి కీ లేదా పాఠశాలకు చెందిన కబోర్డ్స్‌కి ఉపయోగించుకుంటారు. ఇది వారి డైలీ రొటీన్లో ఉపయోగపడే వస్తువుగా ఉంటుంది. తక్కువ ఖర్చులోనే అందుబాటులో ఉంటుంది.
పుష్పగుచ్ఛం - బెస్ట్ ఫర్ ఎవర్
(చిత్రం మూలం: Canva)
మీరు చేతితో చేసిన లేదా బయట కొన్న ఫ్లవర్ బొకే అయినా టీచర్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. లేదంటే ఓ సింపుల్ రోజ్ కూడా వారి మూడ్‌ని లైట్ చేస్తుంది. కాబట్టి మీరు టీచర్స్‌కి పుష్పగుచ్చాలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. వైబ్రెంట్ పేపర్స్, ఆకుపచ్చని స్ట్రాలతో దీనిని తయారు చేసుకోవచ్చు.
ఈ గిఫ్ట్స్ సింపుల్‌గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి. కాబట్టి వీటిని మీరు ఉపాధ్యాయుల దినోత్సవం రోజు టీచర్స్‌కి ఇవ్వొచ్చు. ఏ గిఫ్ట్ ఇచ్చినా దానితో పాటు మీరు ఓ చిన్న లెటర్ రాసి ఇస్తే అది మీ టీచర్స్‌కి బెస్ట్ మెమోరీ అవుతుంది.






















