అన్వేషించండి
Advertisement
Teachers Day Wishes : టీచర్స్ డేకి మీ ఫేవరెట్ ఉపాధ్యాయులకు ఇలా విష్ చేసేయండి.. సోషల్ మీడియాలో ఈ కోట్స్ పోస్ట్ చేసేయండి
Teachers Day 2024 : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదిన టీచర్స్ డేని నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీ ఫేవరెట్ టీచర్ని ఈ కోట్స్‌తో విష్ చేయండి.
Teachers Day quotes : ఉపాధ్యాయ దినోత్సవం వచ్చేసింది. ఈ సమయంలో మీ ఫేవరెట్ టీచర్‌కి మీరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పొచ్చు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా టీచర్స్‌కి విష్ చేయొచ్చు. వారి ఫోటోలు షేర్ చేస్తూ.. మంచి కోట్ని జత చేయొచ్చు. లేదంటే ఇప్పుడు మీరు చదువుకుంటున్నట్లయితే ఓ గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి.. టీచర్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. మరి ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఎలా విష్ చేయొచ్చో చూసేయండి.
సోషల్ మీడియాలో షేర్ చేయగలిగే కోట్స్ ఇవే..
- చదవాలనే కోరికను మరింత పెంచి.. చదువును అర్థమయ్యేలా చెప్పిన మీకు హ్యాపీ టీచర్స్ డే. ప్రతి ఒక్కరూ మంచి మార్కులు సంపాదించాలని మీరు చేసిన కృషికి, అంకితభావానికి ధన్యవాదాలు.
- విద్యావేత్తల కంటే ఎన్నో జీవిత సత్యాలు నేర్పిన.. నా జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీవల్ల నేను ఎన్నో నేర్చుకోగలిగాను.
- నాకు ఓ స్నేహితుడిగా.. గురువుగా.. మార్గదర్శిగా.. ప్రతి దారిలో మీరు చెప్పిన ప్రతి విషయం నన్ను ముందుకు నడిపించింది. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు నా లైఫ్‌లో ఉన్నందుకు ధన్యవాదాలు.
- ఈ టీచర్స్ డే రోజు మీకు నా కృతజ్ఞత చెప్పుకోగలుగుతున్నాను. నేను ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి ప్రధానకారణం మీరే. మీకు తెలియకుండానే చాలా విషయాలు మిమ్మల్ని చూస్తూ.. మీ మాటలను అనుసరిస్తూ ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నాను. ఇది మీవల్లే జరిగింది. మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
- చదువురావట్లేదని నా తల్లిదండ్రులు భయపడుతున్న సమయంలో మీరు నాకు ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్తూ.. చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే.
- హ్యాపీ టీచర్స్ డే టు మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్. మీరు కేవలం ఉపాధ్యాయులే కాదు. నా రోల్ మోడల్, ఇన్స్ప్రేషన్, ఫ్రెండ్.
మీలాంటి గొప్ప వ్యక్తి.. ఉన్నత విలువలున్న ఉపాధ్యాయుడు నా లైఫ్‌లో ఉండడం నేను చేసుకున్న పుణ్యంగానే భావిస్తాను. మీ మార్గదర్శకత్వం, ఇచ్చిన మద్ధతుకు ఎప్పటికి కృతజ్ఞుడనే. హ్యాపీ టీచర్స్ డే. - నా జీవితంలో మార్పు ఊహించని మార్పు తెచ్చిన గురువు మీరు. నన్ను సరైన దారిలో ముందుకు నడిపి.. నా తప్పులను సరిదిద్దుకునేలా చేసిన మీకు హ్యాపీ టీచర్స్ డే.
- నేను ఈ స్థాయిలో ఉంటాను అని నా బాల్యంలో అస్సలు ఊహించలేదు సార్. జీవితంలో ఏమి చేయాలో తెలియని సమయంలో మీరు చూపిన మార్గమే నాకు బంగారు భవిష్యత్తుని ఇచ్చింది. మీ మేలు ఎన్నటికి మరువను. హ్యాపీ టీచర్స్ డే.
- పుస్తకాల్లోని సబ్జెక్టులతో పాటు.. బతకడానికి కావాల్సిన ఎన్నో సబ్జెక్ట్‌లను మీరు నాకు నేర్పారు. జీవితం అంటే ఇదేనంటూ కొత్త అర్థం తెలిపారు. దానిని ఎలా సార్థకం చేసుకోవాలో నేర్పినందుకు ఎప్పటికి రుణపడి ఉంటాను. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
Also Read : పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే సత్తా టీచర్స్కే ఉంది.. వారు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion