Lemon Grass: నిమ్మగడ్డితో టీ... తాగితే రక్తపోటు నుంచి ఆందోళన వరకు అన్నీ తగ్గాల్సిందే
లెమన్ గ్రాస్ తో టీ చేసుకుని తాగితే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
నిమ్మగడ్డి సూపర్ మార్కెట్లలో విరివిగానే దొరుకుతుంది. ఇంట్లో కూడా దీన్ని పెంచుకోవచ్చు. లెమన్ గ్రాస్ శరీరానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం. అధికరక్తపోటు ఉన్నవాళ్లు అప్పుడప్పుడు నిమ్మగడ్డి టీ తాగితే మంచిది. రక్తపోటును ఇది నియంత్రిస్తుంది. ఇది తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటికిపోతాయి. అంటే ఇది డిటాక్స్ డ్రింకుగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ టీ చాలా మేలు చేస్తుంది. జీవిక్రియలను మెరుగుపరిచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అజీర్తి వంటి రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. మహిళలు నిమ్మగడ్డి టీని తరచూ తాగడం వల్ల నెలసరులు సమయంలో వచ్చే సమస్యలు రావు. పొట్ట ఉబ్బరాన్ని కూడా ఇందులోని గుణాలు అరికడతాయి. జుట్టుకు కూడా నిమ్మగడ్డి మేలు చేస్తుంది. కుదుళ్లు బలపడి, జుట్టు బాగా ఎదుగుతుంది. మానిసిక ఆరోగ్యానికి కూడా నిమ్మగడ్డి ఉత్తమమైన ఎంపిక. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జయిటీ వంటివి రాకుండా కాపాడుతుంది. నిద్ర కూడా బాగా పట్టేందుకు సహకరిస్తుంది. కాబట్టి నిమ్మగడ్డి టీని అప్పుడప్పుడు తాగడానికి ప్రయత్నించండి. రోజూ తాగినా మంచిదే. ఇది ఔషధ టీల జాబితాలోకే వస్తుంది. గ్రీన్ టీలాగే, లెమన్ గ్రాస్ వల్ల కూడా చాలా ఆరోగ్యం కలుగుతుంది.
నిమ్మగడ్డి టీ ఎలా చేస్తారంటే...
కావాల్సిన పదార్థాలు
లెగన్ గ్రాస్ కాడల తురుము - ఒక కప్పు
నీళ్లు - రెండు కప్పులు
తేనె - అయిదు స్పూనులు
తయారు చేసే విధానం
స్టవ్ పై టీ గిన్నె పెట్టి నీళ్లు వేసి బాగా మరిగించాలి. అవి బుడగలు వచ్చేలా కాగాక నిమ్మగడ్డి తురుమును వేసి మళ్లీ మరిగించాలి. కాసేపు మరిగాక అందులోని తురుమును వడకట్టేయాలి. ఆ నీటిని మళ్లీ మరిగించాలి. ఒక అయిదు నిమిషాల పాటూ మరిగించాక గిన్నె దించేయాలి. కాస్త వేడి తగ్గాక తేనే కలపాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు తేనెను కలపకూడదు. అందులో ఉన్న గుణాలన్నీ పోతాయి. తేనె వద్దనుకుంటే బెల్లం కలుపుకోవచ్చు. చక్కెరను దూరం పెట్టడం ఉత్తమం. బెల్లం లేదా తేనె కలుపుకుని టీని తాగేయడమే.
Also read: ఇంట్లో ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, సమస్యలు తొలగిపోతాయిట
Also read: తెల్లజుట్టు వల్ల చిన్నప్పుడు అవమానాలు పడ్డ అమ్మాయి... ఇప్పుడు అదే జుట్టు వల్ల సెన్సేషన్‌గా మారింది