Positive Energy: ఇంట్లో ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, సమస్యలు తొలగిపోతాయిట
ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంట్లో చేసే చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలను అందిస్తాయి.
ఇంట్లో తరచూ గొడవలు అవ్వడం, ఆర్ధిక నష్టాలు, ఇంట్లో ఏదో ఒక అనర్థం కలగడం జరుగుతోందా? ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఒకేచోట బ్లాక్ అవ్వడం ఇలా జరుగుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవాలంటే బ్లాక్ అయిన సానుకూల శక్తిని తెరవాల్సిందే. పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో ప్రసరించేలా చేయాలంటే చిన్న చిన్న మార్పులు చేయాల్సిందే. ఈ మార్పుల వల్ల బ్లాక్ అయిన పాజిటివ్ ఎనర్జీ విడుదలై ఇల్లంతా ప్రసరిస్తుంది. మీ జీవితంతో మంచి మార్పులు తీసుకొస్తుంది.
1. తాజా గాలి
సానుకూల శక్తిని స్వాగతించడానికి, ప్రతికూల శక్తిని ఇంట్లో నుంచి తరమడానికి మొదటగా చేయాల్సిన పని ఇంట్లోకి గాలి వీచేలా చేయాలి. కిటికీలు, తలుపులు తీసి పెట్టాలి. పాత గాలిని బయటికి పంపి స్వచ్ఛమైన గాలిని లోపలికి స్వాగతించాలి. ఇలా చేసినప్పుడు మీ దుప్పట్లు, దిండ్లను కూడా ఒకసారి కదిలించండి.
2. విరిగిన వస్తువులు పడేయండి
ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఇటువంటివి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఇది ఇంట్లోంచి బయటపడేశాక మీకు ఆ సానుకూల మార్పు కనిపిస్తుంది.
3. ధూపం వేయండి
మల్లె, సంపెంగ వాసనలు వేసే అగరబత్తీలు ఇళ్లంతా మీ చేతులతో ధూపం వేయండి. ఇది ఇంట్లో ప్రశాంతతను కలిగిస్తుంది.
4. సేజ్ మొక్క
సువాసనలు వీచే ఎండిన సేజ్ మొక్కలు ఆన్ లైన్లో లభిస్తాయి. అలాంటి ఆ మొక్కలను ఇంట్లో కాల్చితే చాలా మంచిది. ఇవి చెడుశక్తిని దూరం చేస్తాయి. వాటిని వెలిగించాక మంటను ఆర్పివేయాలి. అందులోంచి వస్తున్న పొగను ఇంటి ముందు ద్వారం వద్ద ఉంచాలి. ఇలా చేస్తున్నప్పుడు మీ ఇంటికి ఏం మంచి కోరుకుంటున్నారో ఒకసారి తలచుకోండి.
5. రోజ్ క్వార్ట్జ్
రోజ్ క్వార్ట్జ్, బ్లాక్ టొరలైన్ వంటి స్పటికాలను కొని ఇంట్లో ఉంచండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర్లో పెట్టండి. వాటిల్లో మొదటిది సానుకూల భావాలను కలిగిస్తుంది, రెండో ప్రతికూలమైన శక్తిని పారదోలుతుంది.
6. ఉప్పుతో...
మీ ఇంటి అన్ని గదుల్లోని మూలల్లో కొద్దిగా ఉప్పువేయాలి. అలా 48 గంటల పాటు వదిలేయాలి. ఉప్పు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పీల్చేసుకుంటుంది. తరువాత ఆ ఉప్పుని తీసి బయటపడేయండి.
7. గుండ్రని వస్తువులు
ఫెంవగ్ షుయ్ ప్రకారం ఇంట్లో పదునైన చివర్లు కలిగిన ఫర్నిచర్ ఉండకూడదు. గుండ్రని కుండీలు, రౌండ్ టేబుళ్లు, ఓవల్ ఆకారంలోని వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపండి. అవి సానుకూల శక్తిని పెంచుతాయి.
8. బకెట్ నీళ్లు
ప్రతికూల శక్తిని ఇంట్లో నుంచి పంపించేసి, సానుకూల శక్తిని మేల్కోలపాలంటే ఒక బకెట్ నీళ్లలో ఉప్పు, తెల్ల వెనిగర్, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో అన్ని డోర్ హ్యాండిల్స్, నాబ్‌లు, కిటికీలు తుడవాలి. అన్ని ద్వారాల వద్ద కాస్త ఉప్పు పోసి డోర్‌మ్యాట్‌తో కప్పాలి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరంగా ఉంచుతుంది.
Also read: తెల్లజుట్టు వల్ల చిన్నప్పుడు అవమానాలు పడ్డ అమ్మాయి... ఇప్పుడు అదే జుట్టు వల్ల సెన్సేషన్‌గా మారింది