అన్వేషించండి

Bagara Rice Chicken Curry Recipes : తెలంగాణ స్టైల్ బగారా రైస్.. ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ.. ఈ కాంబినేషన్​ సూపర్​ హిట్​ అంతే

Sunday Special Recipes : తెలంగాణలో బగారా రైస్, కోడి కూర చాలా ఫేమస్. కాస్త టేస్టీగా తినాలనుకున్నప్పుడు చాలామంది దీనిని తయారు చేసుకుంటారు. దీనిలోకి ఆంధ్ర స్టైల్ చికెన్​ కర్రీ బెస్ట్ కాంబినేషన్.

Telangana Style Bagara Rice and Andhra Style Chicken Curry : కొన్ని కాంబినేషన్​లు ట్రై చేస్తేనే వాటి రుచి అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. అలాంటి వాటిలో తెలంగాణ స్టైల్ బగారా రైస్, ఆంధ్రా చికెన్ కర్రీ ఒకటి. అయితే ఈ చికెన్​ కర్రీని మనం ఇంట్లో చేసుకునే మసాలాతో తయారు చేసుకుంటాం. కాబట్టి ఈ కర్రీ మీకు మంచి రుచిని ఇస్తుంది. ఈ స్టైల్​ కర్రీని మీరు చపాతీలలో కూడా తీసుకోవచ్చు. అయితే ఈ టేస్టీ చికెన్​ మసాలాను ఏ విధంగా తయారు చేయాలో.. బగారా రైస్​లో ఏమేమి వేస్తే రుచి రెట్టింపు అవుతుందో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

బాస్మతి రైస్ - 2 కప్పులు

నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు

దాల్చిన చెక్క - అంగుళం

లవంగాలు - 6

షాజీరా - 1 టేబుల్ స్పూన్

స్టార్ పువ్వు - 2

బిర్యానీ ఆకులు - 2

ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు

పచ్చిమిర్చి - 2

పుదీనా కట్ట - 1 

కొత్తిమీర - 1 కట్ట

ఉప్పు - రుచికి తగినంత 

నీరు - రెండున్నర కప్పులు 

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

చికెన్ మెరినేషన్ కోసం.. 

చికెన్ - 1 కిలో

ఉప్పు - రుచికి తగినంత

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

పసుపు - అర టేబుల్ స్పూన్

చికెన్ మసాలా కోసం..

ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు

జీలకర్ర - 1 టేబుల్ స్పూన్

గసగసాలు - 2 టేబుల్ స్పూన్లు

యాలకులు - 5

లవంగాలు - 5

మిరియాలు - అర టేబుల్ స్పూన్

దాల్చిన చెక్క - 1 అంగుళం

ఎండుకొబ్బరి పొడి - అర కప్పు

కూర కోసం.. 

నూనె - పావు కప్పు

కరివేపాకు - 2 రెబ్బలు

ఉల్లిపాయలు - 2

పచ్చిమిర్చి - 2

అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్

టోమాటోలు - 2

ఉప్పు- రుచికి తగినంత

కారం - రుచికి సరిపడేంత 

కొత్తిమీర - గార్నిష్ కోసం

తయారీ విధానం

వంటను ప్రారంభించే ముందు చికెన్​ను, మసాలాలను సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ చికెన్​ను మెరినేట్ చేయాలి. చికెన్​ను బాగా కడిగి.. దానిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ముక్కకి మసాలా పట్టేలా బాగా కలపండి. దానిలో కాస్త నిమ్మరసం వేసి బాగా కలిపి ఓ గంట పక్కన పెట్టండి. బియ్యాన్ని ఓ గిన్నెలో తీసుకుని కడిగి నానబెట్టాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసుకుని సన్నని మంటపై వేయించుకోవాలి. మసాలా నుంచి మంచి వాసన వస్తుంది. ఆ అరోమా వచ్చినప్పుడు దానిలో కొబ్బరి పొడి, గసగసాలు వేసి వేయించుకోవాలి. ఎండుకొబ్బరి పొడిని కాస్త రంగు మారినప్పుడు వాటిని పక్క పెట్టుకోవాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పౌడర్​గా లేదా పేస్ట్​గా చేసుకోవచ్చు. 

స్టౌవ్ వెలిగించి దానిపై రైస్ కుక్కర్ పెట్టండి. దానిలో మీరు నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు. వేడి అయిన నెయ్యిలో అనాస పువ్వులు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, యాలకులు వేసి వేయించుకోవాలి. దానిలో ఉల్లిపాయలు వేసి.. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దానిలో బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటిని ఫ్రై చేసుకోవాలి. దానిలో నానబెట్టిన బియ్యం వేసి.. ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. దానిలో బియ్యం ఉడికేందుకు సరిపడేంత నీటిని వేసుకుని.. కొత్తిమీర, పుదీనా వేసి దానిని కుక్కర్​పై పొట్టండి. రెండు విజిల్స్ వేయించుకుని స్టౌవ్ ఆపేయాలి. అంతే వేడి వేడి బగారా రైస్ రెడీ. 

చికెన్ కర్రీ కోసం.. 

స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. దానిలో నూనె వేసుకోవాలి. అది వేడి అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించండి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. వెయించుకోవాలి. దానిలో చికెన్ వేసి.. బాగా కలపండి. అవి కొద్దిగా ఉడికిన తర్వాత దానిలో టోమాటో ముక్కలు వేసి బాగా కలపండి. చికెన్​లో నీరు, టోమాటోలలోని నీటితో చికెన్​ను ఉడకనివ్వాలి. దానిలో కారం, ఉప్పు వేసి.. చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. కాసేపు మగ్గించి దానిలో నీరు పోసి ఉడికించాలి. మరో అయిదు నిమిషాలు చికెన్​ను ఉడికించుకోవాలి. అది చిక్కటి గ్రేవిని ఇస్తుంది. చివరిగా కొత్తిమీర వేసి స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ రెడీ. అంతే ఈ బగారా రైస్​లో, చికెన్​ వేసుకుని హాయిగా లాగించేసుకోవచ్చు. 

Also Read : రంజాన్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ.. టేస్టీగా అరోమాతో రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
Embed widget