అన్వేషించండి

తీపి పదార్థాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు, చెబుతున్న కొత్త అధ్యయనం

కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య తీపి పదార్థాలతో పెరుగుతుంది.

రోజూ కూల్ డ్రింకులు తాగేవారు, చక్కెర కలిపిన పండ్ల రసాలు తాగేవారు, స్వీట్లు, కేకులు, బిస్కెట్లు తినే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే వీరందరికీ తెలియని విషయం ఏమిటంటే వారు తినే ఈ పదార్థాలలో చక్కెర శాతం చాలా ఎక్కువ. ఇలా చక్కెర కలిపిన పదార్థాలు అధికంగా తింటే దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్ల ఏర్పడే సమస్య ఎక్కువవుతుంది. చక్కెర పదార్థాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతాయని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. కాబట్టి చక్కెర నిండిన పదార్థాలు తినడం తగ్గించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత అధికంగా ఇలాంటి ఆహారాలను తినేందుకు ఇష్టపడతారు. వీరు దీర్ఘకాలంగా ఇలాంటి ఆహారాలను తింటే తక్కువ వయసులోనే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి తీపి పదార్థాలు తినే శాతాన్ని తగ్గించుకుంటే ఎంతో మంచిది.

కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటిలో ఇలా తీపి పదార్థాలు అధికంగా తినడం కూడా ఒకటి. అలాగే ఒంట్లో నీటి శాతం తగ్గినా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా కిడ్నీలో రాళ్ల సమస్య బారిన త్వరగా పడతారు. గౌట్ వంటి ఆరోగ్య సమస్యల తో ఇబ్బంది పడేవారు, పేగు పూత వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వీరంతా కూడా చక్కెర కలిపిన ఆహారాలను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యను మరింతగా పెంచుకున్న వారు అవుతారు. కాబట్టి సాధారణ వ్యక్తులే కాదు ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా చక్కెరతో నిండిన ఆహారాలను తగ్గించడం చాలా మంచిది.

ఈ అధ్యయనాన్ని యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో భాగంగా చేశారు. ఈ సర్వేలో వ్యక్తుల జీవన శైలిని, వారికున్న ఆరోగ్య సమస్యల వివరాలను సేకరించారు. దాన్ని బట్టి విశ్లేషించారు. ఎవరైతే తమ రోజువారి ఆహార కేలరీలో ఐదు శాతం కన్నా తక్కువ చక్కెర కలిపిన పదార్థాలను తీసుకుంటారో... వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వారు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇక ఎవరైతే తమ రోజువారి ఆహార కేలరీల్లో 25% కన్నా ఎక్కువ చక్కెర పదార్థాలనే తీసుకుంటారో... వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం 88% అధికంగా ఉంది. కాబట్టి చక్కెర పదార్థాలను దూరంగా పెట్టడం ఎంతో మంచిది. పంచదార కారణంగానే మూత్రంలో క్యాల్షియం, ఆక్సలైట్ వంటి వాటి పరిమాణాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ మూత్రంలో పోగు పడిపోయి చిన్న చిన్న రాళ్ళగా మారుతాయి. చివరికి కిడ్నీలో, మూత్ర నాళంలో స్థిరపడిపోయి అక్కడ తమ పరిమాణాన్ని పెంచుకుంటాయి. ఎక్కువ పంచదారను తినడం వల్ల మూత్రంలో ఆమ్లత్వం కూడా పెరుగుతుంది. ఇది కూడా రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే చక్కెర నిండిన పదార్థాలను తినడం చాలా వరకు తగ్గించాలి.

Also read: మొక్కజొన్న పీచును పడేస్తున్నారా? ఇలా టీ చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Hair Mask To Boost Hair Growth : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
Leafy Greens Benefits : రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
Ambati Arjun: బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Embed widget