అన్వేషించండి

Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే

Tasty Chicken Fry : కొందరికి సండే అంటే చికెన్, చికెన్ అంటే సండే. అలాంటి సండేని టేస్టీ చికిన్ పకోడితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే.. ఇక్కడ మంచి రెసిపీ ఉంది.

Sunday Special Chicken Pakodi Recipe : ఆదివారం ఇంట్లో టేస్టీ ఫుడ్ ఉండాల్సిందే. వారమంతా వివిధ పనులతో బిజీగా ఉండే పిల్లలు, పెద్దలు ఆదివారం పూట ఇంట్లో మంచి టేస్టీ ఫుడ్ పెట్టుకుని సినిమాలు చూస్తుంటారు. అయితే ఇంట్లోని ఆడవారికి సెలవు ఇచ్చి మీరేమైనా టేస్టీ రెసిపీ చేయాలన్నా.. ఇంటిల్లిపాదికి తమ చేతులతో వంట చేసి తృప్తిగా పెట్టాలనుకునే ఆడవారైనా ముందుగా వెళ్లేది చికెన్ దగ్గరికే. ఎందుకంటే సండే రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు అనే బ్యాచ్​నే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే మీ సండేని రుచిలో, వాసనలో పీక్​ స్టేజ్​కి తీసుకెళ్లగలిగే చికెన్ పకోడి రెసిపీ ఇక్కడ ఉంది. దీనిని తయారు చేయడం కూడా చాలా అంటే చాలా సులభం. పైగా దీనిని తయారు చేసుకునేందుకు గరం మసాలాను కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇది మీ పకోడిని టేస్టీగా మార్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ పకోడిని ఎలా తయారు చేయాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

గరం మసాలా కోసం కావాల్సిన పదార్థాలు

ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు

దాల్చిన చెక్క - 2 అంగుళాలు

లవంగాలు - 6 

యాలకులు - 4

జీలకర్ర - అర టీస్పీన్

ఈ గరం మసాల దినుసలను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. గరం మసాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మీ వంటలకు రుచి మరింత పెరుగుతుంది. ఇది మీ డిష్​కు మంచి టేస్ట్​ను అందిస్తుంది.

చికెన్ ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు

చికెన్ - అరకేజి (బోన్​లెస్ చికెన్)

నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్

పసుపు - అర టీస్పూన్

కారం - 1 టేబుల్ స్పూన్

గరం మసాలా - ఒకటిన్నర టీ స్పూన్

ఉల్లిపాయ - 1 పెద్దది (చిన్న చిన్నముక్కలుగా కోసి పెట్టుకోవాలి)

అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

నెయ్యి - 1 టేబుల్ స్పూన్

సాల్ట్ - తగినంత

పెరుగు - 2 టేబుల్ స్పూన్స్

మొక్కజొన్న పిండి - 3 టేబుల్ స్పూన్స్

నూనె - డీప్​ ఫ్రై చేయడానికి తగినంత

తయారీ విధానం

ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని దానిలో చికెన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, సాల్ట్, మిరియాల పొడి, పెరుగు, నెయ్యి, కరివేపాకు వేసి బాగా కలపాలి. పొడులు అన్ని చికెన్​కి బాగా  పట్టేలా చేతితో కలపాలి. దీనిలో కార్న్ ఫ్లోర్ వేసి.. కలపాలి. ఇది చికెన్​కి మంచి లేయర్ ఇస్తుంది. అంతేకాకుండా క్రిస్పీగా చేస్తుంది. మిశ్రమం కాస్త డ్రైగా ఉంటే.. కొంచె నీళ్లు చల్లుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీరు ఓ గంట మేరినేట్ చేసుకోవాలి. 

ఫ్రై చేసే విధానం 

ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. అది వేడి అయ్యాక దానిలో చికెన్ వేసి.. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. మంట ఎప్పుడూ మధ్యమంగానే ఉంచుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత బయటకు తీయాలి. ఈ వేడి వేడి చికెన్ పకోడిని ఫ్రెష్ నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే మీ సండేకి ఇంకేమి కావాలి చెప్పండి. 

Also Read : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget