అన్వేషించండి

Sweets Damage : స్వీట్స్ తింటే పళ్లు పసుపు అవుతాయా? చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందంటే..

Hidden Effects of Sugar : స్వీట్స్ ఎక్కువ తింటే పళ్లు పసుపు రంగులోకి మారడంతో పాటు ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయి. మధుమేహంతో పాటు వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తీపి పదార్థాల వల్ల నోటిలోని బ్యాక్టీరియా ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది.
  • ఈ ఆమ్లాలు పళ్ల ఎనామెల్‌ను దెబ్బతీసి, పళ్లు రంగు మారడానికి కారణమవుతాయి.
  • అధిక స్వీట్స్‌ వల్ల మధుమేహంతో పాటు ఊబకాయం, గుండె జబ్బులు పెరుగుతాయి.
  • తీపిని మితంగా తీసుకోవడం, క్రమం తప్పకుండా బ్రష్ చేయడం మంచిది.

Sugary Foods Damage Your Teeth and More : స్వీట్స్ తింటే పళ్లు పుచ్చుపోతాయి అంటారు. అందుకే వీటిని తినడం వల్ల పళ్లు పసుపు రంగులోకి మారిపోతాయా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్వీట్స్ తినడం వల్ల పళ్లు నేరుగా పసుపు రంగులోకి మారవు. కానీ అవి పళ్ల రంగు మార్చే ప్రభావం చూపించడంతో పాటు.. అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయని చెప్తున్నారు. మరి స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల మధుమేహం కాకుండా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. 

పళ్లపై స్వీట్స్ ప్రభావం.. 

చాక్లెట్లు, కుకీలు లేదా కూల్ డ్రింక్స్ వంటి తీపి పదార్థాలు తీసుకున్నప్పుడు.. నోటిలోని బ్యాక్టీరియా ఈ చక్కెరలను విచ్ఛిన్నం చేస్తుంది. ఆ సమయంలో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. కోల్గేట్ నివేదిక ప్రకారం.. ఈ ఆమ్లం దంతాల బయటి పొర అయిన ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. క్రమంగా ఎనామెల్ బలహీనపడి.. దంతాలపై పాచి పేరుకుపోతుంది. దీనివల్ల అవి పసుపు రంగులోకి లేదా రంగు మారినట్లు కనిపిస్తాయి. ఈ ప్రక్రియ చివరికి దంత క్షయానికి దారితీస్తుంది. బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాలు ఎనామెల్‌లో చిన్న రంధ్రాలను సృష్టిస్తాయి. ఇవి కాలక్రమేణా పెద్దవి అవుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే.. ఈ ఇన్ఫెక్షన్ దంతాల లోపలి పొరకు వ్యాపించి.. నొప్పి, ఇన్ఫెక్షన్, దంతాలు ఊడిపోవడానికి కూడా కారణమవుతాయి.

అయితే శరీరం ఈ నష్టంలో కొంత భాగాన్ని స్వయంగా మరమ్మత్తు చేసుకుంటుంది. లాలాజలంలోని కాల్షియం, ఫాస్ఫేట్ వంటి ఖనిజాలు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ ప్రక్రియను రీమినరలైజేషన్ అంటారు. అయితే రోజంతా ఎక్కువ మోతాదులో స్వీట్స్ తీసుకుంటే.. ఈ ఇబ్బంది రెట్టింపు అవుతుంది. అలాగే నోరు పొడిగా ఉండడం వల్ల కూడా మరింత నష్టం జరుగుతుంది. 

మధుమేహం మాత్రమే కాదు..

స్వీట్స్ ప్రభావం కేవలం దంతాలకే పరిమితం కాదు. ఇది మధుమేహాన్ని పెంచుతుంది. అంతేకాకుండా శరీరంపై వివిధ ప్రభావాలు చూపిస్తుంది. అధిక మొత్తంలో స్వీట్స్ తింటే ఊబకాయం పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం రెట్టింపు అవుతుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసి.. చర్మం వదులుగా, కాంతిహీనంగా కనిపించేలా చేస్తుంది. స్వీట్స్ తినడం, స్వీట్ డ్రింక్స్ తాగడం వల్ల ఈ ప్రమాదాలు మరింత పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు మొదలై తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తాయి. 

నివారణ చర్యలు

పళ్లను కాపాడుకోవడంతో పాటు.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకునేందుకు.. షుగర్స్ తీసుకోవడం కంట్రోల్ చేయాలి. రోజంతా కాకుండా భోజనంతో పాటు తీపి పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. చక్కెర లేని చూయింగ్ గమ్ తీసుకోవచ్చు. పుష్కలంగా నీరు తాగడం, క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం వంటివన్నీ ఆరోగ్యకరమైన దంతాలను కాపాడుకోవడానికి సహాయపడతాయి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు షుగర్స్ పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కానీ మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget