High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

ఒంట్లో చేరే అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం.

FOLLOW US: 

కొలెస్ట్రాల్ శరీరంలో చేరడం ప్రారంభం అయ్యాక ఒళ్లు పెరిగేదాకా అది ఒంట్లో చేరినట్టు తెలియదు. నెలల గడిచేకొద్దీ పొట్టు చుట్టు కొవ్వు పేరుకుపోతుంది, పిరుదులు, భుజాలు లావుగా మారతాయి. అంతవరకు పట్టించుకోకుండా వదిలేసే కన్నా కాస్త బరువు పెరిగినట్టు అనిపించినా వెంటనే కొలెస్ట్రాల్ కరిగించే ఆహారాన్ని తినడం, వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాలి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్త జీవనశైలి వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు భారీగా పెరుగుతాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల  గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాదకరమైన రోగాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ ను కరిగించాల్సిన అవసరం ఉంది. 

దీనితో సాధ్యం
కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుంటోందన్న అనుమానం వచ్చినా, లేక పేరుకుపోకుండా ముందస్తు జాగ్రత్త పాటించాలన్న క్యారెట్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. రోజుకో క్యారెట్ ఉదయం, సాయంత్రం తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో క్యారెట్ ముందుంటుంది. మొక్కల ఆధారికత ఆహారమైన క్యారెట్లో ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. ఇందులో బీటా కెరాటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా లభిస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధుల నుంచి కాపాడడంలో ముందుంటుంది. 

న్యూట్రియంట్స్ స్టేట్స్ జర్నల్ లో ప్రచురించిన ఇక నివేదిక ప్రకారం క్యారెట్లో కరగని, కరిగే రెండు రకాల ఫైబర్ ఉంటుంది. ఇవి రెండూ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇదొక్కటే కాదు రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తాయి. మీ ఆహారంలో క్యారెట్‌లను చేర్చుకోవడానికి ఇక్కడ సులభమైన మార్గాలు ఉన్నాయి.

క్యారెట్ జ్యూస్
క్యారెట్ ను ముక్కలుగా చేసి చిన్న ముక్క అల్లం, ఉప్పు వేసి నీళ్లు వేసి మెత్తగా పేస్టుగా చేయాలి. అందులో మరిన్ని నీళ్లు కలిపి మళ్లీ బ్లెండ్ చేయాలి. గ్లాసులో వడకట్టి రెండు స్పూనుల నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, ఉప్పు కలిపి జ్యూసును తాగాలి. ఇలా ప్రతి రెండు రోజుకోసారి తాగితే చాలా మంచిది.  

క్యారెట్లను నిలువుగా ముక్కలు చేసుకోవాలి. అవి పట్టుకుని తినడానికి వీలుగా స్టిక్స్ లా ఉండాలి. ఒక గిన్నెలో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, కారప్పొడి కలిపి ఉంచాలి. అందులో క్యారెట్ ముక్కలను వేసి వాటికి ఆ మిశ్రమం పట్టేలా చూడాలి. వాటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. పదినిమిషాల తరువాత బయటికి తీసి పెరుగులో డిప్ చేసుకుని తింటే చాలా టేస్టగా ఉంటుంది. నేరుగా క్యారెట్ తినలేని వారు ఇలా చేయవచ్చు. 

Also read: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Also read: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Published at : 19 May 2022 01:20 PM (IST) Tags: High cholesterol Carrots Benefits Healthy vegetables High cholesterol Melt high cholesterol burning

సంబంధిత కథనాలు

Wife Throws Boiling Water: భర్త కలలోకి మరో మహిళ, జననాంగాలపై మరిగిన నీళ్లుపోసిన భార్య!

Wife Throws Boiling Water: భర్త కలలోకి మరో మహిళ, జననాంగాలపై మరిగిన నీళ్లుపోసిన భార్య!

Cat Owners Benefits: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Cat Owners Benefits: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Virginia Lottery: కలలోకి వచ్చిన నెంబర్లతో లాటరీ టికెట్ కొన్నాడు, కోటీశ్వరుడయ్యాడు!

Virginia Lottery: కలలోకి వచ్చిన నెంబర్లతో లాటరీ టికెట్ కొన్నాడు, కోటీశ్వరుడయ్యాడు!

Wake up late: లేటుగా నిద్రలేస్తే ఇన్ని రోగాలా? త్వరగా నిద్రపోండి బాసూ!

Wake up late: లేటుగా నిద్రలేస్తే ఇన్ని రోగాలా? త్వరగా నిద్రపోండి బాసూ!

Fish Fry: చేపల వేపుడు ఇలా చేస్తే అదిరిపోవడం ఖాయం

Fish Fry: చేపల వేపుడు ఇలా చేస్తే అదిరిపోవడం ఖాయం

టాప్ స్టోరీస్

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు