అన్వేషించండి

Sleeping Positions for Back Pain: నడుము నొప్పి వేధిస్తోందా? అయితే ఈ పొజిషన్​లో పడుకోండి

Best Sleeping Position for Back Pain: నేటికాలంలో నడుమునొప్పి అనేది సాధారణమైంది. నడుము నొప్పికి కారణాలేన్నో ఉన్నాయి. ఎలాంటి పొజిషన్లో పడుకుంటే నడుమునొప్పి తగ్గుతుందో తెలుసుకుందాం. 

Health Care Tips in Telugu: ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో 30ఏళ్లుదాటిన వారు కూడా ఉండటం గమనార్హం. అయితే వీరి జీవన అలవాట్లు, వారు చేస్తున్న ఉద్యోగం, నిరంతరం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం..ఇవన్నీ కూడా ఈ సమస్యకు కారణం అవుతున్నాయని చెప్పవచ్చు.శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర అనేది చాలా అవసరం. వెన్నునొప్పి ఉంటే మంచి నిద్ర అసాధ్యం. రాత్రిళ్లు మెల్కొనవల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే మీ స్లీపింగ్ పొజిషన్ లో కొన్ని మార్పులు చేసినట్లయితే మీ నడుముపై ఒత్తిడిని తగ్గించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. 

పక్కమీద పడుకుంటే:

మీ ఒక్క సైడు అంటే (పక్కమీద పడుకోవడం) మీ కాళ్లను మీ ఛాతీ వైపు కొద్దిగా పైకి లాగండి. మీ కాళ్ల మధ్య ఒక దిండును ఉంచుకోండి.  మీ మోకాళ్ళను వంచడం.. మీ కాళ్ళ మధ్య ఒక దిండు ఉంచినట్లయితే..మీ వెన్నెముక, కటి, తుంటిని సమలేఖనం చేయడంలో సహాయపడుతుంది. ఈ స్థానం మీ వెన్నెముకపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు కావాలనుకుంటే పొడవు బాడీ దిండును కూడా ఉపయోగించుకోవచ్చు. 

వెల్లకిలా పడుకోవడం:

మీరు వెల్లకిలా పడుకుంటే మీ మోకాళ్ల క్రింద ఒక దిండును ఉంచండి. ఇది మీ వెనక కండరాలను రిలాక్స్ గా ఉంచుతుంది. దిగువ వీపు వక్రతను సరిగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది. మీరు ఇంకా రిలాక్స్ గా పడుకోవాలనుకుంటే మీ నడుము కింద చిన్నగా చుట్టిన టవల్ ను ఉంచండి. ఒక దిండుతో మీ మెడకు సపోర్టు ఉంచండి. దిండు మీ మెడను మీ ఛాతీ, వీపుపై సమానంగా ఉంచాలి. 

బోర్లా పడుకుంటే:

చాలా తక్కువ మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఎందుకంటే బోర్లా పడుకుంటే మన బరువంతా పొట్టపై పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. అయితే వెన్నునొప్పితో బాధపడేవారు బోర్లా పడుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎలాగంటే మీ  బోర్లా పడుకున్నప్పుడు వెనక భాగంలో కాస్త కష్టంగా ఉంటుంది. మీ తుంటి, దిగువ పొట్ట కింద ఒక దిండును ఉంచండి. ఇది వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మీ వెనక భాగంలో ఎక్కువగా ఒత్తిడి లేనట్లయితే మీ తల కింద ఒక దిండును ఉంచండి. 

పొట్టను పైకి ఉంచి పడుకోవడం:

పొట్టను పైకి ఉంచి పడుకునేవారు చాలా అదృష్టవంతులు. అది మగవాళ్లైనా కావచ్చు..ఆడవాళ్లైనా కావచ్చు. ఎవరైనాసరే ఇలా పడుకోవడం మంచి పొజిషన్.దీని వల్ల వెన్నుముక సరిగ్గా ఉంటుంది. ఈవిధంగా పడుకుంటే మెడ వెనక భాగం దగ్గర కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. అక్కడి కండరాలు ఇబ్బంది పడతాయి. అయినప్పటికీ ఇది చర్మానికి మేలు చేస్తుంది. ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి పొజిషన్ అని చెప్పవచ్చు. ఈ పొజిషన్ వల్ల ఉన్న సమస్య ఏంటంటే గురక. 

ఎడమ వైపు తిరిగి పడుకోవడం:

చాలా మంది ఎడమవైపు తిరిగి పడుకుంటారు. ఇలా పడుకున్నప్పుడు తిన్న ఆహారం చక్కగా అరిగిపోతుంది. పొట్టలో యాసిడ్స్, గ్యాస్ సమస్యలు రావు. అయితే ఇలా పడుకునేవారికి ఎడమ భుజంలో నొప్పి వస్తుంది. ఎడమ కాలుపై బరువు పడుతుంది. కొద్ది సేపు ఇలా పడుకుంటే వెన్ను నొప్పికి కాస్త రిలాక్స్ గా ఉంటుంది. కానీ రాత్రంతా ఇలా పడుకోవడం ఏమాత్రం మంచిది కాదు. 

 పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Pushpa 2: షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
Embed widget