Snoring App: గురక ఇబ్బంది పెడుతోందా? ఈ యాప్‌ను ఉపయోగించి చూడండి
నిద్ర సరిగా లేకపోతే రకరకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఒళ్లు నొప్పుల నుంచి గుండె జబ్బుల వరకు, చిన్న తలనొప్పి నుంచి పక్షవాతం వరకు ఏదైనా దీర్ఘకాలంలో నిద్ర సరిగా లేకపోతే రావచ్చు.
తిండి, విసర్జన, నిద్ర సరిగా ఉన్నంత కాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. తగినంత నిద్ర అంత ముఖ్యమైంది. కానీ నిద్రా భంగానికి చాలా మందిలో కనిపించే ప్రధాన కారణాలలో ఒకటి గురక. అది పక్కవారి గురక కావచ్చు, మన సొంత గురకైనా కావచ్చు. కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ గురక సమస్యను నియంత్రించడం సాధ్యమే అని నిపుణులు అంటున్నారు.
గురకను రికార్డు చేసేందుకు ప్రత్యేక యాప్
ఇప్పుడు మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోడానికి ఎన్నో రకాల యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. స్నోర్ ల్యాబ్ కూడా నిద్రలో గురకను రికార్డ్ చేసే ఒక ఆప్. ఇది మీ గురకను రాత్రంతా రికార్డ్ చేస్తుంది. అంతేకాదు ఎలాంటి మార్పులతో గురకను నియంత్రించవచ్చో సూచిస్తుంది. కాబట్టి స్నోర్ లాబ్ ను డౌన్లోడ్ చేసుకుని సూచనలు పొందడం వల్ల లాభం ఉండొచ్చు.
మీకు వీపుపై వెల్లకిలా పడుకుని నిద్ర పోయే అలవాటు ఉంటే తప్పకుండా గురక సమస్య ఉండొచ్చు. అందుకే పక్కకు తిరిగి పడుకునే అలవాటు చేసుకుంటే ఆ తీవ్రత తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు వెల్లకిలా పడుకొని నిద్ర పోవడాన్ని నివారించేందుకు ప్రయత్నించండి.
నాలుక, దవడలు, శ్వాస మార్గాలలోని కండరాలను బలోపేతం చేసినా కూడా గురక తగ్గుతుంది. స్నోర్ జిమ్ ఆప్ లో మీకు దీనికి ఉపకరించే వర్కవుట్ విధానాలను వివరించారు. ఈ రకమైన వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అందువల్ల గురక తగ్గి నిద్రాభంగం కాదు.
లావుగా ఉన్నవారిలో గురక సమస్య ఎక్కువ. కొంత బరువు తగ్గడం ద్వార కూడా గురకకు చెక్ పెట్టవచ్చు. కనుక బరువు ఎక్కువగా ఉన్నపుడు కచ్చితంగా బరువు తగ్గడం అవసరం. ఇది కేవలం గురక కోసం మాత్రమే కాదు శరీర బరువు ఓవరాల్ హెల్త్ మీద కూడా ప్రభావం చూపుతుంది.
అంతేకాదు పొగతాగడం, మద్యపానం అలవాట్లు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కవ. కనుక ఇలాంటి అలవాట్లు ఉన్నవారు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం కూడా గురకకు మంచి పరిష్కారం. ఈ అలవాట్లు గురక మాత్రమే కాదు ఇతర ప్రాణాంతక సమస్యలకు కూడా కారణం అవుతాయి. కనుక ఇలాంటి దురలవాట్లను మానుకోవడం అన్నింటికి మంచిది.
కొంతమంది స్నోరింగ్ రింగ్స్ కూడా వాడుతున్నారు ఈమధ్య. చిటికెన వేలుకి ఒక ఉంగరాన్ని ధరిస్తారు. ఇది గురకను నియంత్రించే రెండు పాయింట్ల మీద ఒత్తిడి కలిగించి గొంతు, స్వరపేటిక భాగంలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ఫలితంగా శ్వాస చాలా క్లియర్ గా ఉంటుంది. అందువల్ల గురక రాదు.
ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా గురక తగ్గకపోతే బెడ్ ఫ్లో వారి అలోవెరా సిలికాన్ ఇయర్ ప్లగ్స్ వాడడం మంచిది. ఇవి నిద్రకు ముందు చెవిలో పెట్టుకోవడం వల్ల నిద్రలో చికాకు కలిగించి నిద్రా భంగం చేసే ధ్వనిని మీ చెవిని చేరకుండా నియంత్రిస్తాయి. ఫలితంగా బాగా నిద్ర పోవచ్చు.
Also Read: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా కనిపిస్తున్నాయా? ఈ కెచప్‌తో తోమారంటే అద్దాల్లా మెరిసిపోతాయ్!