అన్వేషించండి

Herbal Tea Recipe : బరువు, బీపీ, షుగర్ కంట్రోల్ అవ్వాలంటే ఉదయాన్నే ఈ టీ తాగండి.. రెసిపీ ఇదే

Moringa Tea Benefits : రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి.. బరువు తగ్గడం వరకు.. చర్మ ప్రయోజనాల నుంచి.. మధుమేహం కంట్రోల్ చేసేవరకు ఓ టీ నుంచి ఇన్ని ప్రయోజనాలు సాధ్యమేనా?

Moringa Tea Recipe : టీతో ఆరోగ్యప్రయోజనాలు వస్తున్నాయంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అయితే ఇది రోటీన్​ టీలకు పూర్తిగా భిన్నమైనది. సహజమైనది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన ఈ టీ రోజువారీ మల్టీవిటమిన్​లాగా పనిచేస్తుంది. దీనిని హెర్బల్ టీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దీనిని ఓ చెట్టు ఆకులతో తయారు చేస్తాము. 

ఈ టీతో మీరు చర్మ, దంత, హెయిర్, ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. ఇంతకీ ఏ చెట్టు ఆకులతో దీనిని తయారు చేస్తారు అనుకుంటున్నారా? దాదాపు అందరికి సులువుగా దొరికే మునగాకులతో ఈ టీని తయారు చేస్తారు. మరి ఈ మునగాకుల టీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

మునగ ఆకులు - ఎండినవి

తేనె - 1 టీస్పూన్

నీళ్లు - ఒకటిన్నర కప్పు

తయారీ విధానం

మీరు ముందుగా స్టవ్ వెలిగించి దానిలో నీళ్లు వేసి మరిగించాలి. అవి బాగా కాగిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. దానిలో మునగ ఆకులు వేసి ఓ 5 నిమిషాలు మూత వేసి పక్కనపెట్టేయండి. తర్వాత వడకట్టి దానిలో తేనె కలిపి తాగేయడమే. మీరు దీనితో గ్రీన్ టీ ఆకులు కూడా జత చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న మీరు దీని ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. 

మునగ ఆకుల టీని ముఖ్యంగా చలికాలంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ కణాలకు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి విముక్తినిస్తుంది. అంతేకాకుండా ఇది పోషకాలకు వనరు. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం పిల్లలకు కూడా దీనిని ఇవ్వొచ్చు. దీనిలోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఇన్​ఫెక్షన్లకు గురి కాకుండా చేస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రయోజనాలు అందిస్తాయి.

మధుమేహంతో బాధపడేవారికి మునగాకుల టీ ఓ వరం. ఈ ఆకులు ఇన్సులిన్ చర్యను పెంచడంలో, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తపోటును తగ్గించి.. గుండెకు రక్షణ అందిస్తుంది. కాలేయ సంరక్షణ కోసం కూడా దీనిని మీ రోటీన్లో చేర్చుకోవచ్చు. కిడ్నీ సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ మునగాకులు బాగా పనిచేస్తాయి. కాలేయం, ప్యాంక్రియాటిక్, బ్రెస్ట్ క్యాన్సర్ సహా పలు రకాల క్యాన్సర్​లతో పోరాడడంలో హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. 

బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని రోజూ ట్రై చేయవచ్చు. దీనిలోని క్లోరోజెనిక్ ఆమ్లం బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఊబకాయంతో బాధపడేవారు, బరువు తగ్గడానికి సమర్థవంతమైన మార్గాలకోసం చూస్తున్నవారు దీనిని ఫాలో అవ్వొచ్చు. గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, రక్తహీనత, దంత ఇన్ఫెక్షన్లు, హైపర్ టెన్షన్ ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం మునగాకు టీని తాగొచ్చు.

Also Read : ఈ దోశ బరువును, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.. రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Pushpa 2: షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
Embed widget