అన్వేషించండి

Barnyard Millet Dosa : ఈ దోశ బరువును, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.. రెసిపీ ఇదే

Healthy Dosa Recipe : దోశలు అంటే చాలా మంది ఇష్టపడతారు. అలాంటి టేస్టీ దోశ.. హెల్తీ సుగుణాలతో మన ప్లేట్​లోకి వస్తే.. అబ్బా ఆ ఊహ ఎంత బాగుంది.

Adai Dosa Recipe : భారతీయ వంటల్లో వెజ్, నాన్​వెజ్​ వాళ్లు బ్రేక్​ఫాస్ట్​లలో ఎక్కువగా ఇష్టపడేది దోశలే. ఇవి మనకు అనేక రకాలుగా లభ్యమవుతాయి. ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, మసాల దోశ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫ్లేవర్​లలో దోశలు మనకు దొరుకుతాయి. అయితే ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా చేసుకోగలిగే దోశలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఊదాల దోశ. దీనిని తయారు చేయడం చాలా ఈజీ. పైగా ఎక్కువ సమయం కూడా పట్టదు. టేస్ట్​లో అదరగొట్టడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  

కావాల్సిన పదార్థాలు

ఊదాలు - 30 గ్రాములు

ఎర్రని కంది పప్పు - 15 గ్రామలు

పచ్చి శెనగపప్పు - 15 గ్రాములు

ఉప్పుడు బియ్యం - 15 గ్రాములు

కారం - 1 టీస్పూన్

జీలకర్ర - 1 టీస్పూన్

ఇంగువ - చిటికెడు

కరివేపాకు - 1 రెమ్మ (చిన్నది)

నూనె - దోశకు సరిపడ

ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

ఊదాలు, ఎర్ర పప్పు, పచ్చి శెనగ పప్పు, ఉప్పుడు బియ్యాన్ని 2 గంటల ముందు నానబెడితే సరిపోతుంది. అవి పూర్తిగా నానిన తర్వాత వాటిని బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరం అయితే కాస్త నీరు పోసి మళ్లీ గ్రైండ్ చేయాలి. అది దోశ మాదిరి పిండిగా తయారైన తర్వాత వేరె గిన్నెలోకి తీసుకోవాలి. 

ఈ పిండిలో కారం, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. దానిని ఓ పది నిముషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడ స్టౌవ్ వెలిగించి.. దోశ పాన్ పెట్టాలి. దానిపై నూనె వేసి దోశ పిండిని గరిటెతో పోసుకోవాలి. అది ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపు లైట్​గా రోస్ట్ చేసుకోవాలి. అంతే వేడి వేడి ఊదాల దోశ రెడీ. దీనిని మీరు పల్లీ చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో లాగించవచ్చు. 

ఈ దోశలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హాయిగా తినొచ్చు. ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు కోసం వీటిని మీ బ్రేక్​ఫాస్ట్ మెనూలో చేర్చుకోవచ్చు. ఇది పూర్తిగా పౌష్టికాహారం. ప్రోటీన్​లకు మంచి మూలం. బాగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా దీనిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మీ జీర్ణ సమస్యలను దూరం చేయడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. 

ఊదాల్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. కాబట్టి మీరు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటారు. దీనివల్ల చిరుతిండిపై ధ్యాస తగ్గుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని ఏ సంకోచం లేకుండా తమ డైట్​లో చేర్చుకోవచ్చు. ఇది రక్తంలో గ్లూకోజ్, లిపిడ్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. తద్వార షుగర్ కంట్రోల్​లో ఉంటుంది. ఇది డయాబెటిస్ పేషంట్లకు మంచి ఎంపిక అవుతుంది. 

Also Read : క్రిస్పీ మిల్లెట్స్ పొంగనాలు.. టేస్టీ, సింపుల్ రెసిపీ ఇదే 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget