Millets Ponganalu Recipe : క్రిస్పీ మిల్లెట్స్ పొంగనాలు.. టేస్టీ, సింపుల్ రెసిపీ ఇదే
Tasty Millets Recipe : మీరు హెల్త్‌కోసం మీ డైట్లో మిల్లెట్స్ తీసుకుంటున్నారా? అయితే వాటితో మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకోవచ్చు. అవే మిల్లెట్స్ పొంగనాలు.
Healthy Breakfast : మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎన్ని లాభాలు చేకూరుస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇవి కాస్త తక్కువ టేస్ట్‌ని కలిగి ఉంటాయి. కానీ వీటిని ఆరోగ్యం కోసం తింటూ ఉంటారు. కానీ మీరు మిల్లెట్స్‌తో అదిరిపోయే టేస్టీ పొంగనాలు తయారు చేసుకోవచ్చు తెలుసా? చలికాలంలో ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవి చాలా మంచి ఎంపిక. పైగా ఈ రెసిపీలో మనం ఉపయోగించే అన్ని పదార్థాలు ఆరోగ్యానికి మంచి చేసేవే ఉంటాయి. కాస్త ఘాటుగా.. క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు మిల్లెట్స్ పొంగనాలు రెడీ చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మిల్లెట్స్ - కప్పు
మినపప్పు - పావు కప్పు
మెంతులు - 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ - 1 (చిన్నముక్కలుగా తరగాలి)
పచ్చిమిర్చి - 1
అల్లం - 1 అంగుళం
వెల్లుల్లి - 5 రెబ్బలు
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - 1 కట్ట
కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు (తాజా కొబ్బరి తురుము)
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం..
మిల్లెట్స్ పొంగనాలు తయారు చేయడానికి మిల్లెట్స్‌ను కనీసం 8 గంటలు నీటిలో నానబెట్టాలి. అవి పూర్తిగా నానిన తర్వాత బాగా కడిగి.. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. పేస్ట్‌కు తగ్గట్లు నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. పిండి పూర్తిగా జారుడుగా ఉండకూడదు. దీనిని ఓ గిన్నెలోకి తీసి.. ఒక టీస్పూన్ సోడా, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం చిన్నె కడాయి తీసుకోండి. స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. దానిలో ఆవాలు, మినప్పపు వేసి రోస్ట్ చేయండి. అనంతరం కరివేపాకు, అల్లం, వెల్లిల్లి వేసి వేయించాలి. అనంతరం ఉల్లిపాయలు వేసి.. అవి కాస్త రోస్ట్ చేయాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిలో కొత్తిమీర తరగు, కొబ్బరి వేసి కలపండి. వేయించిన ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో వేసి బాగా కలపండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి.
స్టౌవ్ వెలిగించి పొంగనాల పాన్ పెట్టి.. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దానిని వేడి చేయండి. ప్రతి గుంతలోనూ నెయ్యి వేయండి. ఇప్పుడు మిల్లెట్ పిండిని తీసుకుని ఓ స్పూన్‌తో పిండి తీసుకుంటూ.. గుంతలు నింపండి. అలా అని పూర్తిగా అంచువరకు కాకుండా కాస్త వెలితిగా నింపండి. ఎందుకంటే అవి పొంగుతాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు పొంగనాల పాన్‌పై మూత పెట్టి.. ఓ మూడు నిముషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి పొంగనాలను తిరగవేయాలి. రెండు వైపు కాస్త రోస్ట్ అయ్యేవరకు ఉంచాలి. ఇప్పుడు మూత వేయకూడదు. రెండో వైపు కూడా రోస్ట్ అయితే వేడి వేడి మిల్లెట్స్ పొంగనాలు రెడీ. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా మీరు పొంగనాలు వేసుకోవాలి. దీనిని మీరు కొబ్బరి చట్నీ లేదా టోమాటో, పల్లీ చట్నీలతో కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.
Also Read : న్యూ ఇయర్ స్పెషల్ ఘీ రోస్ట్ చికెన్ దోశ.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదిగో