అన్వేషించండి

Ghee Roast Chicken Dosa : న్యూ ఇయర్ స్పెషల్ ఘీ రోస్ట్ చికెన్ దోశ.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదిగో

Chicken Dosa Recipe : మీ న్యూ ఇయర్​ని మంచి, టేస్టీ బ్రేక్​ఫాస్ట్​తో ప్రారంభించాలనుకుంటే మీరు ఘీ రోస్ట్ చికెన్ దోశతో ప్రారంభించవచ్చు. 

Ghee Roast Chicken Dosa Recipe : నూతన సంవత్సరాన్ని కొత్త డిష్​తో ప్రారంభించాలనుకుంటే మీరు నెయ్యితో రోస్ట్ చేసిన చికెన్ దోశను ట్రై చేయవచ్చు. ఇది మీకు అదిరే టేస్ట్​ని ఇవ్వడంతో పాటు.. మంచి అనుభూతిని ఇస్తుంది. దీనిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా దానికోసం ఉపయోగించే మసాల నుంచి.. డిప్​ వరకు అన్ని మీరు సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి టేస్టీ దోశను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు 

నెయ్యితో రోస్ట్ చేయడానికి..

ఎండు మిర్చి - 125 గ్రాములు

ధనియాలు - 30 గ్రాములు

జీలకర్ర - 15 గ్రాములు

మెంతులు - 5 గ్రాములు

మిరియాలు - 5 గ్రాములు

లవంగాలు - 2

వెల్లుల్లి - 5 రెబ్బలు

పసుపు - చిటికెడు

చికెన్ మారినేట్ కోసం..

బోన్​లెస్ చికెన్ - 500 గ్రాములు

పెరుగు - 50 గ్రాములు

నిమ్మకాయ - 1 

చికెన్ వండేందుకు..

చింతపండు గుజ్జు - 20 గ్రాములు

అల్లం పేస్ట్ - 1టీస్పూన్ 

వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

ఉల్లిపాయ - 1 (సన్నగా తరుగుకోవాలి)

టమాట - 1 (సన్నగా తరుగుకోవాలి)

నెయ్యి - 50 గ్రాములు

కారం - 1 టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

దోశ కోసం..

దోశ పిండి 

చీజ్ - 120 గ్రాములు

నెయ్యి - దోశలకు సరిపడా

కొత్తిమీర - 1 కట్ట (సన్నగా తరుగుకోవాలి)

దోశకోసం స్పెషల్ చట్నీ (డిప్)

కరివేపాకు - 4 టీస్పూన్స్

పెరుగు - 100 మి.లీ

ఉప్పు - తగినంత

జీలకర్ర పొడి - 1 టీస్పూన్

పంచదార - కొంచెం

కారం - అర టీస్పూన్

తయారీ విధానం..

ముందు గీ రోస్ట్ మసాలా సిద్ధం చేసుకోవాలి. చిన్న ఫ్రై పాన్ పెట్టి దానిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, లవంగాలు, వెల్లుల్లి, పసుపు వేసి డ్రై రోస్ట్ చేయాలి. మంచి సుగంధం వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అవి చల్లారిన తర్వాత మిక్స్​లో వేసి పౌడర్ చేయాలి. దీనిని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ పొడి ఫ్రిడ్జ్​లో కొన్నివారాల పాటు నిల్వ ఉంటుంది. 

ఇప్పుడు చికెన్​ను మారినేట్ చేసుకోవాలి. చికెన్​ను బాగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ గంట ముందు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిలో నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దానిలో ఉల్లిపాయలు, టమాట ముక్కలు వేసి మగ్గనివ్వాలి. కరివేపాకు వేసి ఫ్రై చేసి.. పదార్థాలను మెత్తగా ఉడకనివ్వాలి. దీనిలో కాస్త నీరు పోసిన పర్లేదు కాని మెత్తగా ఉడకనివ్వాలి. మారినేట్ చేసిన చికెన్​ని దీనిలో వేసి ఉడికించాలి. చికెన్ మెత్తగా అయ్యేవరకు బాగా ఉడికించాలి. చివర్లో చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి. ముందుగా రెడీ చేసుకున్న మసాలా మిక్స్​ కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఉప్పును రుచికి తగ్గట్లు వేసి స్టౌవ్ ఆపేయాలి. 

దోశ కోసం స్టవ్ వెలిగించి.. దానిపై దోశ పాన్ పెట్టాలి. దోశ బ్యాటర్​ వేసి.. దానిపై చికెన్ ఫిల్లింగ్ వేయాలి. దోశ రోస్ట్ అయిపోతే.. వేడి గీ రోస్ట్ చికెన్ దోశ రెడీ. దీనిని మీరు పెరుగు డిప్​లో ముంచి తినొచ్చు. పెరుగు డిప్​ కోసం.. కరివేపాకును బాగా ఫ్రై చేయాలి. దానిని పెరుగులో వేసి బాగా కలపాలి. ఉప్పు, జీలకర్ర, పంచదారం, కారం వేసి స్మూత్​గా వచ్చేవరకు కలపాలి. ఇది గీ రోస్ట్ చికెన్ దోశకు బెస్ట్ కాంబినేషన్ అవుతుంది.

Also Read : న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ బిర్యానీ.. రెసిపీ చాలా సింపుల్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget