News
News
వీడియోలు ఆటలు
X

Onions: వేసవిలో ఉల్లిపాయలు మొలకెత్తుతున్నాయా? ఇలా నిల్వ చేసి చూడండి

ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడం చాలా మంది ఇళ్ళలో చూస్తూనే ఉంటారు. కానీ అలా ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

FOLLOW US: 
Share:

ఉల్లి చేసే మేలు తల్లి కూడ చేయదని అంటారు. భారతీయుల వంటకాల్లో తప్పనిసరిగా ఉల్లిపాయ లేకుండా ఏ వంట పూర్తవదు. ఒక డిష్ కి చక్కని ఆకృతిని ఇస్తాయి. సాస్ ని చిక్కగా చేస్తాయి. కాస్త ఘాటైన రుచి కలిగిన ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే ప్రతీ ఒక్కరి ఇళ్ళలో ఉల్లిపాయలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఇవి కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటే వాటికి మొలకలు రావడం ఎప్పుడైనా గమనించారా? అసలు అవి ఎందుకు అలా వస్తాయో తెలుసా?

వేసవిలో వెచ్చని ఉష్ణోగ్రత, పెరిగిన తేమ స్థాయిల కారణంగా ఉల్లిపాయలు ఎక్కువగా మొలకెత్తుతాయి. ఉష్ణోగ్రత పెరిగే కొద్ది దీని నిల్వ శక్తి మరింత త్వరగా ఉంటుంది. ఫలితంగా ఉల్లిపాయ మొలకెత్తడం ప్రారంభమవుతుంది. వేడి, తేమ బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తుతాయి. వీటిని వేడి లేదా తేమ వాతావరణంలో నిల్వ ఉంచితే వాటి మొలకెట్టే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఉల్లిపాయలని ఇలా నిల్వ చేసుకోండి.

చల్లని, పొడి ప్రదేశంలో పెట్టాలి

వేసవి కాలంలో ఉల్లిపాయలు మొలకెత్తకుండ ఉండాలంటే వాటిని చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. బాగా వెంటిలేషన్ తగిలేలా ఉంచాలి. చల్లని పదేశంలో పెట్టి వాటిని కాగితంలో కప్పండీ. ఇలా చేస్తే ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తవు.

జ్యూట్ బ్యాగ్

మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు జ్యూట్ బస్తా, గోనె సంచులో కనిపించడం చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాటిని నిల్వ చేయదనికి జనపనార సంచి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. వీటిని జ్యూట్ బ్యాగ్ లో పెట్టుకుని పొడిగా ఉన్న ప్లేస్ లో పెట్టుకోండి. లేదంటే చదునైన నేలపై గోనెను విస్తరించి పైన ఉల్లిపాయలు పరుచుకోవచ్చు.

బంగాళాదుంపలు, వెల్లుల్లితో కలపొద్దు

చాలా మంది బంగాళాదుంపలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు కలిపి నిల్వ చేయడం తరచుగా చూస్తూనే ఉంటారు. లేదంటే వాటిని ఆకుపచ్చ కూరగాయలు లేదా సిట్రస్ పండ్లతో కలిపి ఉంచుతారు. మీరు అలాంటి పొరపాటు చేస్తున్నారా? అయితే అవి ఎప్పుడైనా మొలకెత్తుతాయి. ఎందుకంటే అటువంటి కూరగాయాలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఉల్లిపాయలను మొలకెత్తేలా చేస్తుంది. త్వరగా చెడిపోతాయి. అందుకే వీటిని కలిపి కాకుండా విడివిడిగా నిల్వ చేసుకోవడం ఉత్తమం.

ఇవి తప్పనిసరి

ఉల్లిపాయలు ఎప్పుడూ ప్లాస్టిక్ బ్యాగ్ లో నిల్వ చేయవద్దు. బ్యాగ్ లో వేడి ఉత్పత్తి అవుతుంది. వాటిని సులభంగా పాడు చేస్తాయి. అలాగే చాలా మందిఈ రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేస్తారు. అలా అసలు చేయకూడదు. దీని వల్ల అవి త్వరగా పాడైపోతాయి. అంతే కాదు వీటని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల విషపూరితం అవుతాయి. వాటి వాసన ఫ్రిజ్ లోని ఇతర పదార్థాలకు త్వరగా అంటుకుంటుంది. 

Also Read: మహిళలూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మ్యాజికల్ ఫుడ్ టిప్స్ పాటించాల్సిందే

Published at : 11 May 2023 04:18 PM (IST) Tags: Onions Kitchen Hacks Sprouting Onions Onion Storage Tips

సంబంధిత కథనాలు

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్