News
News
వీడియోలు ఆటలు
X

Women Health: మహిళలూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మ్యాజికల్ ఫుడ్ టిప్స్ పాటించాల్సిందే

పనుల్లో పడి మహిళలు సరిగా భోజనం మీద శ్రద్ధ వహించరు. దీని వల్ల శరీరం వీక్ అయిపోయి రోగాల బారిన పడిపోతారు.

FOLLOW US: 
Share:

గవారితో పోలిస్తే ఆడవాళ్ళు త్వరగా అనారోగ్యాల బారిన పడతారు. అందుకు కారణం కుటుంబ, ఉద్యోగ విషయాల్లో పడి ఆహారం మీద అంతగా శ్రద్ధ చూపించరు. దీని వల్ల పోషకాలు తక్కువగా శరీరానికి అందుతాయి. పనుల్లో పడి మహిళలు భోజనం మానేయడం వంటివి చేయడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. ఫలితంగా ఆకలిగా అనిపించడం, శక్తి తక్కువగా ఉంటుంది. ఏకాగ్రతతో రోజంతా పని చేయడం కష్టంగా మారుతుంది. మహిళలు మల్టీ టాస్క్ చేస్తూ ఉంటారు. అందుకే వారికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు కీలకమైన ఏడు పోషకాహారాలు తీసుకోవాలని న్యూట్రీషినిస్ట్ సూచిస్తున్నారు.

⦿ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినాలి. చక్కెర ఆధారిత ఆహారాన్ని నివారించాలి.

⦿ ప్రతిరోజూ కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చాలి. మహిళలు పోషకాహార లోపంతో బాధపడకుండా ఉండాలంటే తప్పనిసరిగా కాల్షియం రిచ్ ఫుడ్ రెండు అయినా తినాలి. పాలు, చేపలు, గుడ్లు, సీజనల్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు, కొవ్వు రహిత ప్రోటీన్లు, నట్స్, పాలకూర, యాపిల్, బొప్పాయి వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది.

⦿ నిమ్మకాయలు తీసుకుంటే మంచిది. నిమ్మరసం, సలాడ్, డ్రెస్సింగ్ లేదా పప్పులకు నిమ్మకాయ లేదా రసం జోడించుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది.

⦿ ఉదయం నిద్రలేవగానే బ్రేక్ ఫాస్ట్ కి ముందు నానబెట్టిన బాదం పప్పులు తినాలి. లేదంటే సాయంత్రం వేల స్నాక్స్ గా కూడా బాదం తీసుకోవచ్చు.

⦿ రోజువారీ భోజనంలో కాసిన్ని మొలకెత్తిన గింజలు చేర్చుకుని చూడండి.

⦿ సమర్థవంతమైన జీవక్రియని నిర్వహించడానికి భోజనం అసలు మానేయవద్దు. రోజుకు మూడు లేదా నాలుగు సార్లు పోషకాలతో నిండిన భోజనం తీసుకోవాలి. రెండు సార్లు స్నాక్స్ తీసుకోవచ్చు. అయితే వీటిని అధిక మోతాదులో కాకుండా చిన్న మొత్తంలో తీసుకుంటే మంచిది.

⦿ పని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఒత్తిడి లేని జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీని నుంచి బయట పడేందుకు యోగా, ధ్యానం, డాన్స్, నడక వంటి కార్యకలాపాలు చేసుకోవాలి.

⦿ వ్యాయామం అసలు మిస్ చేయొద్దు. ఫిట్ నెస్ కి తప్పనిసరి. ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేయడం మంచిది.

⦿ పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటే సమతుల ఆహారం తీసుకోవాలి.

⦿ బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే నిశ్శబ్దంగా మహిళల ఆరోగ్యం మీద అనేక రోగాలు దాడి చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, మధుమేహం, కాలేయ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల లక్షణాలు మొదట్లో ఏమి కనిపించవు. అందుకే మంచి పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 10 May 2023 05:00 AM (IST) Tags: Healthy diet women Health Protein rich food Health Tips For Women

సంబంధిత కథనాలు

Diabetes: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది

Diabetes: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది

Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ

Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ

kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా

kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

టాప్ స్టోరీస్

Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?

Telangana Poltics :  తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా  చక్కదిద్దుతుంది ?

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం -  దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!