Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?
జంతు ఆధారిత పాలు తీసుకోవడం ఇష్టం లేని వీగన్స్ సోయా పాల మీద ఆధారపడతారు. వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సోయాబీన్స్ లోని ప్రోటీన్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించగలదని శాస్తవేత్తలు వెల్లడించారు. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం ప్రోటీన్ బి కాంగ్లిసినిన్‌లో పుష్కలంగా ఉన్న సోయా పిండిని తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే అథెరోస్క్లెరోసిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు తెలిపారు. చెడు కొలెస్ట్రాల్ శరీరానికి ఎంత మేర నష్టం కలిగిస్తుందనే విషయం చాలా మందికి తెలుసు. ఇది ధమనుల గోడలను మూసివేసి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సోయా ఆధారిత ఆహారాలు తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎందుకంటే ఇవి మాంసం కంటే తక్కువ సంతృప్త కొవ్వుని కలిగి ఉంటాయి. మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందిస్తుంది.
శాఖాహారులకు ఇది చక్కని ఎంపిక. సోయాతో చేసిన టోఫు ప్రాసెస్ చేసిన మాంసాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించువచ్చు. సాధారణ పాలకు బదులుగా సోయా పాలు, పెరుగు కూడా తీసుకోవచ్చు. సోయాతో చేసిన సాస్ కూడా తీసుకోవచ్చు. ఇది సోయా బీన్స్ తో తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉండదు. కాకపోతే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కానీ సోయాతో చేసిన ఆహారం తీసుకోవాలంటే మాత్రం ముందుగా వైద్యుని సంప్రదించాలి.
సోయాబీన్ వల్ల ప్రయోజనాలు
సోయా బీన్స్, సోయా ఆహారాలు హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్, కొన్ని రకాల క్యాన్సర్లతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇవి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు తగ్గిస్తుంది. అభిజ్ఞా క్షీణత నుంచి బయట పడొచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి 30 నుంచి 50 mg ఐసోఫ్లేవోన్‌లు సరిపోతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం..
- సగం కప్పు సోయాబీన్స్ - 40 నుంచి 75 mg ఐసోఫ్లేవోన్లు
- పావు కప్పు సోయా పిండి - 45 నుంచి 69 mg ఐసోఫ్లేవోన్స్
- ఒక 250 ml గ్లాసు సోయా డ్రింక్- 15 నుంచి 60 mg ఐసోఫ్లేవోన్స్
- ఒక 115 గ్రా బ్లాక్ టోఫు - 13 నుంచి 43mg ఐసోఫ్లేవోన్స్
- ఒక 110 గ్రా టేంపే బ్లాక్ - 41 mg ఐసోఫ్లేవోన్స్
- సోయా పెరుగు ఒక కంటైనర్ - 26 mg ఐసోఫ్లేవోన్స్
- సోయా బ్రెడ్ 2 ముక్కలు - 7 నుంచి 15 mg ఐసోఫ్లేవోన్లు
- టీస్పూన్ సోయా సాస్ - 0.4 నుంచి 2.2 mg ఐసోఫ్లేవోన్స్ అందుతాయి.
సోయా పాల వల్ల ప్రయోజనాలు
సోయా పాలు అనేవి మొక్కల ఆధారితమైనవి. ఆవు పాలకు చక్కని ప్రత్యామ్నాయం. వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం ఉంటుంది. రక్తపోటుని అదుపులో ఉంచి హృదయనాళ వ్యవస్థ బాగుండెలా చేస్తుంది. సోయా పాలలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రుతుక్రమంలో వచ్చే తిమ్మిర్లు, నొప్పులను తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. బోలు ఎముకల వ్యాధిని రాకుండా అడ్డుకుంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి