By: ABP Desam | Updated at : 06 Feb 2023 02:38 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
బాగా సన్నగా బరువు తక్కువ ఉన్న వాళ్ళు బరువు పెరగాలంటే జంక్ ఫుడ్, పేస్ట్రీలు, కుకీలు, ఐస్ క్రీమ్ వంటి ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల బరువు పెరుగుతారు కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ అధిక కేలరీల ఆహారం తింటే నిస్సందేహంగా బరువు పెరుగుతారు. కానీ అవి శరీరానికి హాని కలిగించే పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు తక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బరువు పెరగడానికి అవసరమైన మంచి ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ లు ఉన్నట్టే పెరగడానికి కూడా డైట్ ప్లాన్ ఉంటుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహాయపడే ఆహారాలు జాబితా ఇది.
అవకాడో: ఎన్నో పోషక గుణాలు కలిగిన అవకాడో ఉత్తమ ఎంపిక. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు గణనీయంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దోహదపడతాయి. ఇందులో విటమిన్ సి, ఇ, కె, ఫోలేట్ తో పాటు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజుకొక చిన్న అవకాడో తింటే చాలా మంచిది. అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుంటుంది. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది.
బంగాళాదుంప: బంగాళాదుంప వంటి పిండి పదార్థాలు త్వరగా బరువు పెరగడానికి రుచికరమైన ఎంపిక. ఇది శరీరానికి అదనపు కేలరీలను అందిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉంటాయి. కండరాల గ్లైకోజెన్ నిల్వలను కూడా పెంచుతుంది.
అరటిపండు: పేదవాడి యాపిల్ అరటిపండు. ఇది అందరికీ అందుబాటైన ధరలో లభిస్తుంది. బరువు పెరగాలని అనుకునే వాళ్ళకి అరటిపండు అద్భుతమైన ఎంపిక. జీర్ణక్రియకి సహాయపడతాయి. అలాగే మూడ్‌ను మార్చేస్తాయి. నిద్ర నియంత్రణకి చక్కగా సహకరిస్తాయి.
పీనట్ బటర్: రుచికరమైన పీనట్ బటర్ బరువు పెరిగెనుకు దోహదపడుతుంది. అధిక కొవ్వు పదార్థం. మోనో, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయి. ఇవే కాదు మంచి మొత్తంలో ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్లు కూడా పొందవచ్చు.
నట్స్: జీడిపప్పు, బాదం, పెకాన్లు, బ్రెజిల్ నట్స్, వాల్ నట్స్, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు బరువు పెంచే సూపర్ ఫుడ్స్. క్రమం తప్పకుండా ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిది. ఇందులో ఆరోగ్యరకరమైన కేలరీలు అందించే పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది.
ఓట్స్: ఓట్స్ తింటే బరువు తగ్గుతారు కానీ పెరగడం ఏంటని అనుకుంటున్నారా? ఇది కేవలం అపోహ మాత్రమే. ఓట్స్ బరువు తగ్గడం, పెరగడం రెంటింటిలోనూ సహాయపడతాయి. అయితే వాటిని ఎలా తింటున్నారనేది ముఖ్యం. పండ్లతో కలిపి ఓట్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు. అదే బరువు పెరగడం కోసం వాటిని అధికంగా కేలరీలు ఉండే చాక్లెట్ చిప్స్, పీనట్ బటర్ తో కలిపి తీసుకుంటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ప్రతిరోజు 3 టేబుల్ స్పూన్ల కంటే కొంచెం ఎక్కువగా ఓట్స్ తీసుకుంటే బరువు పెరగవచ్చు. అంటే 60 గ్రాముల కంటే ఎక్కువ. ఉదయాన్నే అల్పాహారంగా, రాత్రి పడుకునే ముందు అయినా తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: బాయ్స్, రోజూ ఈ టిప్స్ పాటిస్తే చాలు, వృద్ధాప్య ఛాయలు మాయమై యంగ్‌గా కనిపిస్తారు!
Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది
World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?
Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి
Micro Oven: మైక్రోఓవెన్లో ఈ పదార్థాలు పెడితే పేలిపోవడం ఖాయం
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా