అన్వేషించండి

Fenugreek Water : మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ నానబెట్టి తాగితే మంచిదా? లేదా మరిగించి తాగాలా?

Soaked vs Boiled Fenugreek Water : మెంతి నీరు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. అయితే వీటిని నానబెట్టి తాగితే మంచిదా? లేదా మరిగించి తాగితే ప్రయోజనం ఉంటుందా? తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెంతి గింజలు నానబెట్టి, మరిగించి తాగడం ఆరోగ్యానికి మంచిది.
  • నానబెట్టిన నీరు అజీర్తి, యాసిడిటీ తగ్గి శరీరాన్ని చల్లబరుస్తుంది.
  • మరిగించిన నీరు జీర్ణక్రియను వేగవంతం చేసి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
  • రోజుకు 1-2 చెంచాల మెంతులు తీసుకోవాలి, గర్భిణీలు జాగ్రత్త వహించాలి.

Fenugreek Water Benefits : మెంతులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే వీటిని వివిధ వంటల్లో తీసుకుంటారు. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం మెంతి నీరు తాగుతారు. అయితే వీటిని నీళ్లలో నానబెట్టి తాగాలా? లేదా మరిగించి తాగాలా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఎలా తాగినా ఆరోగ్యానికి మేలు జరుగుతాయని ఆయుర్వేదం చెప్తోంది. అయితే వీటిలో ఏ పద్ధతిలో తాగితే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు అందుతాయో తెలుసుకుందాం.

మెంతుల్లోని పోషకాలు

మెంతుల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B6 అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం నుంచి జీర్ణక్రియ మెరుగుపరచడం, కొలెస్ట్రాల్ తగ్గించడం, జుట్టు ఆరోగ్యం పెంపొందించడం వంటి ప్రయోజనాలు అందిస్తాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లు తాగితే ఈ ప్రయోజనాలు వేగంగా కనిపిస్తాయి. మరి నానబెట్టి తాగితే మంచిదా? మెంతులు మరిగించి తాగితే మంచిదా? 

నానబెట్టిన మెంతి నీళ్లతో ఉపయోగాలు.. 

రాత్రుళ్లు ఒక చెంచా మెంతులు గ్లాసు నీళ్లలో వేయండి. ఉదయం వడగట్టి ఆ నీళ్ళు తాగండి. విత్తనాలు కూడా నమిలి తినవచ్చు. దీనివల్ల విటమిన్లు, ఎంజైమ్‌లు పూర్తిగా శరీరానికి అందుతాయి. అజీర్తి, యాసిడిటీ తక్కువగా ఉంటుంది. ఇది వేడిని తగ్గించి.. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. 

మరిగించిన మెంతి నీరు తాగితే.. 

ఒక గ్లాసు నీళ్లలో అర చెంచా మెంతలు వేసి 5 నిమిషాలు మరిగించండి. చల్లారాక వడగట్టి తాగండి. దీనివల్ల జీర్ణం వేగంగా అవుతుంది. మోకాలు నొప్పులు, కీళ్ల వాపులు తగ్గుతాయి. 

ఏ పద్ధతిలో తాగితే మంచిది..

నిపుణుల ప్రకారం నానబెట్టిన మెంతి నీరు డయాబెటిస్, జుట్టు సమస్యలను అదుపులోకి తెస్తుంది. రక్తంలో చక్కెర కంట్రోల్ అవ్వడంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది. మరిగించిన నీళ్లు తాగితే.. కీళ్ల నొప్పులు, వాపు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ బలంగా ఉండాలంటే కూడా మరిగించి తాగితే మంచిది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోజుకు 1 నుంచి 2 చెంచాల కంటే ఎక్కువ మెంతులు తీసుకోకండి. ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు అవుతాయి. గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా లేకుండా తీసుకోకండి. ఉదయం ఖాళీ పొట్టతో తాగితే మంచిది. 30 నిమిషాల తర్వాత టిఫిన్ చేస్తే మంచిది. డయాబెటిస్ మందులు వాడేవారు రక్తంలో చక్కెర స్థాయిలు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget