అన్వేషించండి

Beat the Heat : రోజు రోజుకి పెరుగుతోన్న వేడి, ఉక్కబోత.. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Extreme Heat Warning : ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలు తలెత్తవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు నీరు, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు తాగండి.
  • ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు బయట తిరగడం మానుకోండి.
  • ఇంట్లో చల్లని ప్రదేశంలో ఉంటూ, తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
  • వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Simple Tips to Prevent Heatstroke : తెలుగు రాష్ట్రాల్లో వేడి, ఉక్కబోత రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటువంటి వేడి శరీరానికి ప్రమాదకరమని చెప్తున్నారు నిపుణులు. ఇలాంటి ఎండలో ఎక్కువసేపు ఉంటే.. శరీర ఉష్ణోగ్రత పెరిగి.. డీహైడ్రేషన్, వడదెబ్బకు గురై.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వైద్యులు ఎండ, ఉక్కబోత విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వేడి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. 

హైడ్రేషన్ అన్నింటికంటే ముఖ్యం..

వేడి, ఉక్కబోత వల్ల శరీరం నుంచి చెమట ద్వారా నీరు, ఎలక్ట్రోలైట్స్​ను కోల్పోతుంది. కాబట్టి దాహం వేసే వరకు వేచి చూడకండి. క్రమం తప్పకుండా నీరు తాగండి. ఓఆర్ఎస్, కొబ్బరి నీరు, నిమ్మరసం, తాజా పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరంలోని వేడిని చల్లబరిచి.. అవసరమైన ఖనిజాలను పొందేందుకు హెల్ప్ చేస్తాయి. టీ, కాఫీ, మద్యం, షుగర్ డ్రింక్స్​కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. 

ఆ సమయంలో బయటకి వద్దు..

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సూర్యరశ్మి అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో బయట తిరగడం మానుకోవాలి. తప్పనిసరి అయితే.. లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి వెళ్లండి. అలాగే సూర్యరశ్మి నేరుగా మీపై పడకుండా గొడుగు, టోపీ లేదా సన్ గ్లాసెస్ వంటివి ఉపయోగించాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇంట్లో ఉన్నప్పుడు.. 

సాధ్యమైనంత వరకు ఇంట్లో లేదా చల్లని ప్రదేశంలో ఉండండి. నేరుగా సూర్యరశ్మి పడకుండా కిటికీలకు తెరలు వేయండి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీని ఉపయోగించండి. ఇవి అందుబాటులో లేకపోతే.. చల్లటి నీటితో స్నానం చేయడం లేదా తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా శరీరాన్ని వేడి నుంచి కాపాడటానికి సహాయపడతాయి.

ఫుడ్ విషయంలో మార్పులు

వేసవిలో భారీ, వేయించిన, మసాలా ఫుడ్స్ పరిమితంగా తీసుకోండి. వాటికి బదులుగా పండ్లు, సలాడ్లు, పెరుగు వంటి తేలికైన, నీటి శాతం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఇది మెరుగైన జీర్ణక్రియకు సహాయపడి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. 

వడదెబ్బ సంకేతాలు

వేడి శరీరంలో ఎక్కువైతే.. తల తిరగడం, అధికంగా చెమట పట్టడం, నీరసం, తలనొప్పి, లేదా వికారం వంటి అనేక సంకేతాలను ఇస్తుంది. ఇవి వడదెబ్బకు ప్రారంభ సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి.. నీళ్లు తాగి, విశ్రాంతి తీసుకోండి. పరిస్థితి తీవ్రంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు.

చిన్న పిల్లలు, వృద్ధులు, ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నవారు వేడికి ముఖ్యంగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు తరచూ నీరు తాగేలా చూసుకోండి. ఎండ తగలకుండా చల్లని ప్రదేశంలో ఉండండి. పైన టిప్స్ అన్ని ఫాలో అయితే వడదెబ్బ సమస్య నుంచి తప్పించుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget