Buttermilk: మజ్జిగ తాగితే అన్ని నష్టాలా? ఈ సైడ్‌ఎఫెక్ట్స్ గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు!
మీరు రోజూ మజ్జిగ తాగుతున్నారా? శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం కోసం మజ్జిగను తీసుకోవడంలో తప్పులేదు. కానీ, మోతాదు మించకుండా జాగ్రత్తపడండి.
Buttermilk |ఈ వేసవిలో నిమ్మ రసం తర్వాత అత్యంత రిలీఫ్ ఇచ్చే పానీయం మజ్జిగ. ఇది తాగిన వెంటనే కడుపు చల్లగా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. నిప్పులు కక్కే వేడిలో శరీరానికి చల్లదనం కూడా అందిస్తుంది. మరింత అంత మంచి మజ్జిగను పట్టుకుని ఆరోగ్యానికి హానికరం అని చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చిందనేగా మీ ప్రశ్న. అయితే, మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కొన్ని ఆహారాలు మనకు ఎంత మేలు చేస్తాయో.. అంతే కీడు చేస్తాయి. మంచిది కదా అని అతిగా లాగిస్తే కొత్త సమస్యలు వస్తాయి. మజ్జిగకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.
ముందుగా మనం మజ్జిగ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
❄ మజ్జిగ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
❄ మజ్జిగలో ఉండే కాల్షియం వల్ల ఎముకలకు బలం లభిస్తుంది.
❄ నోటిని ఆరోగ్యంగా ఉంచేందుకు మజ్జిగ సహకరిస్తుంది.
❄ మజ్జిగ జీర్ణక్రియకు సహకరిస్తుంది.
❄ కొవ్వు, రక్తపోటు స్థాయిలను మజ్జిగ అదుపు చేస్తుంది.
❄ మజ్జిగ కడుపును చల్లగా ఉంచుతుంది.
❄ మజ్జిగలో కాసింత అల్లం, కరివేపాకు, మిర్చీ వేసుకుని తాగితే మరికొన్ని పోషకాలు లభిస్తాయి.
❄ మజ్జిగ తాగితే కాల్సియంతోపాటు విటమిన్ B12, ఫైబర్, సోడియం, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.
మజ్జిగ మంచిదే.. కానీ, అందరికీ కాదు: మజ్జిగలోని లక్టోస్ ప్రతికూల చర్య లేదా అందులోని ఉప్పును ప్రాసేస్ చేసే ప్రక్రియ విఫలమైతే అలెర్జీ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉప్పుతో మజ్జిగను తాగడం కూడా అంత శ్రేయస్కరం కాదు. పైగా మజ్జిగను అప్పుడప్పుడు తీసుకోవడమే మంచిది. రోజూ లేదా అతిగా మజ్జిగను తాగడం వల్ల మీరు ఊహించని నష్టాలను చూడాల్సి వస్తుంది. అవేంటో ఇక్కడ చూడండి.
Also Read: ఈ స్నాక్స్‌తో గుండె జబ్బులు పరార్, వీటిని రోజూ తింటే మరింత ఆయుష్షు
❄ చాలా ప్రాంతాల్లో మీగడను చిలికి మజ్జిగ చేస్తారు. ఆ మజ్జిగ పిల్లలకు మంచిది కాదు.
❄ మీగడ క్రీమ్‌గా మారడానికి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు. ఫలితంగా అందులో హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది.
❄ వెన్న తీయగా మిగిలిన మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా వల్ల పిల్లలకు జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.
❄ మూత్రపిండ వ్యాధులు, అధిక రక్తపోటుతో బాధపడేవారికి మజ్జిగలో ఉండే సోడియం కీడు చేస్తుంది.
❄ రాత్రిపూట మజ్జిగ తాగడం అస్సలు మంచిది కాదు. ఇది జ్వరం, జలుబు లేదా పుప్పొడి అలెర్జీని కలిగించవచ్చు.
Also Read: రోజూ ఉదయానే ఇలా చేయండి, ఎంతటి మధుమేహం అయినా నియంత్రణలోకి వచ్చేస్తుంది
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది వైద్యా చికిత్సకు ప్రత్యామ్నయం కాదు. మీరు ఏదైనా డైట్ పాటించేప్పుడు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి.